Siddharthi Subhas Chandrabose…. ✍🏻
ఇంటిముందు ఇలా రాసుకుంటు కూర్చున్నాను.
అల్లంత దూరాన్నుంచి నడిసొచ్చే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లలో ఒకడు గబగబా చెప్పుకుంటూ వస్తున్నాడు, జాస్ బట్లర్ ఎన్ని సెంచరీలు చేశాడు, ఎలా ఎవరిమీద చేశాడో. కడుపు మండిపోయింది. లేచి కాంపౌండ్ వాల్ దగ్గరకెళ్ళి పిలిచాను.

“బాబూ ఏం చదువుతున్నావ్?”
“ఇంటర్మీడియట్ ఫస్టియర్”
“ఫార్మర్”
సమాధానం వినగానే మరింత కోపం వచ్చింది.
“జాస్ బట్లర్ ఎవడు? వాడు ఎవరిమీద ఎన్ని సెంచరీలు చేసిన విషయం నీవెందుకు గుర్తుపెట్టుకున్నావ్?”
“ఏ కాలేజీ?”
“నారాయణ”
“ఏ బ్రాంచ్?” అంటే సమాధానం చెప్పాడు.
“అందులో చదివి ఏం చేద్దామని?”
“ఎంసెట్ రాస్తా?”
వెధవ ఎంసెట్ రాయడానికి ఆ కాలేజీకి పోవాలా? ఎందుకు జేయీయీ రాయవు? ఎంసెట్ రాసి ఈ లోకల్ కాలేజీళ్లో చేరి ఏంచేద్దామనుకుంటున్నావు? అక్కడ ఐఆఇటిల్లో చదీవినవారికే ఉద్యోగాలు లేక అడుక్కుతింటున్నారు. నువ్వేదో ఇక్కడ చదువుకుంటావని నీ తల్లిదండ్రులక్కడ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతూ డబ్బు పంపిస్తే, నువ్విక్కడ చేస్తోన్నదేమిటి? ఎవడెన్ని సెంచరీలు చేశాదు, ఎవడి సినిమాకెంత కలెక్షన్లు వచ్చాయి.. అనే లెక్కలు బట్టీ పడుతున్నావా? ఇది తల్లిదండ్రులని మోసం చేయడం కాదా? నీపేరేమి?”
“శశాంక్” చెప్పాడు
“ఆ పేరుకి అర్థమేమి?”
“తెలియదు”
“నీ పేరుకి అర్థంతెలియదు. ఏం నీ చేతిలోని ఫోన్లో నీ పేరుకి అర్థం అడిగితే గూగుల్ చెప్పదా? నీ బ్రతుకు నీకుపట్టదు. వాడెవడిగురించో పట్టించుకోవడానికి సమయం వుంటది? ఇది నిన్ను నీవు మోసం చేసుకోవడం కాదా?”
“చూడు నాన్నా, నీకెవరూ చెప్పేవారు లేనప్పుడు నువ్వు మరింత భయంగా, జాగ్రత్తగా వుండాలికదా. అదే నారాయణలో నీకన్నా పై బ్రాంచులో ఎందుకున్నారు, వారేం చదువుతున్నారు, అలా చదివితే ఏమవుతుంది, రేప్పొద్దున నేనేమవుతాను?.. వంటి ప్రశ్నలు వేసుకోవాలి. స్నేహితులు, సినిమాలూ, క్రికెట్టూ.. ఇవన్నీ వుంటాయి నీచుట్టూ. కానీ అవి నీకెందుకు పనికొస్తాయో ఒక్కసారి ఆలోచించు. అన్నట్లు కాలేజీ వెళ్లగానే అక్కడ పెద్ద హోర్డింగ్ వుంటుంది, మీ సీనియర్, నాకొడుకే ఇప్పుడు ఐఐటి బాంబే. వాడికి జాస్‌బట్లర్ అనే క్రికెటర్ ఎవడో కూడా బహుశా తెలియకపోవచ్చు. వాడు సమయంలేదని ఎప్పుడు మొత్తుకునేవాడు తినడానికికూడా. నీకింత సమయం ఎందుకుందో ఆలోచించు”
పొద్దున్నే నాలోని ఒత్తిడికి వెంట్ దొరికింది! కళ్లు విపార్చి విన్న ఆ కుర్రాడు ఏలా తీసుకున్నా ఫర్వాలేదు!



