డజన్ కు పైగా దేశాలను కలిపే.. పొడవైన హైవే ఎక్కడుంది..?

ఎలాంటి యూటర్న్స్ లేకుండా… 14 దేశాల గుండా వెళ్లే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారిని మీరెప్పుడైనా చూశారా…? కనీసం మీరెప్పుడైనా విన్నారా…?

ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సినిమాలాగే… ఆ అత్యంత పొడవైన రహదారిని ప్యాన్ అమెరికన్ హైవేగా పిలుస్తుంటారు.

రోడ్లు ప్రగతికి బాటలు. ఆ బాటే ఒక ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాలతో మరో ప్రాంతాన్ని కలుపుతుంది. అలాంటి వివిధ దేశాల్లోని భిన్నమైన ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాలను కలుపుతూ సుదూరతీరాన్ని చేర్చే రోడ్డే ఈ పాన్ అమెరికా హైవే.

ఏకంగా 19 వేల మైళ్లు.. అంటే 30 వేల 600 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది ఈ హైవే.

ఉత్తర, దక్షిణమెరికాలను కలుపుతుంది ఈ హైవే. అలస్కాలోని ప్రుధో బే వద్ద ప్రారంభమై… అర్జెంటీనాలోని ఉషుయా వరకూ విస్తరించింది ఈ పొడవైన ప్యాన్ అమెరికన్ రహదారి.

అయితే, మనం హైవేస్ అంటే చాలా రహదారుల్లో వంకర టింకర్లు మనల్ని గందరగోళపరుస్తాయి. అందుకు బోలెడు కారణాలు. బడా బాబుల భూములను తప్పించి.. సామాన్యులకెంతో కొంత పరిహారం ముట్టజెప్పి చేసే భూసేకరణ నుంచి… నాయకులు, బిగ్ షాట్స్ కు సంబంధించిన భూములు, వ్యాపారాలు, హోటల్స్ ఉన్న చోట్ల నుంచి హైవేను మళ్లిస్తే పెరిగే వారి వ్యాపార వ్యూహాల వరకు ఎన్నెన్నో మనం నిత్యం రహదారుల కథల్లో కిటుకుల గురించి వింటుంటాం. ఇప్పటికే బోలెడన్ని విని ఉన్నాం.

కానీ, ఈ ప్యాన్ అమెరికనే హైవే మాత్రం వాటికి భిన్నమైంది.

వంకటటింకర్లు లేని ఓ సరళరేఖ మాదిరిగా ఈ హైవే కనిపిస్తుంది. ఎటుపడితే అటు మలుపులు… ఆ మూలమలుపుల్లో హెచ్చరికల బోర్డులు అవసరం లేనంత సరళంగా.. ఎక్కడో అవసరమైన చోట కొద్దిపాటి మలుపులతో ఈ రోడ్డు నిర్మాణం జరగడం మరో విశేషం.

ఈ రోడ్డుపై ప్రయాణం ఈ మార్గంలో పయనించేవారికి ఓ జ్ఞాపకంలా మారిపోతోంది. ఎలాంటి విరామం తీసుకోకుండా రోజుకు ఓ 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తే.. ఈ హైవే మొత్తం ప్రయాణించేందుకు ఏకంగా 60 రోజుల సమయం పడుతుంది.

ఈ హైవే 14 దేశాల గుండా వెళ్లుతుంది. వాటిలో కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో, గ్వాటెమల, ఎల్ సాల్వడార్, హోండూరాస్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనా.. ఇలా 14 వివిధ దేశాల్లోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను కలుపుతూ చేసే ఓ చారిత్రాత్మక ప్రయాణం ఈ ప్యాన్ అమెరికన్ హైవే టూర్.

కావల్సినంత పచ్చదనాన్నీ చూడొచ్చు. కరాళ నృత్యం చేసే కరవును తలపించే ఎడారీ అనుభవంలోకొస్తుంది. ఆకాశాన్ని తాకే పర్వతాలు వాహనంలోంచి సూటిగా పైకి చూసేంత క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి. తీరప్రాంతాలు కాస్సేపాగితే బాగుండుననే ఫీలింగ్స్ కు కారణమైతాయి. ఇలా ప్రకృతిలోని వైవిధ్యమైన వాతావరణమంతా ఒక్కచోట లభించాలంటే.. ఈ సూపర్ అమెరికన్ ప్యాన్ హైవే మీద ఓసారి ప్రయాణించాలి.

అమెరికాలోని టూరిజంను అభివృద్ధి చేయడానికి… కార్ల అమ్మకాలను పెంచడానికి 1920ల కాలంలో ఈ సుదీర్ఘమైన సుదూరమైన ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన మొదలైంది. లాంగ్ డ్రైవ్ ఇష్టపడేవారికి ఈ హైవే ఓ సూపర్ రోడ్.

1937లో 14 దేశాలు పాన్ అమెరికన్ హైవే కన్వెన్షన్ పై సంతకం చేసినప్పుడు ప్యాన్ అమెరికా హైవే వాస్తవంలోకి వచ్చింది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలను కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టులో 14 దేశాలూ భాగస్వామ్యాన్ని కల్గి ఉన్నాయి. హైవే నిర్మాణంతో పాటు, మెయింటెనెన్స్ లోనూ ఈ దేశాలన్నీ భాగస్వాములే. 1960లో ఈ హైవేను ప్రారంభించారు.

ఇప్పటికీ మన దేశం నుంచి కూడా వివిధ దేశాలను ఓ హాబీగా చుట్టొచ్చేవారెందరో ఉన్న నేపథ్యంలో అలాంటివారికి ఈ ప్యాన్ అమెరికన్ లాంగెస్ట్ హైవే కచ్చితంగా ఓ కొత్త అనుభూతినిచ్చే మంచి ఆప్షన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles