R Samala.. ✍️
—————————————-
Three Legends : One Film
ముగ్గురు లెజెండ్స్ కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా One Battle After Another 2025.

Paul Thomas Anderson (PTA)
PTA తీసింది పది సినిమాలే గానీ వ్యక్తిగతంగా పదకొండు ఆస్కార్ నామినేషన్లు సాధించిన లెజెండరీ దర్శకుడు. కాంప్లెక్స్ కారెక్టర్లతో, స్లోబర్న్ సోసియో పొలిటికల్ డ్రామాలతో తన పాత్రల అంతర్గత ప్రపంచంలోకి మనల్ని బలంగా లాగుతాడు. సాంకేతికంగా చాలా గొప్పగా ఉంటాయి. ఎమోషనల్ కనెక్ట్ కాస్త వీక్ గా ఉండటం ఒక్కటే అతని సినిమాల్లో తరచుగా కనిపించే లోపం. One Battle After Another PTA ప్రతిభను మరోసారి నిరూపించే signature ఫిల్మ్.
@Sean Penn
డబుల్ ఆస్కార్ విన్నర్. గొప్ప నటుడు. అంతకంటే గొప్ప దర్శకుడు. షాన్ పెన్ ది లెజెండరీ సినిమా కెరీర్. షాన్ పోషించిన Colonel Lockjaw పాత్ర, అతడి నటన ఈ సినిమాకి విపరీతమైన వెయిటేజీ ఇచ్చింది. ఆ పాత్ర స్వభావాన్ని షాన్ ఆకళింపుచేసుకున్న తీరు, దాన్ని అభినయించిన విధానం ఏకంగా సినిమా స్థాయినే పెంచేంత గొప్పగా అనిపించింది. ముఖ కవళికల్లో, వాయిస్ మాడ్యులేషన్‌లో, ఆఖరికి నడకలో కూడా ఆ పాత్రని గొప్పగా ఆవిష్కరించాడు. షాన్ ఫిల్మోగ్రఫీలో I Am Sam నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత ఆ స్థాయి నటన మళ్ళీ ఇదే అనిపించింది. Lockjaw పాత్ర వల్లే మనకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. షాన్ వల్లే Lockjaw మనకు గుర్తుండిపోతాడు.
Leonardo DiCaprio
కేవలం 30 సినిమాలతోనే, 8 ఆస్కార్ నామినేషన్లు అందుకున్న డికాప్రియోని ఆక్టింగ్ లెజెండ్ అనడం తప్పు కాదేమో. పవర్ హౌస్ పెర్ఫార్మర్ లాంటి షాన్ పెన్ పక్కన DiCaprio కొంత తెలిపోయినట్టు అనిపించాడు. కానీ అతను పోషించిన ‘బాబ్ ఫెర్గూసన్’ పాత్ర స్వభావమే అలాంటిది. బాబ్ గొప్ప విప్లవవాది కాదు. ఒక ideological drifter. సిద్ధాంతాన్ని నమ్మి ప్రాణాలు పెట్టే టైపూ కాదు. వీక్ పర్సనాలిటీ. ఎప్పుడూ ఏదో ఒత్తిడిలోనే ఉంటాడు. ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు అతడి అయోమయం, బలహీనత, అస్థిరత డికాప్రియో తన కళ్ళలో, బాడీ లాంగ్వేజ్ లో బలంగా చూపించాడు. బాబ్ పాత్ర అర్థమైతేనే డికాప్రియోకి బెస్ట్ ఆక్టర్ నామినేషన్ ఎందుకు దొరికిందో మనకు అర్థమౌతుంది. లేదంటే ఓవర్ రేటెడ్ అనిపించే ప్రమాదం ఉంది.
షాన్ పెన్ సపోర్టింగ్ ఆక్టరుగా, డికాప్రియో లీడ్ ఆక్టరుగా ఆస్కారుకి నామినేటవడం- ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కాంట్రాస్టుని ఆ ఇద్దరు నటులు గొప్పగా అభినయించినట్టు అకాడమీ గుర్తించిందని లెక్క.
One Battle After Another సినిమా 2026 ఆస్కార్ నామినేషన్లలో 13 ముఖ్యమైన కేటగిరీల్లో నామినేషన్ పొందడం, ముఖ్యంగా Best Picture కేటగిరీలో నామినేషన్ రావడం దీని overall craftsకి దక్కిన గౌరవం.
మొత్తానికి ఈ 13 నామినేషన్లు ఈ సినిమాని Must Watch Movieగా నిలబెడితే.. ఆరు ఆస్కార్లతో నెంబర్ వన్ గా నిలిచింది “One Battle After Another.”
బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే,
బెస్ట్ సపోర్టింగ్ ఆక్టర్, (షాన్ పెన్), బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్.



