యాంటీ ఏజింగ్ పై నవయవ్వనస్థుల లొల్లి: సోషల్ మీడియాలో రాందేవ్ వర్సెస్ జాన్సన్!

ఎప్పుడూ మార్కండేయుడై, నవ యవ్వనస్థుడై ఉండాలనుకునే కొందరు మనిషుల కోరికలు… యాంటీ ఏజింగ్ దిశగా ఎన్నో ఆవిష్కరణలకు తెరతీస్తున్నాయి. అందులో ఇద్దరి పేర్లు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి తన వయస్సును రీరైట్ చేసేలా ఏకంగా 30 మంది డాక్టర్ల బృందాన్ని నియమించుకుని మిలియన్ డాలర్స్ వెచ్చిస్తున్న బ్రయాన్ జాన్సన్ ఒకరైతే.. ఆర్గానిక్ గా తయారయ్యే తన పతంజలి బ్రాండ్స్ తో సౌందర్యాన్ని, యవ్వనాన్ని ఎలా ఇనుముడించుకోవచ్చో చెబుతూ అందుకు తానే ఓ బ్రాండ్ అంబాసిడర్ లా అప్పుడప్పుడూ వార్తల్లోకెక్కే రాందేవ్ బాబా మరొకరు. ఇప్పుడీ ఇద్దరి మధ్యా ఫైట్ కు తెరలేచి సోషల్ మీడియా అటెన్షన్ ను గ్రాబ్ చేస్తోందీ వార్త.

రోగనిరోధక శక్తితో పాటు, మనిషి స్టామినాను పెంచే విధంగా, వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదిపర్చేలా స్వర్ణ శిలాజిత్.. అలాగే, ఇమ్యునోగ్రిట్ గోల్డ్ అనే పతంజలి బ్రాండ్ మందులను ప్రమోట్ చేసే క్రమంలో రాందేవ్ బాబా ఓ గుర్రంతో కలిసి పరిగెత్తే వీడియాను Xలో పోస్ట్ చేశాడు. వీటితో నవయవ్వనస్థులుగా మారిపోవచ్చని, మీ దేహదారుఢ్యం, శక్తియుక్తులు పెరుగుతాయని పేర్కొంటూనే.. బ్రయాన్ జాన్సన్ ను గెలికాడు రాందేవ్. ఇన్ని ఉన్నా బ్రయాన్ జాన్సన్ మాత్రం వీటిని కొనడం లేదు. ఇలాంటి ప్రకృతి సిద్ధమైనవాటిని కాదని.. ఏవేవో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాడన్నట్టుగా ఆ పోస్ట్ లో ఒక్కమాటతో జాన్సన్ పై సెటైర్ వేశాడు రాందేవ్.

కానీ, జాన్సన్ మాత్రం ఊరుకుంటాడా…? ఇప్పటికే అసలీ వయస్సు మీదపడటమేంటి, వృద్ధాప్యం రావడమేంటి నాన్సెస్.. వాటి సంగతేంటో తేలుస్తానంటూ ఏర్పాటు చేయనంతగా మారిపోయి తానేదో సాధించాననుకుంటున్న బ్రయాన్ జాన్సన్ కూడా కౌంటర్ గా స్పందించాడు. హరిద్వార్ గాలిలోని నాణ్యత చాలా దరిద్రంగా ఉంది… ఒకవేళ ఆ గాలి పీల్చితేగనుక 40 నుంచి 50 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది, ఊపిరితిత్తులకూ ప్రమాదమేనన్నట్టుగా కౌంటరిచ్చాడు బ్రయాన్ జాన్సన్.

https://x.com/bryan_johnson/status/1892070384662728905?t=A1MqG9ZJnORqCUE8r9Q7Ug&s=08

https://twitter.com/bryan_johnson/status/1892070384662728905?t=A1MqG9ZJnORqCUE8r9Q7Ug&s=08

ప్రస్తుతం హరిద్వార్‌లో గాలి నాణ్యత రోజుకు ఒకటిన్నర సిగరెట్ తాగడానికి సమానంగా ఉందంటాడు. గుండె జబ్బుల ప్రమాదంతో పాటు, 40 నుంచి 50 శాతం వరకూ ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశముండి.. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ తో పాటు.. మనిషి తన ఆయుష్షుకంటే ఓ ఐదారేళ్ల ముందే చనిపోతాడన్నట్టుగా రిప్లై ఇచ్చాడు.

బ్రయాన్ జాన్సన్ స్పందన నచ్చని రాందేవ్ ఏకంగా జాన్సన్ ను బ్లాక్ చేసేశాడు. ఈ విషయాన్ని జాన్సనే మళ్లీ Xలో పోస్ట్ చేశాడు.

అయితే, ఈ వివాదంలో రాందేవ్ బాబానే ముందుగా గెలికినట్టుగా కనిపిస్తున్నా.. బ్రయాన్ జాన్సనే చాలాకాలంగా భారతదేశంలోని గాలి నాణ్యతపై తరచూ X వేదికగా పోస్టులు చేస్తుండటం గమనార్హం. గతంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ పైనా ఇదేవిధంగా బ్రయాన్ జాన్సన్ స్పందిస్తూ భారత్ లో గాలి నాణ్యతపై కామెంట్స్ చేశాడు. ఇలా తరచూ ఎయిర్ క్వాలిటీపై బ్రయాన్ జాన్సన్ కామెంట్స్, పోస్ట్స్ చేస్తుండటంతో… రాందేవ్ జాన్సన్ ను కోట్ చేస్తూ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసే యత్నంలో ఈ ఇద్దరు నవయవ్వనస్థుల కొట్లాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండింగ్ టాపికై కూర్చుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles