అక్కడ అత్యంత ఇష్టపడే వృత్తి.. ప్రైమరీ స్కూల్ టీచర్! ఎందుకో తెలుసా..?

ఫిన్లాండ్ టీచర్లు

డా. పుల్లూరి సంపత్ రావు.. ✍🏻

టీచర్లను ఫిన్లాండ్ సమాజం నమ్ముతుంది. స్కూళ్ళను ట్రస్ట్ బేస్డ్ స్కూళ్ళు అంటారు. వార్షిక జాతీయ అభిప్రాయ సేకరణలో ప్రతిసారి అత్యంత ఇష్టపడే వృత్తిగా “ప్రైమరీ స్కూల్ టీచర్” నిలుస్తున్నది.

డే కేర్ వర్కర్, నర్స్, ప్రి స్కూల్ టీచర్, క్లాస్ రూం టీచర్, సబ్జెక్ట్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, వొకేషనల్ టీచర్, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ వంటి వివిధ రకాలైన హోదాలలో స్కూళ్ళలో పని చేస్తారు. ప్రి-స్కూల్ టీచర్లకు డిగ్రీ, సబ్జెక్ట్ టీచర్లకు, క్లాస్ రూం టీచర్లకు మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మాస్టర్ డిగ్రీ, వొకేషనల్ టీచర్లకు వొకేషనల్ డిగ్రీతో పాటు అనుభవం తప్పనిసరి. ప్రిన్సిపాళ్లకు, వైస్ ప్రిన్సిపాళ్లకు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ లో సర్టిఫికేట్ కావాలి. దీన్ని ఎడ్యుకేషన్ లీడర్షిప్ ప్రోగ్రాం అంటారు. ఇది 18 నెలల కోర్స్. ఇందులో ఎడ్యుకేషన్ లో డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళు శిక్షణ ఇస్తారు.

టీచర్లు రెండు మూడు భాషలు మాట్లాడగలగాలి. రెండు మూడు సంవత్సరాల పాటు ఒకే క్లాస్ డీల్ చేస్తారు. టీచర్లు స్వతంత్రంగా పనిచేసే సంస్కృతి ఉంది. తమ క్లాస్ రూమ్స్, సిలబస్, టెక్స్ట్ బుక్స్, లెసన్ ప్లాన్స్, పరీక్షలపై వాళ్ళదే నియంత్రణ. రోజుకు మూడు నాలుగు లెసన్స్, ఒక్కో క్లాస్ 45 నిముషాలు ఉంటుంది. తర్వాత 15 నిమిషాల విరామం ఉంటుంది. వారానికి 32 గంటల పనిభారం ఉంటుంది. ప్రిన్సిపాళ్లు స్కూల్ బడ్జెట్ పై నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి టీచర్లను నియంత్రణ, పరిశీలన, అంచనావేసే ఆచారం లేదు. టీచర్లపై ఎలాంటి నిఘా ఉండదు. ప్రతి సంవత్సరం ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. విద్యారంగంలో ఎదుర్కునే సమస్యలను, విజయాలను, నూతన ప్రయోగాలను, ప్రణాళికలను చర్చిస్తారు. సంవత్సరానికి సగటున ఏడు రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి.

టీచర్ పోస్టులకు గట్టి పోటి ఉంటుంది. ఉద్యోగం రావడం చాలా కష్టం. ఈ ఉద్యోగానికి అప్పర్ సెకండరీ స్కూల్ రికార్డ్, మెట్రికులేషన్ స్కోర్, చేసిన ఎక్స్ ట్రా కరికులర్ ఆక్టివిటిస్, బహుళ ఐచ్చిక ప్రశ్నలతో ఒక పరీక్ష, ఆ పైన ఇంటర్వ్యూ ఉంటుంది. నువ్వు టీచర్ కావాలని ఎందుకనుకుంటున్నావు? టీచర్ అవుతున్నావని ఎలా తెలుస్తున్నది? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంటుంది.

ఎనిమిది విశ్వవిద్యాలయాలు టీచర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. ఇది ఐదు సంవత్సరాల కోర్స్. ఇందులో పరిశోదనపై ఆధారపడిన బోధనా పద్ధతులు ఉంటాయి. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అందులో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఇక్కడ టీచర్లు, పరిశోధకులు నూతన బోధనా పద్దతులను అభివృద్ధి చేస్తారు. ఇలాంటి టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ కౌన్సిల్ పర్యవేక్షణ చేస్తుంది. “ఆకలితో నోళ్ళు తెరుచుకున్న పక్షి పిల్లల వలె ఛాత్రోపాధ్యాయులు నేర్చుకోవాలనే ఉత్సుకతతో ఇక్కడకు వస్తారని” ఒక టీచర్ ట్రైనింగ్ అధ్యాపకుడు అన్నారు. వాళ్ళకు డాక్టర్లను తయారు చేసినంత శ్రద్ధగా శిక్షణ ఇస్తారు.

టీచర్ల జీతాలు మిగతా ఉద్యోగాలతో పోలిస్తే తక్కువేగాని గౌరవం ఎక్కువ. ఫిన్లాండ్ లో టీచర్లకు కనిష్టంగా నెలకు 1750 యూరోలు(Rs.1,52,220) గరిష్టంగా 5570 యురోలు(Rs.4,84,528) సగటున 3570 యురోలుగా (Rs.3,10,527) ఉంది. ప్రపంచంలో ఎక్కువ జీతాలిస్తున్న జాబితాలో ఫిన్లాండ్ లేదు. అత్యదిక జీతాలు ఇస్తున్న దేశాలు వరుసగా స్విట్జర్ల్యాండ్ (Rs.6,71,423), లక్జెంబర్గ్ (Rs.6,10,333), కెనెడా(Rs.5,72,021), జర్మని(Rs.5,12,723), నెదర్లాండ్(Rs.4,08,957), ఆస్ట్రేలియా(Rs.4,08,957), అమెరికా(Rs.3,66,231), ఐర్లాండ్(Rs.3,23,520), డెన్మార్క్(Rs.3,17,400), ఆస్ట్రియా(Rs.3,05,192). ఇంచుమించుగా ఇలా ఉంటాయి. ఎందుకంటే కరెన్సీ మారకం రేట్లు రోజు రోజుకు మారుతాయి.

పిల్లలు టీచర్లను మెంటర్ గా భావిస్తారు. టీచర్లు దేశానికి మంచి ప్రజలను తయారు చేయాలి. కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత స్థితిగతులతో సంబంధం లేకుండా పిల్లలందరికీ మంచి స్కూలు అందుబాటులో ఉండాలనేది ఫిన్లాండ్ లో నాలుగు దశాబ్దాలుగా మారని కల. ఇలాంటివి ఫిన్లాండ్ జాతీయ విద్యా లక్ష్యాలుగా ఉన్నాయి. ఇక్కడి టీచర్లు స్వతంత్ర వృత్తి నిపుణులు. యువ జీవితాల్లో మార్పు తెస్తారనే నమ్మకమే వారికి గౌరవాన్ని తెచ్చిందని విద్యారంగ పరిశోధకుడు “పాసి సాల్బర్గ్” అభిప్రాయం.

ఫిన్లాండ్ విద్యావిధానంపై మరిన్ని స్టోరీస్ మీ బాతాఖానీలో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles