కస్టమ్స్ కు సవాల్ విసిరే స్మగ్లర్స్ ఛేదన.. TASKAREE

Nationalist narsingarao.. ✍🏻

బెంగాల్ కు చెందిన 53 ఏండ్ల నీరజ్ పాండే 2008 లో A Wednesday అనే సినిమా ద్వారా చిత్ర ప్రపంచానికి పరిచయం అయ్యాడు.

నీరజ్ పాండే చిత్రాలలో ప్రధానంగా క్రైమ్, స్పై మరియు యాక్షన్ థ్రిల్లర్ తీవ్రవాద ఉగ్రవాద వ్యతిరేక జోనర్లపై ఎక్కువ ఆసక్తి పెడతాడు… ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీద బాగా దృష్టి పెడుతూ దేశ భద్రత మరియు గూఢచారి వ్యవస్థపై తనకున్న ఆసక్తిని చాటుకుంటూ అనేక సినిమాలకు పనిచేశాడు. బేబీ ..అయ్యారే ..స్పెషల్ 26.. లాంటి సినిమాలు ఈ కోవలేవే.


భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘MS Dhoni: The Untold Story కూడా సూపర్ హిట్ అయింది.

2019 లో నీరజ్ పాండే డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద దృష్టి పెట్టడం కోసం ఫ్రైడే స్టోరీటెల్లర్స్‌ అనే నిర్మాణ సంస్థ ప్రారంభం చేశాడు.


ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ మొదటి వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్…. ..2001 భారత పార్లమెంట్ మీద దాడి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది…సూపర్ హిట్… వ్యవస్థల్లో ఉండే లోపాలు గుర్తిస్తూ సామాజిక బాధ్యత ను కూడా చూపించే విధంగా సాగుతూ ఉంటాయి ఆయన సిరీస్ లు.


స్పెషల్ ఆప్స్ తరువాత ఖాకీ…రెండు సీజన్స్ (బీహార్ బెంగాల్ ) ఫ్రీలాన్సర్ లాంటి వెబ్ సిరీస్ లు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకున్నాయి.

గ్లోబల్ స్మగ్లింగ్, కస్టమ్స్ అధికారుల దర్యాప్తు చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ తస్కరే …శుక్రవారం Netflix లో రిలీజ్ అయ్యింది…. నిజాయితీ గల కస్టమ్స్ ఆఫీసర్ గా ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా నటించాడు అలాగే అనురాగ్ సిన్హా, జోయా, షరద్ కూడా చక్కటి పాత్రల్లో ఒదిగిపోయారు.


కస్టమ్స్ అధికారుల కళ్ళుకప్పి స్మగ్లర్లు దేశంలోకి బంగారాన్ని ఎలా ..ఎన్ని విధాలుగా తీసుకొని వస్తారో అనే తెలియజెప్పారు…
కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైరార్కీ ..కస్టమ్స్ ఓవర్సీస్ ఇంటిలిజెన్స్ నెట్వర్క్ లాంటి అనేక తెలియని విషయాలు కామన్ ప్రేక్షకుడికి కూడా తెలియజేసే ప్రయత్నం జరిగింది…ఆసక్తి ఉన్నవాళ్ళు చూడాల్సిన సిరీస్.


నీరజ్ పాండే అంటే ఒక పేరు మాత్రమే కాదు ఇదొక బ్రాండ్ ఇమేజ్ అనే స్థాయికి వెళ్ళాడు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles