RandomMindlessRamblings
S… ✍️
ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లో ఒక చిన్న పాప తండ్రి మీద కొన్ని అభ్యంతరకరమైన జోకులు వేసాడు. అతని మిత్రబృందం ఇంకొన్ని ఆకులు ఎక్కువే చదివారు. ఇంటర్నెట్ భగ్గుమంది. ఈ మొత్తం వ్యవహారంలో అన్నిటికంటే పెద్ద నష్టం జరిగింది మాత్రం డార్క్ కామెడీ కే. ఎందుకంటే ఆ వీడియోలో వాళ్ళు చేసింది డార్క్ కామెడీ కాదు. They are just filthy jokes, if they can be called jokes in the first place. కానీ డార్క్ హ్యూమర్ పరిచయం లేని వాళ్లకు అదే డార్క్ కామెడీ అనే అపోహ మాత్రం బాగా బలపడింది. Not wanting to see the name of dark humor dragged through the mud, I wanted to write about it.

ఇది డార్క్ కామెడీ, ఇది కాదు అని వ్యత్యాసం చెప్పబోవడం అంత సులభం కాదు:
వీటికి నిర్థిష్టమైన పరిధులు ఉండవు కాబట్టి, ఒక వేళ ఉన్నా ఆ పరిధుల్ని స్పష్టంగా నిర్ణయించే అధారిటీ ఎవరికీ లేదు కాబట్టీ. డార్క్ హ్యూమర్ లక్షణాల్ని మాత్రమే అర్ధం తెలుసుకుంటే ఇలాంటి cross comedy కి అవి అతుకుతున్నాయి కదా అనుకొనే అవకాశం ఉంది. అందుకే కేవలం లక్షణాల్ని మాత్రమే కాకుండా డార్క్ హ్యూమర్ యొక్క “స్పిరిట్” ని అర్ధం చేసుకోవాలి.
“subjects that are normally considered serious or painful to discuss” మీద కామెడీ చేయడమే డార్క్ కామెడీ గా పరిచయం చేస్తుంది. వికీపీడియా. చావు, ఆత్మ హత్య, డిప్రెషన్, రేప్, existential dread, జీవితపు అర్ధరాహిత్యం, ముసలితనం, అవిటితనం, ఇలాంటి సున్నితమైన, విషాదకరమైన విషయాల మీద హాస్యాన్ని పండించడమే లక్ష్యం. ఐతే ఇందాక అన్నట్టు ఇది నిర్వచనం, లేదా లక్షణం మాత్రమే. ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న వేసుకుంటేనే దాని ఆత్మను పట్టుకోగలం. మానవ జీవితాల్ని మనమే డిజైన్ చేయగలిగే హోదాలో మనం ఉంటే మనుషుల కధల్ని, అందులో పరిస్థితుల్ని ఎలా రాస్తాము? అన్నీ “బిగ్ ఈవెంట్స్” లెక్కల్లో, డ్రామాటిక్ మలుపుల గీతల మధ్య, నరేటివ్ కి అనుగుణంగా రాస్తాము. హీరోలు, విల్లన్లు, సైడ్ క్యారెక్టర్లు ఉంటారు. మీనింగ్ ఫుల్ ఎండింగ్స్ ఉంటాయి. మనుషులకు కష్టాలు ఉన్నా వాటికి ఒక పర్పస్ ఉంటుంది. ఐతే నిజ జీవితంలో ఎందుకు అలా లేదు? ప్రకృతి మనలా సినిమాలు చూడదు, నవలలు చదవదు. దాని “ఈవెంట్స్” మన ఈవెంట్స్ తో మ్యాచ్ అవ్వవు. ప్రపంచ గతిని మార్చగలిగే రాజకీయ నాయకుడు ఫలానా బీచ్ లో ఉన్నాడని వస్తున్న సునామీ ఆగిపోదు. అతణ్ణి తుడిచిపెట్టేస్తుంది. కథ ఎలా నడవాలి అని మనం అనుకున్న దానికీ, ప్రకృతి తన బద్ధకపు ఒళ్ళు విరుపుల్లో లెక్క లేకుండా విరక్కొట్టే జీవితాలకీ పొంతన ఉండనే ఉండదు. ఈ నేపథ్యంలో ప్రకృతి, విధి, మన తలకు మించిన ప్రపంచం, వాటి వాటి కదలికల్లో చేసే విన్యాసాల పర్యవసనాల అదృష్ట ఫలితం మీద బ్రతుకీడ్చడం తప్ప వేరే గత్యంతరం లేని మనకు ఊరట ఎలా? ఆర్ట్ ఉంది సరే. గంభీరంగా మరణం గురించి వ్యాఖ్యానం చెయ్యడానికి Ingmar Bergman సినిమాలు సరిపోతాయి. గాంభీర్యం యొక్క పెద్ద పెద్ద వేళ్ళ మధ్య నుంచి జారిపోయే collateral damage సంగతి? నిర్దాక్షిణ్యంగా చిదిమేయబడే కలల సంగతి? ఈ తుఫానులో కుం*టి కాలితో పరిగెత్తుకెళ్లే నిరర్ధక ప్రయత్నం చేసే మన పిచ్చి ఆశపోతు నైజం గురించీ ఏ భాషలో మాట్లాడాలి? అందుకు గొడ్డలి లాంటి గాంభీర్యం పనికిరాదు. ఓ పదునైన సన్నటి బ్లేడు కావాలి.
డార్క్ హ్యూమర్ కమీడియన్ చావు మీద జోకులు వేస్తే అతను హ్యూమన్ డిసెన్సీకి వ్యతిరేక దిశలో వెళుతున్నాడని కాదు. మన మీద నియంత్రణ కలిగిన చావు మీద జోక్ వేసి దానికి మన మీద ఉన్న పవర్ లో కొంత లాక్కోవడమే అక్కడి ఉద్దేశం. ఈ కామెడీ దృష్టిలో “హేయ్, అవి చాలా సీరియస్ విషయాలు, వాటి మీద జోకులు వేస్తావా” అని ఉలిక్కిపడే సమాజోద్దారకులు ఆ సీరియస్ విషయాలకు మరింత పవర్ ఇస్తున్నట్టు. “మనుషులుగా వీటిని నివారించలేము కానీ ఇవి మా ఆత్మను విరచలేవు” అని తల ఎగరేసే ధిక్కారం ఈ డార్క్ హ్యూమర్ ఆత్మ. ఆ ధిక్కారాన్ని చూపించడానికే జోకు వేసేది. నీ ప్రతీ మాటకీ తూకం వేసి పెదరాయుడి కుర్చీ మీద నుంచి తీర్పు చెప్పి వాళ్ళ ఇగో ను సంతృప్తి పరుచుకోవాలని ఉబలాటపడే కపట సంఘ సంస్కర్తల్ని పట్టించుకోకుండా ఉండగలిగినప్పుడే ఈ wavelegth లో మైండ్ పని చేస్తుంది. ఐతే ఇది కత్తి మీద సాము. ఒక రేప్ జోక్ ఆ విక్టిమ్ ని వేళాకోళం చేస్తుందా, లేక రేప్ లోని absurdity ని ఎత్తి చూపిస్తుందా అన్నది ముఖ్యం. ఇది అన్ని వేళలా స్పష్టంగా తేటతెల్లం చేయడం సాధ్యపడకపోవచ్చు. వాటి interpretation రకరకాలుగా ఉండచ్చు. ఇక్కడ కొంత unease వస్తుంది. ఆ జోక్ ని సృష్టించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసారో ప్రతీ సారీ అంత క్లియర్ గా ఉండకపోవచ్చు. ఐతే వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఆ జోక్ ని రిసీవ్ చేసుకునే మన ఉద్దేశం లో మనం refined గా ఉండవచ్చు. డార్క్ హ్యూమర్ కి కొన్ని licences ఇవ్వడానికి మనం సిద్ధపడితేనే అది మనగలుగుతుంది.
ప్రవీణ్ హనుమంతు, అతని మిత్రులు చేసింది డార్క్ హ్యూమర్ కాదని ఎందుకన్నాను? ఎందుకంటే వాళ్ళ జోకుల్లో ఈ empathy ఎక్కడా లేదు. వాళ్ళ ప్రపంచ దృక్పదంలో ఈ పరిణితి లేదు. వాళ్ళకి ప్రపంచంలో వేదన మీద తిరుగుబాటు లేదు. కేవలం సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తూ edgy గా ఏదో ఒకటి మాట్లాడి కాస్త అటెన్షన్ కొట్టేయాలనే దురద తప్ప ఏమీ లేదు. They just have a crippled understanding of dark humor and they are not even funny.
అన్నిటికీ మించి, భారత దేశంలో డార్క్ హ్యూమర్ మనగలుగుతుందని నేననుకోను. We are not culturally equipped with the tools to handle it. ఎందుకంటే బయట కనిపించే ప్రాపంచిక వేదన అంతటికీ ఇక్కడ “కర్మ” కారణంగా చెప్పబడుతుంది. ఒకడు పుట్టుక తోనే కాళ్ళు చేతులు పని చేయడం లేదా? వాడు గత జన్మలో పాపం చేసి ఉంటాడని ఇక్కడ నమ్మకం. Then there is nothing absurd to make fun of. నిరర్ధకమైన వేదన కి కారణం కనబడక పుట్టిందే ఈ absurdist హ్యూమర్ ఐతే, దానికి “కర్మ” అనే ఒక స్పష్టమైన కారణాన్ని ఆపాదించేసిన మతం రాజ్యమేలే దేశంలో డార్క్ హ్యూమర్ కి context ఉండదు. అందులోనూ సంవత్సరం పొడుక్కీ పువ్వులు, ఆకులు, తోరణాలు కట్టి పండగలు చేసుకునే సంస్కృతిలో, తాత్వికత ఎక్కువ కనబడితే వాడికి పెళ్లి చేసి సంసార వ్యవహారాల్లో ముంచేయడమే పరిష్కారంగా పెట్టుకున్న సమాజంలో ఈ డార్క్ హ్యూమర్ ఇమడదు.



