సెన్సార్ తీరుపై కొంకణా పెదవి విరుపు! ఓ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారు..?

Sai Vamshi…

ADeathintheGunj

Censorship అనేది సినిమాలను దాటి మన వ్యక్తిగత జీవితాల్లోనూ చోటు దక్కించుకుంది. నేను ఒకప్పుడు మాట్లాడినంత స్వేచ్ఛగా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నానన్నది నిజం! మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక Self-Censorship వ్యవస్థ తయారైంది.

‘A Death in the Gunj’ సినిమాకి నేను దర్శకత్వం వహిస్తున్నప్పుడు అందులో ఒక సన్నివేశంలో ‘తాని’ అనే అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ ఒక సిగరెట్‌ని(వెలిగించకుండా) నోట్లో పెట్టుకోవాలని సీన్ రాసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్నివేశాన్ని సెన్సార్ ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే లొకేషన్లో దాన్ని మార్చి ఆ అమ్మాయి సిగరెట్‌ని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నట్లు తీశాను. కానీ దాన్ని కూడా సెన్సార్ ఒప్పుకోలేదు. కట్ చేసింది.

‘A Death in the Gunj’ అనేది అడల్ట్(A) సినిమా. 18 ఏళ్లు దాటిన వాళ్లే ఆ సినిమా చూడాలి. అలాంటివారు ఒక 18 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయి సిగరెట్ పట్టుకునే సీన్ చూసి చెడిపోతారు అని అనుకోవడం, దాని కోసం ఆ సీన్ తీసేయడం చూస్తే నాకు వింతగా అనిపించింది. మనం సినిమాల్లో ఏం చెప్పాలి, ఏం చూపించాలి అనుకుంటామో అది పూర్తిస్థాయిలో బయటికి రాకుండానే మారిపోతుంది. మరుగున పడుతుంది. ఇదొక రకమైన Self-Censorship.

(ఓ ఇంటర్వ్యూలో నటి, దర్శకురాలు కొంకణాసేన్ శర్మ చెప్పిన మాటలు..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles