Horizental escalation .. యుద్ధ పరిభాషలో దీని అర్థమేంటి? దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై దాడి వెనుక కథేంటి..??

Viswa A… ✍🏻

మధ్యాహ్నం షాక్

మధ్యాహ్నం
ఇండియన్ టైమ్ సుమారు 12:30
దుబాయ్ —
ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్‌లలో ఒకటి

ఆకాశంలో… ఒక చిన్న బిందువు

కొన్ని సెకన్లు తర్వాత —
ఒక భారీ శబ్దం

స్మోక్. ఎక్స్‌ప్లోజన్.


మీడియా కథ

దుబాయ్ మీడియా చెప్పింది
“మైనర్ ఇన్సిడెంట్… ఫ్లైట్స్ మళ్ళీ రెజూమ్ అవుతాయి”

కానీ…

వీడియోలో కనిపించింది వేరే కథ

ఒక డ్రోన్
నేరుగా స్ట్రెయిట్ టు ఎయిర్పోర్ట్

అది సాధారణ డ్రోన్ కాదు
ఇరాన్ తయారు చేసిన Shahed Drone

ఇది ఒక ఎక్స్‌ప్లోజన్ కాదు
ఇది ఒక మెసేజ్


యుద్ధ భాషలో

యుద్ధంలో దీనికి ఒక పేరు ఉంది
Horizontal Escalation

అంటే…

నువ్వు నన్ను కొడితే
నేను నీ మిత్రుడిని కొడతాను

ఇజ్రాయిల్ ఇరాన్‌ను కొడుతోంది
అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెడుతోంది

కానీ…

ఇరాన్ ఎక్కడ కొడుతోంది?

గల్ఫ్
దుబాయ్, కతర్, సౌదీ, బెహరీన్


ఒక డ్రోన్ → ప్రపంచ ప్రభావం

ఒక డ్రోన్

ఒక ఎయిర్పోర్ట్

కొన్ని ఫ్లైట్స్ ఆగిపోవడం

ప్రపంచ ట్రావెల్ డిస్టర్బ్

ఇన్వెస్టర్స్ పానిక్

మార్కెట్లు కంపించడం

ఇది కేవలం ఎయిర్పోర్ట్ దాడి కాదు
ఇది ఒక సిస్టమ్‌పై దాడి


దుబాయ్ ఎందుకు ముఖ్యము

ఇండియా → యూరప్
ఏషియా → యూరప్
ఆఫ్రికా → యూరప్

ప్రపంచ విమాన ప్రయాణాల గొంతు అక్కడే కలుస్తుంది

ఒక డ్రోన్
ఆ గొంతును తాకింది


ఆయిల్ సమీకరణ

ప్రపంచానికి రోజుకు
100 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కావాలి

ఆ ఆయిల్‌లో పెద్ద భాగం
గల్ఫ్ నుంచే వస్తుంది

గల్ఫ్ కదిలితే… ప్రపంచం కదులుతుంది

ఇప్పటికే ఆయిల్ ధర
90 డాలర్లకు చేరుకుంది

100 దాటితే…
ప్రపంచ మార్కెట్లు వణికిపోతాయి


పెట్రో డాలర్ కథ

1973 — మిడిల్ ఈస్ట్ యుద్ధం

ఆ తర్వాత ఒక ఒప్పందం
సౌదీ అరేబియా + అమెరికా

పేరు — Petro-Dollar

రూల్ సింపుల్
ప్రపంచ ఆయిల్ డాలర్‌తోనే అమ్మాలి

బదులుగా…
అమెరికా గల్ఫ్ దేశాలను రక్షిస్తుంది

అప్పటి నుండి
డాలర్ ప్రపంచ రాజు

కానీ…

ఈరోజు ఒక ప్రశ్న

రక్షణ ఎక్కడ?

దుబాయ్ ఎయిర్పోర్ట్‌పై డ్రోన్ పడింది
కతర్ రాడార్‌లు హిట్ అయ్యాయి
ఆయిల్ ప్లాంట్లు టార్గెట్ అయ్యాయి

అమెరికా చూస్తోంది


పెద్ద ఆట

ఇదే ఇరాన్ వ్యూహం

నేరుగా యుద్ధం కాదు
సిస్టమ్‌ను కదిలించడం

ఇంకా ఇద్దరు చూస్తున్నారు

రష్యా
చైనా

యుద్ధం ఎక్కువ రోజులు సాగితే
లాభం వాళ్లకే

రష్యా — ఎక్కువ ఆయిల్ అమ్ముతుంది
చైనా — ఎక్కువ ఆయుధాలు అమ్ముతుంది

అమెరికా మాత్రం
యుద్ధ ఖర్చు భరిస్తుంది

ఇదే జియోపాలిటిక్స్


చివరి నిజం

ఇరాన్‌కు తెలుసు
అమెరికాను నేరుగా ఓడించడం కష్టం

కానీ…

అమెరికా మిత్రులను అస్థిరం చేయడం మాత్రం సాధ్యం

దుబాయ్ ఎయిర్పోర్ట్‌పై పడిన ఆ డ్రోన్
ఒక రన్‌వేను మాత్రమే తాకలేదు

అది తాకింది —
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు

కొన్ని యుద్ధాలు బాంబులతో గెలవరు

సిస్టమ్‌లను కదిలించి గెలుస్తారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles