ఐదేళ్లపాటు ఒక్క హిట్టూ లేదు. కానీ, అతనే ప్రపంచంలోని అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు. ఒక్క 2023లోనే అతడి సంపాదన.. 73 మిలియన్ డాలర్స్.. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 6 వందల కోట్లకు పైమాటే. ఇంతకీ ఎవరా నటుడు… ఫోర్బ్ పత్రికా కొనియాడిన కథానాయకుడు..?
వినోద పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీది ప్రత్యేక స్థానం. సినిమానే నమ్ముకుని వేల మంది ఇండస్ట్రీపై ఆధారపడుతుండగా.. ఒక ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చి ఊహించిన దానికంటే ఎక్కువ ఎదిగినవారినీ… వారి అంకితభావమే నడిపిస్తోంది. అలాంటి వారిలో హాలీవుడ్ లో టామ్ క్రూజ్ నుంచి డ్వేన్ జాన్సన్ వరకూ.. బాలీవుడ్ అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకూ వారి అంకితభావమే వారికి ప్రేక్షకాదరణనిస్తోంది.
అయితే మనం చెప్పుకున్న ఏ పేరూ.. అత్యధిక పారితోషికం తీసుకున్న జాబితాలో కనిపించవు. కనీసం హాలీవుడ్ నటులూ తన పారితోషికం విషయంలో కనీస పోటీ ఇవ్వలేకపోయారు. పైగా అర దశాబ్దాం పాటు బాక్సాఫీస్ వద్ద ఒక్క సినిమా కూడా హిట్టు కొట్టకుండేనే… 2023లో ఏడాది మొత్తంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఆడమ్ శాండ్లర్ నిల్చాడు.

మర్డర్ మిస్టరీ, స్పేస్ మ్యాన్, హ్యాపీ గిల్మోర్, ది అవుట్ లాస్ వంటి సినిమాలతో పాటు.. రిమోట్ కంట్రోల్, జెస్సీ, రియల్ రాబ్ వంటి వెబ్ సీరిసెస్ తో మరోవైపు ఇప్పటికీ బిజీబిజీ షెడ్యూల్స్ తో కనిపించే నటుడు ఆడమ్ శాండ్లర్.
1990వ దశకం నుంచి హాలీవుడ్ లో కామెడీ సినిమాలతో అలరిస్తున్న శాండ్లర్.. 2023లో 73 అమెరికన్ మిలియన్ డాలర్స్ సంపాదనతో ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిల్చాడు.
2023లో కేవలం అతను నటించింది కూడా మూడే మూడు సినిమాల్లో. అలాగే మరో సినిమాను తానే నిర్మాతగా నిర్మించాడు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ… రాబడి మాత్రం తెచ్చిపెట్టాయి. జెన్నిఫర్ అనిస్టన్ తో తీసిని మర్డర్ మిస్టరీ 2 మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం నటుడిగానే కాకుండా.. లియో వంటి యానిమేటెడ్ చిత్రాలకూ తన గాత్రాన్నందించాడు శాండ్లర్. ముఖ్యంగా శాండ్లర్ సంపాదనకు ప్రధాన కారణాల్లో తాను నటుడిగా ఉంటూనే… వాటిల్లో తన రెమ్యునరేషన్ తో పాటు.. కొంత హక్కులను పొందడం.. స్వతహాగా తానూ సినిమాలను నిర్మించడంతో.. భారీ ఆదాయం కల్గిన నటుడిగా శాండ్లర్ ఇప్పుడు వార్తల్లోకెక్కాడు.
ఆడమ్ శాండ్లర్ కు ఇతర టాప్ మోస్ట్ హాలీవుడ్ హీరోల్లా థియేట్రికల్ బాక్సాఫీస్ హిట్స్ గత ఐదేళ్ల నుంచీ లేవు. కానీ, ఓటీటీ హక్కుల ద్వారా తన చిత్రాలకు మంచి రాబడి రాబట్టుకున్న తెలివైన వ్యాపార నటుడు శాండ్లర్. 2019లో అన్ కట్ జెమ్స్ చిత్రాన్ని 19 మిలియన్ డాలర్స్ తో నిర్మిస్తే.. ఈ సినిమా 50 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అలాగే, 2024లో స్పేస్ మ్యాన్ కూడా కమర్షియల్ గా విజయం సాధించనప్పటికీ.. పెట్టుబడిని మించిన రాబడినిచ్చింది.
బ్లాక్ బస్టర్ సినిమాలకు పెట్టింది పేరైన ఆస్ట్రేలియన్ నటి మార్గోట్ రాబీ ఆదాయాన్ని మించి.. ఆడమ్ శాండ్లర్ ఆదాయముండటాన్ని ఫోర్బ్స్ విశేషంగా చెప్పుకొచ్చింది. అలా ఆయన 2023లో నిర్మించిన బార్బీ కూడా 59 మిలియన్ డాలర్స్ సంపాదించి థియేటరికల్ హిట్స్ లేకుండానే.. టాప్ రెమ్యునరేషన్ సంపాదించిన నటుడిగా శాండ్లర్ పేరు సంపాదించుకోవడం కొసమెరుపు.



