Amarnath Vasireddy.. ✍️
గేమ్ చేంజర్?
ఇప్పుడు ఆట తీరు మారింది!
ఇది డిజిటల్ డిస్టయోపియా యుగం!
నూటికి తొంభైతొమ్మిది మంది అతి సమాచార వ్యాధి బాధితులే !

సాధారణం అంటే వెగటు!
మలినం.. జుగుప్స.. నీచం.. నికృష్ఠం అంటే తీపి!!
అందుకే, ఎర్ర చందనం స్మగ్లర్లు.. డాకు మహారాజులు ఇప్పుడు హీరోలు.
సినిమావాళ్లకు రామాయణం మహాభారతంపై దృష్టి పడలేదు… లేకుంటే రావణుడు, కీచకుడు హీరోలు అయిపోయి ఉండేవారు .
ఇప్పుడున్న ఏ హీరోపై నాకు అభిమానం లేదు, ద్వేషం లేదు. వారు నటులు.. వారి వృత్తి వారిది.
రాంచరణ్ హీరో గా గేమ్ చేంజర్ సినిమా నన్ను ఆకర్షించింది. కారణం, దర్శకుడు శంకర్.
అతని సినిమాల్లో పాజిటివిటీ ఉంటుంది. హీరో మంచి కోసం పోరాటం చేస్తాడు.
చాన్నాళ్ల తరువాత శంకర్ సినిమా వస్తోంది. ఇప్పుడు ఈయన విలన్ ను హీరోగా చూపే ట్రెండ్ ఫాలో అయిపోతాడా ? లేక గేమ్ చేంజ్ చేస్తాడా ? తిరిగీ పాజిటివ్ పాత్రల్లో హీరోలను చూపే రోజులు వస్తాయా ? అని ఆలోచించాను.
గేమ్ చేంజర్ టీజర్ చూస్తే ఇందులో హీరో ఒకప్పటిలాగే పాజిటివ్ పాత్రలో ఉన్నట్టు నాకు అర్థం అయ్యింది.
ఇందాకే ఫస్ట్ రివ్యూ అని ఒకటి చూసాను. ఇది అవుట్ డేటెడ్ కథ అంటూ ఎవడో రాసిన రివ్యూ వైరల్ అవుతుందట!
సినిమా హిట్ లేదా ఫట్.. ఇదో పెద్ద సమస్య కాదు. కానీ భారీ బడ్జెట్ తో హీరోను పాజిటివ్ గా చూపడం జనాలకు నచ్చక పొతే మాత్రం.. ఇక రాబోయేవన్నీ విలన్లను హీరోలు చేసే సినిమాలే!
డాకు మహారాజ్.. మాఫియా మాదేష్.. రేపిస్ట్ రేయాన్స్ .. టెర్రరిస్ట్ థామస్.. గూండా గుంజన్.. ఇలా ఉంటుంది వరుస!
సెన్సార్ బోర్డు అనేది ఒకటుంటుంది. దాని ఆనవాళ్లు వెలికి తీద్దాం రండి.


