రమణ కొంటికర్ల

పాఠకులకు నమస్కారం. నా పేరు రమణ కొంటికర్ల. నేను చాలాకాలంగా టీవీ మీడియాలో ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. 2021, జూన్ నుంచి నేను బాతాఖానీ అనే ఓ తెలుగు పోర్టల్ ప్రారంభించి వివిధ రకాల భిన్నమైన కథనాలందించే ప్రయత్నం చేశాను. చాలామంది నుంచి వచ్చిన అభినందనలతో మెల్లిమెల్లిగా పోర్టల్ లో విభిన్న కథనాల సంఖ్య పెంచాము. రోజూ తెల్లార్లేస్తే వివిధ రకాల పత్రికలు, టీవీలు, చేతిలోనే ఉన్న మోబైల్ తో చేతికొచ్చిన సోషల్, డిజిటల్ మీడియా పోటీ కాలంలో బాతాఖానీ కొత్తగా చెప్పేదేంటనే సందేహం రావడం సర్వసాధారణం. అన్నింటికన్నా బెస్ట్ ఇస్తామని మేం చెప్పుకోకపోయినా... ఇప్పుడు నడుస్తున్న ఎన్నో తెలుగు పోర్టల్స్ కంటే విభిన్నమైన కథనాలందించే ప్రయత్నం చేస్తున్నాం. విజయగాధలు, మానవీయ కథనాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక, విద్యా, వైద్య, వ్యవసాయ, సాంకేతిక రంగాలతో పాటు.. వివిధ రకాల కథనాలను వీలైనంత బాగా అందించే మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అయితే, ఇప్పుడు బాతాఖానీ కొత్త రూపు దాల్చుకుని.. సరికొత్తగా మీ ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్ జర్నలిజానికి కూడా కొంత తొవ్వ ఏర్పడుతున్న కాలంలో.. నాకు కాస్తో కూస్తో అబ్బిన విద్యతో నేను సొంతంగా వేసిన అడుగు బాతాఖానీ పోర్టల్ ఏర్పాటు. ఇంతకాలం ఏవిధంగానైతే సహకరించారో.. అదే విధంగా రాబోయే రోజుల్లోనూ మా సైట్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

అయ్యో ఈ కథనమెందుకిచ్చారన్నట్టుగానో.. లేక, పోర్టల్ ఉంది కదా అని థంబ్ నెయిల్స్ తో హడావిడి చేస్తూ విచ్చలవిడి కథనాలందించడమో ఉద్దేశ్యం కాకుండా.. ఒకసారి బాతాఖానీ పోర్టల్ కు సబ్ స్క్రైబ్ అయితే.. మళ్లీ మళ్లీ తర్వాత వచ్చే కథనాలపై ఆసక్తిని రేకెత్తించే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. తెలుగులో కొంత స్టాండర్డ్ పోర్టల్ ఉండాలన్న ఒక లక్ష్యంతో ఏర్పాటు చేశాను. కాబట్టి, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహం, సహకారంతో మరింత ముందుకెళ్లగలనన్న నమ్మకంతో... మీ రమణ కొంటికర్ల.

Bathakani is an independent digital media platform with two separate news and fact-checking units and is owned by Ramana Kontikarla www.bathakani.in domain was registered in 2015 and we started operations in 2016. Initially, Bathakani is run individually by Senior journalist Ramana Kontikarla. As a digital media platform, we are deeply committed to in-depth analysis of contemporary issues, report and comment on news of public interest. We firmly believe in old-fashioned journalism in reporting, analyzing, and commenting on the issues of Public Interest. Firmly committed to reporting unbiased news as it happens and we show utmost respect to democratic values, privacy, and dignity of citizens while reporting. We consistently thrive to build this platform as a top choice for source of the information to provide issues of public interest, happenings in ( Telangana, Andhrapradesh, Indian national news etc ), Politics, Sports, Health, Education, Life Style, etc… We always try to bring the news with greater speed and accuracy. Our editorial team opinions are widely acclaimed by the readers. https://bathakani.in in Telugu is already a top of the choice of the readers for real-time news and in-depth analysis.