అదో మార్మిక సరస్సు సరే! మరి నిజమేంటి..??

సీ ఆఫ్ గ్యాలిలీ సరస్సు.. ఎప్పటికీ వీడని ఓ మిస్టరీ. కొంత కాలం ఎర్రటి రక్తంలా కనిపించి ప్రపంచాన్ని నిబిడాశ్చర్యానికి గురిచేసిన గ్యాలిలీ సరస్సులో.. ఓ రెండు వేల ఏళ్ల నాటి పడవ కనిపించడంతో.. అది ఏకంగా క్రీస్తు జ్ఞాపకంగా అభివర్ణించేవారు కనిపిస్తున్నారు. మరి పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులేమంటున్నారు… ఇంతకీ, ఆ గ్యాలిలీ మర్మమేంటి..?

ఇజ్రాయెల్ లోని వాయువ్యతీరం వెంబడి ఉన్న గ్యాలిలీ సరస్సు.. ఓ అంతుచిక్కని మార్మిక ప్రదేశంగా… భక్తులకు అక్కడేదో దైవానికి సంబంధించిన ఆవాళ్లున్నాయన్న నమ్మకానికి సంకేతంగా… శాస్త్రవేత్తలు, పురావస్తుశాఖ పరిశోధకుల శోధనలకు కేంద్రంగా నిలుస్తోంది. అసాధారణ కరవు సమయంలో ఈ సరస్సు సమీపంలో ఓ పడవ బయటపడింది. అది మత్స్యకారులు ఉపయోగించిన పడవలాగే ఉన్నా… ఆ పడవ 2 వేల ఏళ్లకు పూర్వం ఉపయోగించిందనే విషయం మాత్రం సైంటిస్టుల శోధనలో వెల్లడైంది.

మరి జీసస్ కు ఆ పడవకు ఏం సంబంధం..?

1986లో గ్యాలిలీ సరస్సున్న మాగ్దాలా ప్రాంతంలో తీవ్రమైన కరువు నెలకొంది. ఆ సమయంలో ఓ ఇద్దరు అన్నదమ్ములకు మట్టిలో ఓ వస్తువు కనిపించింది. అది ఒక పడవగా గుర్తించారు. ముందు నేటికాలపు మత్స్యకారులు ఉపయోగించే మామూలు పడవే అనుకున్నారు. కానీ, దాని స్వరూపం, నిర్మాణశైలి చూస్తే సందేహాలు వచ్చాయి. ఇంకేం అక్కడికి పురావస్తు శాస్త్రవేత్తలు ఎంట్రీ ఇచ్చారు. కార్బన్ పరీక్షలు, దాని నిర్మాణశైలి అన్నీ పరిశీలించి పరీక్షించాక ఆ పడవ క్రీస్తు కాలం నాటిదని తేల్చారు. కొందరు జ్యోతిష్యులు ఆ సమయంలో ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపించడంతో.. దాన్ని సువార్త కథలకు ఆపాదించారు. ఇంకేం అది జీసస్ పడవ అనే ప్రచారం మొదలైంది.

కిబ్బట్జ్ జిన్నోసర్ కు చెందిన అప్పుడప్పుడే పురావస్తు శాస్త్రవేత్తలుగా ఎదుగుతన్న ఇద్దరు అన్నదమ్ములైన మోషే, యువల్ లుఫాన్ మొదట ఆ పడవను గుర్తించారు. దాని చారిత్రక విలును అంచనా వేశారు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీ అథారిటీకి తెలియజేశారు. జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టారు. 12 రోజులపాటు ఆ తవ్వకాలు జరిగాయి. నిపుణులైన బృందంతో బురద నుంచి పెళుసైన ఆ ఓడను పైకి లేపి దాని ఆకారం ఏమాత్రం దెబ్బతినకుండా పైకి తీసుకొచ్చారు. దాన్ని కిబ్బట్జ్ జిన్నోసర్ లోని మ్యూజియంకు తరలించి.. పైనుంచి ఫైబర్ గ్లాస్ ను ఏర్పాటు చేసి ప్రదర్శనకుంచారు. ఇప్పుడా ఆ పురాతన పడవను చూడ్డానికి సందర్శకుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. దాన్ని శాస్త్రీయ కోణంలో తెలుసుకోవాలనుకునేవారితో పాటు… సాక్షాత్తూ జీసెస్ కు చెందిన పడవగానే భావిస్తూ వచ్చే భక్తుల సంఖ్యా ఇజ్రాయెల్ లోని కిబ్బట్జ్ జిన్నోసర్ కు పెరిగింది.

బైబిల్ పై పట్టున్న ఓ మత ప్రబోధకుడైన హెర్మాన్ ఏమంటారంటే.. గ్యాలిలీ సరస్సులో బయటపడ్డ పడవ 2 వేల ఏళ్ల నాటి పురాతనమైందని.. సువార్తలో ప్రస్తావించబడిన రకమని చెబుతారు. దాదాపు 12 మంది వ్యక్తులకు సరిపోయే పరిమాణంలో ఉంటుంది ఈ పడవ. కార్బన్ పరీక్షలు, సముద్ర గర్భంపై పట్టున్న నిపుణుల పరిశోధనలు, విశ్లేషణల్లో.. పురాతన రోమన్లకు సంబంధించిన పడవగా కూడా అనుమానించారు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ కర్జ్ రావేహ్ ఏమంటారంటే.. ఏసు దానిపై పయనించాడనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలను ఎవరూ నిరూపించలేరు. ఆ కాలంలో ఈ సరస్సుపైన ఏకంగా 600 పడవలు నడిచినట్టుగా కూడా కొన్ని పరిశోధలను చెబుతున్నాయంటారాయన.

అయితే, సాక్షాత్తూ జీసస్ బోటుగా అభివర్ణించబడుతున్న ఈ పడవ 8.3 మీటర్లు.. అంటే 27 అడుగుల పొడవు, 2.3 మీటర్లు.. అంటే ఏడున్నర అడుగుల వెడల్పుతో పాటు.. 1.3 మీటర్లు అంటే 4.3 అడుగుల ఎత్తుతో ఉంది. దేవదారు కలపతో సహా.. వివిధరకాల పది కలపలతో దీన్ని తయారుచేసినట్టుగా చెబుతున్నారు. నీరు తక్కువ ఉన్నచోట కూడా ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా ఉండేలా ఫ్లాట్ గా ఈ పడవ నిర్మాణశైలి ఉంటుంది. నాటి కాలంలో చేపలు పట్టే మత్స్యకారులు ఉపయోగించే పడవలకు భిన్నమైన నిర్మాణశైలి దీని సొంతం.

ఈ పడవ బయల్పడ్డ చోటే.. పురావస్తు శాస్త్రవేత్తలకు ఓ వంటకుండ, ఓ నూనె దీపం వెలిగించిన చెమ్మ లాంటి వస్తువులు లభించాయి. ఈ పడవలో రాత్రి ప్రయాణాలు చేసి ఉంటారని వారి అంచనా. ఆ నూనె దీపం కూడా దొరకడంతో.. ఏసు సముద్రాన్ని శాంతిపజేసే ఓ గోస్పెల్ సువార్త కథలాగే… రాత్రి ప్రయాణానికి ఆ దీపం ఉపయోగపడి ఉంటుందనేది ఇక్కడికొచ్చే భక్తుల భావన.

జీసస్ బోట్ వెలికితీత, సంరక్షణ!

ఈ బోట్ వెలికితీత ఓ సున్నితమైన ప్రక్రియ అంటారు మరో పురావస్తు శాస్త్రవేత్త షెల్లీ వాచ్స్ మన్. దీన్ని సంరక్షించేందుకు 16 ఏళ్ల నుంచీ కష్టపడుతున్నారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు బురదను పారదర్శక రసాయన ద్రావణంతో భర్తీ చేసి ఆ మాడల్ లో తయారు చేసి మ్యూజియంలో పెట్టారిప్పుడు.

2000 సంవత్సరం నుంచి ఈ జీసెస్ బోట్ ను గిన్నోసార్ లోని ఈగల్ అల్లోన్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ యాత్రీకులు, చరిత్రపై మమకారమున్నవారెందరో ఈ బోట్ గురించి తెలుసుకోవడానికి, చూడటానికి ఇక్కడి క్యూ కడుతున్నారు. కేవలం పురావస్తు పరిశోధనలో బయటపడ్డ ఓ పురాతన వస్తువైతే ఈ పడవ వీక్షణకు అంత ఆదరణ దక్కేది కాదు.. కానీ, ఇది జీసెస్ ప్రయాణించిన బోట్ గా ఎప్పుడైతే ప్రచారం పుంజుకుందో.. ఇక ఇక్కడి తరలివచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

గ్యాలిలీలో బయటపడ్డ పడవకూ, బైబిల్ కూ ఎంటీ సంబంధం..??

ఏసు నీటిపై నడిచిన బైబిల్ కథనాన్ని ఆవిష్కరించే విధంగా ఈ పడవ నాటి కాలంది కావడం, కొందరు జ్యోతిష్కులు, మత ప్రబోధకులు ఇది క్రీస్తునాటిదేనని ప్రచారంలోకి తీసుకురావడంతో.. గ్యాలిలీలో బయటపడ్డ పడవకూ, బైబిల్ కు మధ్య బంధం ఎస్టాబ్లిష్ అయింది. 5 వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత ఏసు తన శిష్యులను గ్యాలిలీ సరస్సు దాటించి పంపించాడని చెబుతుంటారు. తుఫాన్ దెబ్బకు తన శిష్యులు జీవన్మరణ పోరాటం చేస్తున్న సమయంలో ఏసు నీటి గూండా ప్రయాణించి వారిని కాపాడాడన్నది ఆ కథ సారాంశం. అలా ఏసు తన శిష్యులను కాపాడిన పడవే.. గ్యాలిలీ సమీపంలో బయటపడ్డదన్న ప్రచారంతో.. అంతకుముందు ఎన్నో మిస్టరీలకు కేరాఫ్ గా నిల్చిన ఈ సరస్సు.. మరోసారి ఈ కొత్త కథతో వార్తల్లోకెక్కింది. అంతేకాదు క్రీస్తు సంచరించిన పవిత్ర ప్రదేశంగా కూడా నమ్మే భక్తుల సంఖ్య అధికసంఖ్యలో కనిపిస్తుండటంతో పాటు.. ఈ సీ ఆఫ్ గ్యాలిలీ.. లోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ గా కూడా పర్యాటకులకు ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది.

గతంలో సరస్సు రెడ్ గా మారడానికి గల కారణాలేంటి మరి..?

సీ ఆఫ్ గ్యాలిలీ రెడ్ కలర్ లోకి మారిపోవడంతో అప్పటివరకూ పర్యాటకులతో రద్దీగా కనిపించిన ఆ ప్రాంతం ఒక్కసారిగా కొంతకాలం బోసిపోయింది. ఆ నీళ్లను చూసిన పర్యాటకులు కనీసం అక్కడికి వెళ్లకుండానే వెనుదిరిగారు. అది కాస్తా టాక్ ఆప్ మౌత్ గా విస్తరించి అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పడిపోయింది. దాంతో ఇజ్రాయెల్ వాటర్ ఎక్స్పర్ట్స్, శాస్తవేత్తలు దానిపై పరిశోధనలు జరిపారు. అక్కడి సరస్సులో గ్రీన్ ఆల్గే ఉందని.. అది బొట్ర్యోకాకస్ బ్రానీ అని.. అందువల్లే నీలిరంగులో ఉండే నీళ్లు ఒక్కసారిగా ఎర్రరంగులోకి మారినట్టు పరిశోధనల్లో తేలింది. అయినా అక్కడికొచ్చే భక్తులు, పర్యాటకుల్లో భయం నెలకొంది. ఆ సరస్సులో స్నానం చేయొచ్చా, లేదా అనే అనుమానాలతో.. శాస్త్రజ్ఞులు మరిన్ని పరిశోధనలు చేసి.. ఎకో సిస్టంకు ఎలాంటి హాని జరగలేదని తేల్చారప్పుడు. అయితే, అదే సమయంలో భవిష్యత్తులో హైపోక్సియా.. అంటే, లో లెవల్స్ ఆఫ్ ఆక్సిజన్ వంటి ప్రమాదముందని శాస్త్రవేత్తలు ఓ అంచనా వేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles