కొందరి విభిన్నమైన ఆలోచనలు… ఆ ఆలోచనలు స్పృశించేలా వారు పెట్టే సోషల్ మీడియా పోస్టులు నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతాయి. అలాంటి పోస్టే ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై ఒకటి ఆసక్తికరంగా, వైరల్ గా మారింది. భారతీయ ప్రముఖ నగరాలను అందమైన అమ్మాయిలు, మహిళలు, టీనేజ్, మధ్య వయస్కులైన పురుషులతో పోలుస్తూ ఢిల్లీకి చెందిన ఓ నెటిజన్ పెట్టిన ఆ ఇంట్రెస్టింగ్ పోస్ట్ గురించి ఓసారి తెలుసుకుందాం రండి.
ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్ బోస్ అనే టెకీ తన X ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు భారతీయ నగరాలపై ఓ కొత్త దృక్పథాన్ని కనబర్చేలా ఉంది. ఆయా పట్టణాల్లో కనిపించే వైబ్స్, భావోద్వేగాల ఆధారంగా తను అంచనా వేసిన విషయాల్ని ఆయా నగరాలను ఎలాంటి ఉపమానాలిస్తూ పోల్చాడో ఓసారి చూద్దాం.
https://twitter.com/siddharthbosee/status/1908570056377983159
సిద్ధార్థ్ బోస్ దృష్టిలో ముంబై ఓ అందమైన ప్రియురాలులాంటిది. ఆకర్షణ, అయస్కాంతత్వంతో పాటు.. అంతులేని దయ కూడా కలిగిన వయస్కాంతంలాగా ముంబైని పోల్చాడు సిద్ధార్థ్. కళ్లు మిరుమిట్లు గొలిపేలా.. ఎప్పుడూ జనసంచారంతో 24 గంటలూ రద్దీగా, హడావిడిగా కనిపిస్తూ ముంబై ఆకట్టుకుంటుందంటాడు ఈ టెకీ.
ఇక ముంబైకి పూర్తి విరుద్ధంగా ఢిల్లీని పోల్చాడతను. అతివిశ్వాసంతో టీన్స్ కాస్తా 20లోకి అడుగుపెట్టగానే వచ్చే అతి పెద్దరికం ఢిల్లీలో కనిపిస్తుందంటాడు. అయితే, ఢిల్లీలో ధైర్యసాహసాలతో పాటు, కఠినత్వం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మెండుగానే కనిపిస్తాయనీ చెబుతున్నాడు.
ఇక పూణే సిద్ధార్థ్ కు ఓ టీనేజ్ అమ్మాయిలాంటిదట. వెల్లువలా ఉప్పొంగే ఉత్సాహం, మరికొంత తిరుగుబాటు తత్వం వంటివి నిరంతరం కనిపించే సిటీగా పూణేను పేర్కొంటున్నాడు. ఇక కోల్ కత్తాను మాత్రం ఓ వృద్ధ మహిళతో పోలుస్తున్నా సిద్ధార్థ్. జ్ఞాపకాలకు కేరాఫ్ లా, గత కాలపు ప్రేమకు చిహ్నంలా.. ఒక సుసంపన్నమైన సంస్కృతిని కల్గి ఉన్న ప్రాంతంగా కోల్ కత్తాను చెబుతున్నాడు సిద్ధార్థ్.

ఇక బెంగళూర్ ఎప్పుడూ విరామం లేకుండా చలాకీగా ఉండే అబ్బాయిలాంటిదంటున్నాడు. నిరంతరం ఏదో మార్పు కోరుతూ.. దాహంతో కనిపించే యువకుడిలాంటివాడని… అలసిసొలసి గందరగోళం మధ్య ప్రశాంతత కోసం ఆరాటపడేవాడనీ చెబుతున్నాడు సిద్ధార్థ్. ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ను ఓ అరవై ఏళ్ల వృద్ద మహిళగా చెబుతున్నాడు. సంతృప్తికి చిరునామాలా కనిపించే అరవై ఏళ్ల వయస్సు కల్గిన మహిళ జీవితాన్ని సంపూర్ణంగా విజయవంతంగా గడిపిన తర్వాత ఏవిధంగానైతే కనిపిస్తుందో.. ఆ విధంగా ఇండోర్ తనకు కనిపిస్తోందంటాడతను. ఇంకా జీవితంలో చేయాల్సిందేమీ లేదు.. ప్రశాంతతే ముఖ్యమన్నట్టుగా ఆస్వాదించే అరవై ఏళ్ల మహిళతో ఇండోర్ ను పోల్చాడు.
సిద్ధార్థ్ బోస్ భిన్నమైన, కాస్త హ్యూమరస్ గా సాగిన ప్రధాన నగరాల ఉపమాన పోలికలపై నెటిజన్లూ అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు.
అందులో భాగంగా హైదరాబాద్ గురించి ప్రస్తావించాడు ఓ నెటిజన్. రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ 30 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో చాబుత్రా దగ్గర సిగరెట్ దమ్ము టేస్ట్ చేస్తూ.. ప్రతీరోజు వ్యాపార ఆలోచనలపై చర్చిస్తూ, బిర్యానీ లాగించే వ్యక్తిలా హైదరాబాద్ ను పోలుస్తూ రియాక్టయ్యాడు ఓ హైదరాబాదీ.
ఇక గుజరాత్ గురించి వచ్చిన ఓ రిప్లైలో ఓ వ్యక్తి మరింత ఫన్నీగా స్పందించాడు. అహ్మదాబాద్ ను చబ్బీ చెంపల అంకుల్ విత్ రేబాన్ గ్లాసెస్ గా, ఇక సూరత్ ను ఒంటినిండా బంగారం నింపుకున్న ఆంటీలా, బరోడాను మీ ఆలోచనలను సరిచేసే వేడి వేడి ఛాయ్ స్నిప్పర్ లా, భావ్ నగర్ ను పదవీ విరమణ తీసుకున్న రాజకుమారుడు ఇప్పటికీ తానే పాలిస్తున్నవాడిలా ఫోజు కొట్టే వ్యక్తిలా.. ఇలా డిఫరెంట్ ఆలోచనలతో సిద్ధార్థ్ బస్ పెట్టిన పోస్టుకు ప్రతిస్పందనలు రావడంతో బోస్ పోస్ట్ ట్రెండింగ్ గా మారింది.
మొత్తంగా ఒక్కొక్కరివీ ఒక్కో ఆలోచనలెలాగూ ఉంటాయి. కానీ, భారతీయ నగరాల ఆత్మను పట్టిచూపించేందుకు, అక్కడి డైనమిజాన్ని కళ్లకు కట్టేందుకు సిద్ధార్థ్ బోస్ చేసిన ఈ ప్రయత్నం మాత్రం తన కొత్త లైన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.



