ఓ విలన్ నుంచి ఓ హీరో ఓ జర్నోను ఎలా కాపాడాడు..? ఇరాక్ లో జరిగిన ఆ కథేంటి..??

కొన్ని ఘటనలు నమ్మశక్యంగా అనిపించదు. ఇతరులు చెబుతుంటే.. కట్టుకథలు, పిట్టకథల్లా అనిపిస్తాయి. కొన్ని తెలుగు సినిమాల్లో హీరోల అతిశయోక్తిలా అనిపిస్తుంది. ఏ ఉట్టి డ్రామా అనుకుంటాం. అలాంటి ఓ కథే ఓ జర్నలిస్ట్, రచయితకు జరిగింది. ఆ జర్నోను భయపెట్టిన ఆ జర్నీలో హీరో అప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్. ఇంతకీ ఆ జర్నలిస్టుకు ఎదురైన అ చేదు అనుభవమమేంటి.. మరి అతణ్ని మన అమితాబ్ ఎలా కాపాడాడు..? ఫక్తూ కట్టుకథలా అనిపించే ఆ రియల్ స్టోరీ ఏంటో చదివేయండి.

సద్దాం హుస్సేన్ అంతం తర్వాత ఓసారి హుస్సేన్ జైదీ అనే పాత్రికేయుడు ఇరాక్ రాజధాని బాగ్ధాద్ ను సందర్శించాడు. ఆ సమయంలో హుస్సేన్ ను కొందరు మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. హీస్సేన్ జైదీ వద్ద మిలిటెంట్ల వినాశనానికి భారీగా మారణాయుధాలున్నాయని, తాను సద్దాం హుస్సేన్ సంబంధీకులతో టచ్ లో ఉన్నాడన్న అనుమానంతో మిలిటెంట్లు హుస్సేన్ జైదీని కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి ఎక్కడో తెలియని ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లారట. కళ్ల గంతలు విప్పితే… మన రాంగోపాల్ వర్మ సినిమా తరహాలో చుట్టూ ఎటు చూసినా గడ్డాలతో ఉన్న మనుషులతో భయంకరమైన వాతావరణ కనిపించిందట. కానీ, ఒకే ఒక్క వ్యక్తి మాత్రం క్లీన్ షేవ్ తో… వెనుక పెద్ద పెద్ద జులపాలతో 90ల కాలంలోని బాలీవుడ్ హీరోను తలపించేలా కనిపించాడట. ఈ విషయాల్ని హుస్సేన్ 2015లో హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కట్ చేస్తే… ఆ బాలీవుడ్ హీరోను పోలిన క్లీన్ షేవర్… హుస్సేన్ దగ్గరకు వచ్చి… నీది పాకిస్థానా అడిగాడట. దానికి, హుస్సేన్ నాది ఇండియా.. నేను హిందీలో మాట్లాడగలనంటూ సమాధానమిచ్చాడట ఆ మిలిటెంట్ కు. కానీ, తానేమో అరబిక్ మాట్లాడటంతో.. తనకు భాష అర్థంకాని పరిస్థితిలో ఒకవైపు ఒకింత ఆందోళన, మరింత భయం రెండూ ఆవహించాయి హుస్సేన్ కు. అప్పుడతను మీకు అమీషా బక్కన్ తెలుసా అని అడుగుతున్న దాంట్లో అమీషా బక్కన్ మాత్రమే అర్థమవుతోంది.. కానీ, మిగిలిన అరబిక్ భాష మాత్రం అర్థం కాని పరిస్థితి. దాంతో అప్పటికే అమీషా పటేలేమోనన్న భావనతో… నాకు అమీషా పటేల్ మాత్రమే తెలుసుగానీ.. అమీషా బక్కన్ తెలియదన్నాడట హుస్సేన్. దాంతో ఆ మిలిటెంట్ కు చిర్రెత్తుకొచ్చిందట.. ఇండియా అంటున్నావ్… అమీషా బక్కన్ తెలియదా అంటూ కాస్త గట్టిగా లొల్లి పెట్టాడట. అదే చిరాకుతో లోపలికెళ్లిన మిలిటెంట్.. 1982లో విడుదలైన రమేష్ సిప్పీ తీసిన శక్తి సినిమాలోని పేపర్ లో వచ్చిన ఓ స్టిల్ ను తీసుకుని వచ్చాడట. అప్పుడుగానీ.. ఇరాక్ లో భయంకరమైన మిలిటెంట్ల చేతుల్లో కిడ్నాప్ కు గురై ఆందోళనలో ఉన్న హుస్సేన్ కు బల్బ్ వెలిగిందట. వెంటనే ఏస్ నాకు ఈ వ్యక్తి తెలుసు.. అమితాబ్ బచ్చన్ నాకు మంచి స్నేహితుడని చెప్పాను. దాంతో ఆ మిలిటెంట్ ఓ తెల్లకాగితం మీద తానెప్పుడైనా ముంబై వస్తే.. అమితాబ్ బచ్చన్ ను కలిపిస్తానని ప్రామిస్ చేయమని… ఓ ప్రామిసరీ నోట్ రాయించి… వదిలిపెట్టాడట.

అదిగో అలా అమితాబ్.. హుస్సేన్ జైదీ అనే అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ప్రాణాలను కాపాడే విషయంలో పరోక్షంగా తనకుపయోగపడ్డాడు. వినడానికి ఓ పిట్టకథను తలపించినా.. ఈ నిజమైన కథను తానే ఓసారి పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. హుస్సేనీ జైదీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగానే కాకుండా… రచయితగా కూడా సుపరిచితుడు. ది ఏసియన్ ఏజ్, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, మిడ్ డే, ముంబై మిర్రర్ వంటి పత్రికల్లో సయ్యద్ హుస్సేన్ జైదీ రాసిన క్రైమ్ స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా మిగిలాయి. అలాగే, డోంగ్రీ టూ దుబాయ్- సిక్స్ డికేడ్స్ ఆఫ్ ది ముంబై మాఫియా, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై, బ్లాక్ ఫ్రైడే, ముంబై అవేంజర్స్, మై నేమ్ ఈజ్ అబూసలేం వంటి బుక్స్ రాశాడు. ముఖ్యంగా ఇతని రచనలన్నీ ముంబైలోని అండర్ వరల్డ్ బేస్డ్ గా సాగాయి. టెర్రర్ ఇన్ ముంబై వంటి HBOలో వచ్చిన డాక్యుమెంటరీకి జైదీ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. జైదీ ముంబై అవేంజర్స్ ను బేస్ చేసుకునే కబీర్ ఖాన్.. ఫాంటమ్ సినిమా రూపొందించాడు. ఇలా పలు సినిమా ప్రొడక్షన్ హౌజెస్ తోనూ.. బాలీవుడ్ ప్రముఖులతోనూ మంచి సంబంధాలున్న సయ్యద్ హుస్సేన్ జైదీ ప్రాణాలతో బయటపడటానికి మాత్రం అదే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పరోక్షంగా ఉపయోగపడటం ఆయన జీవితంలో ఓ మరపురాని జ్ఞాపకమైపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles