ఆష్లే మాడిసన్ జాబితాలో.. ఆ టెంపుల్ టౌన్! ఏంటీ ఈ ధోరణి..?

భారతదేశంలో వివాహేతర సంబంధాలపై ఆసక్తి.. జాబితాలో కాంచీపురందే మళ్లీ అగ్రస్థానం!

Marriages are made in Heaven అనేది మన దగ్గర ప్రధానంగా వినిపించే నానుడి. అంటే భారతీయ వివాహ ప్రక్రియలో.. ముఖ్యంగా హిందూ పెళ్లిళ్లకు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పే ప్రోవర్బ్ ఇది!

ఇప్పటికే ప్రేమ పెళ్లిళ్లు.. కుల, మత, లింగ, వయసు అడ్డుగోడలు తొలగించుకునే ఆదర్శ వివాహాలూ పెరిగిపోయిన కాలమిది. ఇక ఆ బంధాలు నిలబడటమా.. పెటాకులవ్వడమా అనేది మళ్లీ పూర్తిగా వ్యక్తిగతం. నిలబడుతున్నవాటికంటే… విరిగిపోయేటి వాటి సంఖ్యే ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకూ మన దేశమే ప్రధాన వేదిక. మారుతున్న కాలానికి అనుగుణంగా.. మారుతున్న సమాజాన్ని చూస్తున్నా.. సంప్రదాయాలకు ఇంకా అంతో ఇంతో గౌరవమున్న ప్రాంతం మనది.

కానీ, ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని పటాపంచలు చేసే వార్తలు మన ముందుకొస్తున్నాయి. అందుకు మనం ముందు కంచీ గురించి చెప్పుకోవాలి.

తమిళనాడులోని కాంచీపురమంటే ఓ వేద భూమి. ఆదిశంకరాచార్యులు నడయాడిన ప్రాంతంగా.. శంకరాచార్య పీఠంగా గుర్తింపు. అంతకుమించి టెంపుల్ టౌన్. భారతీయ సాంప్రదాయాన్ని నేతలో చెప్పే పట్టు చీరల పరిశ్రమ. ఇదంతా నాణేనికి ఒకవైపైతే.. వివాహేతర సంబంధాల్లో ఇప్పుడు కాంచీపురం పేరు మారుమ్రోగుతుండటమే ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్.

ఐతే, ఇక్కడ వివాహేతర సంబంధాలు నేరుగా కంటే గోప్యంగా కొనసాగడం మరో విశేషం. ఇప్పుడంతా ఆన్లైన్ ముచ్చట్లతోనే రహస్య ఒప్పందాలు చేసుకునే కాలం. అలాంటి ఒప్పందాల వేదికలుగా ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో బోలెడన్ని యాప్స్ రెడీ. ప్లే స్టోర్ కు వెళ్లడమే ఆలస్యం. అలాంటిదే మనం చెప్పుకుంటున్న ఆష్లే మాడిసన్.

జీవితం చిన్నది.. అఫైర్ పెట్టుకో అనే ఒక భిన్నాభిప్రాయాలకు తావిచ్చే మోటో ఈ యాష్లే మాడిసన్ సందేశం.

వివాహేతర సంబంధాలకు కేరాఫ్ గా వెలిసిన ఆన్లైన్ యాప్ ఇది.

2026లో మే నెలలో ఆష్లే మాడిసన్ ఫ్లాట్ ఫామ్స్ లో అత్యధికంగా సైన్ అప్స్ నమోదైన ప్రాంతంగా.. ఇప్పుడు భారతదేశంలో కంచీపురం పేరు మొదటిస్థానంలో ఉండటమే ఈ స్టోరీ చెప్పుకోవడానికి ప్రధాన కారణం.

అగ్నసాక్షిగా, ఏడడుగుల వివాహ బంధం… ఏక పత్నీవ్రతం వంటి వాటిపట్ల మారుతున్న దృక్పథానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా ఇప్పుడు కంచీపురమనే టెంపుల్ టౌన్ నిలుస్తుండటం.. మారుతున్న కాలమాన పరిస్థితులను కళ్లకు కట్టేది. వివాహేతర, రహస్య బంధాలను కోరుకునే వ్యక్తుల కోసం రూపొందించిన ఆష్లే మాడిసన్ లో అత్యధిక సభ్యత్వ నమోదులు ఇప్పుడు కంచీపురం అనే టెయిర్ టూ నగరం నుంచే జరిగాయంటే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే.

అయితే, కంచీపురం వివాహేతర రహస్య సంబంధాల కోసం చూస్తున్న నగరంగా నమోదవ్వడం ఇదే మొదటిసారేం కాదు. ఇది రెండోసారి కావడమే.. ఇప్పుడు చర్చ. ఈ వివరాలను ఆష్లే మాడిసన్ సంస్థే వెల్లడించింది. 2026 మే నెలలో భారతదేశంలోనే అత్యధిక సైన్ అప్ లతో కంచీపురం వార్తల్లోకెక్కింది.

మరొక గమ్మత్తేంటంటే… కంచీపురం తర్వాత వరుసగా మరో మూడు.. అంటే మొత్తం నాల్గు నగరాలూ తమిళనాడు రాష్ట్రానికి చెందినవే ఉండటం మరో విశేషం. కంచీపుర్ తర్వాత ఈ జాబితాలో కోయంబత్తూర్, తిరువళ్లూర్, చెన్నై నగరాలు నిల్చాయి. మొత్తంగా డేటింగ్ యాప్స్ లో వివాహేతర సంబంధాల కోసం సైన్ అప్ అయితున్న నగరాల జాబితాలో ఆధిపత్యం ఇప్పుడు దక్షిణాదేనని మురిసిపోవడమా… మారుతున్న కాలానికనుగుణమైన పరిస్థితులనుకుని ఊరుకోవడమా.. లేక, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన చోటే ఇలాంటి పోకడలు కనపించడం బాధాకరమా..? ఈ ప్రశ్నలన్నింటికీ.. ఎవరికివారు వారి పరిణతిని బట్టి ఇచ్చే వివరణలను బట్టి సమాధానాలుంటాయి.

ఆష్లే మాడిసన్ డేటింగ్ యాప్ సైన్ అప్స్ లో టెయిర్ టూ నగరమైన కంచీపురం నంబర్ వన్ గా తెరపైకి రావడం గురించి మనం మాట్లాడుకున్నాం సరే.. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. ప్రపంచ దేశాల్లోనే డేటింగ్ యాప్స్ ను వివాహేతర సంబంధాల కోసం వాడుతున్న మూడో దేశంగా ఇప్పుడు భారత్ పైకి ఎగబాకింది. 20 దేశాల సర్వే రిపోర్టులో గత ఏడాది ఎనిమిదో స్థానంలో ఉన్న ఇండియాది ఇప్పుడు మూడో స్థానం.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆష్లే మాడిసన్ సభ్యత్వ నమోదుల్లో 20 దేశాల్లో భారత్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. గత ఏడాది భారత్ ఎనిమిదో స్థానంలో ఉండేది.

ఆష్లే మాడిసన్ విడుదల చేసిన గణాంకాలు భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థపై మారుతున్న ఆలోచనా విధానాలను ప్రస్ఫుటం చేసేది. వివాహేతర సంబంధాల విషయంలోనూ పెరుగుతున్న స్వేచ్ఛను పట్టి చూపేది. అయితే, ఈ మార్పు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇప్పుడు టెయిర్ టూ సిటీస్ కూ పాకింది.

ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ ఏమంటారు..?

వివాహేతర సంబంధాలకు వేదికైన ఆష్లే మాడిసన్ లో భారత్ మూడో స్థానానికి ఎగబాకడం.. వివాహ వ్యవస్థ, పెద్దవాళ్ల సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతల విషయంలో ఆలోచించే విధానంలోనే మార్పును సూచిస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పాటే.. వివిధ పట్టణాలు కూడా ఈ మార్పులో భాగస్వామ్యమవుతున్నాయి. గోప్యతతో కూడిన రహస్య అనుబంధాలు, వ్యక్తిగత సంబంధాలు ఏకంగా భౌగోళిక సరిహద్దులను కూడా దాటుతున్నాయంటారు పాల్ కీబుల్.

2024లో కూడా గ్లీడెన్ అనే సంస్థ 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులపై ఒక సర్వే నిర్వహించింది. టియర్ 1, 2 టియర్ నగరాల్లో 1503 మంది వివాహిత భారతీయులపై మారుతున్న అభిప్రాయాలను అర్థం చేసుకోవడమే ఈ సర్వే ఉద్ధేశం.

ఈ అధ్యయనంలో 60 శాతానికిపైగా సంప్రదాయేతర సంబంధాల విధానాల పట్ల సానుకూలంగా స్పందించడం మారుతున్న కాలమాన పరిస్థితులకు నిదర్శనం. ముఖ్యంగా పరస్పర అంగీకారంతో వివాహితులు లైంగిక అనుభవాలను పంచుకునే స్వింగింగ్ వంటి పద్ధతులపైనా ఎక్కువమంది సానుకూలంగా స్పందించడం పరిమితులు దాటుతున్న స్వేచ్చకు పరాకాష్ఠ.

ఇలాంటి ఫ్లాట్ ఫామ్స్ సాధారణంగా పెద్ద నగరాల్లో ఎక్కువ ఉండటం సహజమే. కానీ, కాంచీపురం వంటి టెంపుల్ టౌన్స్ లో ఈ ధోరణులు పెరిగిపోవడమే ఆశ్చర్యం. అయితే దేవాలయాల నగరంగా, వేదభూమిగా, పట్టు చీరల పరిశ్రమగా ఉన్న కాంచీపురం వంటి చోట ఆ ఎస్సెట్సే… ఈ లక్షణాలకు కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ రిలేషన్షిప్ నిపుణుల నుంచి వినిపిస్తోంది.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన సమాజంలో.. ముఖ్యంగా సన్నిహిత సామాజిక సంబంధాలున్న చోట… గోప్యతతో రహస్య సంబంధాలకు వేదికగా మారే ఫ్లాట్ ఫామ్స్ ఆకర్షించవచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

డేటింగ్, పార్ట్నర్స్ అన్వేషణ కోసం పుట్టుకొచ్చిన యాప్స్ వినియోగంలో ఎప్పటినుంచో చెన్నై నగరం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందుండటం.. మోబైల్ ఫోన్స్ తో ఫింగర్ టిప్స్ పైన అందుబాటులోకొచ్చిన డిజిటలైజేషన్ వంటివన్నీ వెరసి ఈ ధోరణులకు ప్రధాన కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశంలో ఆష్లే మాడిసన్ ఫ్లాట్ ఫామ్స్ లో 2026 మేలో అత్యధికంగా సైన్ అప్ అయిన నగరాలు, పట్టణాల జాబితా ఇలా ఉంది…

కాంచీపురం

కొయంబత్తూర్

తిరువళ్లూర్

చెన్నై

గురుగ్రామ్

నోయిడా

బెంగళూర్

డెహ్రాడూన్

పూణే

ఢిల్లీ

తాళి కోసం , కట్టుకున్న భర్త కుష్టురోగస్థుడైనా.. కాపాడుకునేందుకు యముడితో పోరాటం చేసిన సతీ సావిత్రి కథలకు కొలువైన ఈ సమాజంలోనే.. పాతివ్రత్యాలు, ఏక పత్నీవ్రతులనే మాటలకు చెల్లుచీటీ ఇచ్చే కొత్త సంస్కృతి ఇప్పుడో విస్తృతమైన చర్చ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles