43 ఏళ్ల విండీస్ రికార్డును తిరగరాసిన భారత్: ఐసీసీ టోర్నీల్లో కొత్త చరిత్ర!

2026 టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై గెల్చి.. ఫైనల్స్ కు చేరడంతో భారత్ పలు రికార్డులను చెరిపేసింది. 43 ఏళ్ల వెస్ట్ ఇండీస్ రికార్డును తిరగరాసింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లోనే నాల్గు ఐసీసీ ఫైనల్స్ కు చేరుకున్న జట్టుగా భారత్ రికార్డ్ నెలకొల్పింది.

1983 ప్రపంచకప్ లో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలోని ఆరంభమైన కొనసాగుతున్న వెస్ట్ ఇండీస్ ఆధిపత్యానికి… 2026 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరడంతో భారత్ గండి కొట్టింది.

నాల్గుసార్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకున్న భారత్!

టీ 20 వరల్డ్ కప్స్ చరిత్రలో నాల్గోసారి భారత్ ఫైనల్స్ కు చేరుకుని రికార్డ్ సృష్టించింది. ఇలా నాల్గుసార్లు ఫైనల్ కు చేరిన మొదటి జట్టుగా అవతరించింది.

అయితే, ఫైనల్స్ లో కివీస్ తో గనుక భారత్ గెలిస్తే భారత్ కు మరో మూడు అద్భుతమైన రికార్డులను సాధించే అవకాశాలున్నాయి.

వరుసగా టైటిల్ కాపాడుకున్న జట్టుగా నిలవడం, స్వదేశంలో వరల్డ్ కప్ గెలవడం, మూడుసార్లు ఛాంపియన్ గా అవతరించడం.. ఈ మూడు రికార్డులనూ భారత్ సాధించవచ్చు.

బద్ధలైన 43 ఏళ్ల ప్రపంచ రికార్డ్!

భారత్ వరుసగా నాల్గు ఐసీసీ లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్స్ లో ఫైనల్స్ కు చేరుకుంది. 2023 ఐసీసీ వరల్డ్ కప్, 2024 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా ఇప్పుడు 2026 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్.. ఇలా నాల్గు సార్లు ఫైనల్స్ కు చేరుకుంది.

బహుళ దేశాల మధ్య ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్స్ జరుగుతున్న 56 ఏళ్ల చరిత్రలో వరుసగా నాల్గు ఫైనల్స్ చేరుకున్న మొట్టమొదటి జట్టు భారత్. అంతకుముందు ఈ రికార్డ్ వెస్ట్ ఇండీస్ పేరిట ఉండేది. కానీ, వారు కేవలం మూడు వరల్డ్ కప్ ఫైనల్స్ కు మాత్రమే చేరి ఈ రికార్డ్ సొంతం చేసుకుంటే.. నాల్గు ఐసీసీ ఫైనల్స్ కు చేరడంతో భారత్ ఆ ఫీట్ ను అధిగమించింది. వెస్ట్ ఇండీస్ 1975 వరల్డ్ కప్, 1979 వరల్డ్ కప్, 1983 వరల్డ్ కప్ ఇలా మూడుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకున్న జట్టుగా ఇంతకాలం తన రికార్డును పదిలపర్చుకుంది.

వరుసగా అత్యధిక ఐసీసీ ఫైనల్స్ చేరుకున్న జట్లేవీ..?

ఐసీసీ టోర్నమెంట్స్ లో వరుసగా 2023, 2024 టీ 20 వరల్డ్ కప్స్ తో పాటు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ 20 వరల్డ్ కప్ లో భారత్ నాల్గుసార్లు.. అంతకుముందు రోహిత్ శర్మ, ఆతర్వాత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఫైనల్స్ కు చేరితే.. అంతకుముందు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో కూడా వరుసగా మూడుసార్లు ఐసీసీ టోర్నమెంట్స్ లోనూ భారత్ ఫైనల్స్ చేరింది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీస్ తో పాటు.. ఆ తర్వాత జరిగిన 2003 ప్రపంచకప్ లోనూ భారత్ ఫైనల్స్ కు రీచ్ అయింది. ఇలా ఫైనల్స్ కు రీచ్ అయిన టీమ్స్ లో ఐసీసీ ట్రోఫీలకు సంబంధించి ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు 2 సార్లు చేరుకున్నారు.

మరిన్ని రికార్డ్స్ కు ఆస్కారం!

భారత్ ఇప్పటికే 2024 టీ 20 వరల్డ్ కప్ తో పాటు… 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను గెల్చుకుంది. ఇప్పుడు, రేపు కివీస్ తో జరుగబోయే ఫైనల్స్ లో గెలిస్తే మూడు ఐసీసీ ట్రోఫీలు వరుసగా గెల్చుకున్న జట్టుగా కూడా భారత్ ప్రతిష్ఠ చరిత్రలో నిలవబోతోంది.

ఇక ఐసీసీ లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్స్ ఫైనల్స్ లో అత్యధికంగా ఆడిన జట్లు!

భారత్ 13 సార్లు ఆడితే.. ఆస్ట్రేలియా 12 సార్లు ఫైనల్స్ కు వెళ్లింది. ఇంగ్లాండ్ 9 సార్లు, వెస్ట్ ఇండీస్ 8 సార్లు, శ్రీలంక 7 సార్లు, న్యూజిలాండ్ 7 సార్లు ఐసీసీ ట్రోఫీల్లో ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఈ జాబితాలో కూడా భారత్ దే పైచేయి కావడంతో పాటు.. తాజాగా ఫైనల్స్ కు చేరి ఆస్ట్రేలియాతో సరి సమానంగా ఉన్న రికార్డును చేరిపేసి ఆధిక్యత సాధించింది.

సెమీస్ లో భారత్ ది హిస్టారికల్ స్కోర్!

ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ లో భారత్ 253 పరుగులు చేసి కూడా రికార్డ్ నెలకొల్పింది. ఇది టీ 20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఇప్పటివరకూ జరిగిన పది ఎడిషన్స్ లో ఏ జట్టు కూడా సెమీ ఫైనల్స్ లో గానీ, ఫైనల్స్ లో గానీ 200 పరుగులే చేయలేదు.

మరో అరుదైన రికార్డ్ ఏంటంటే..?

భారత్ టీ 20ల చరిత్రలో 250కి పైగా స్కోరును ఆరుసార్లు నమోదు చేసింది. ఇప్పటివరకూ ఏ అంతర్జాతీయ తోపు జట్టు కూడా ఇంత భారీ స్కోర్స్ ని మూడుసార్ల కంటే ఎక్కువసార్లు నమోదు చేయలేకపోయాయి. అన్ని రకాల ఫార్మాట్స్ కలిపి చూసినా ఇప్పుడు భారత్ దే పైచేయి. ఎందుకంటే, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాగ్ జట్టు రికార్డును కూడా భారత్ బద్ధలు కొట్టింది. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకూ 5 సార్లు మాత్రమే 250కి పైగా స్కోర్స్ నమోదు చేసింది. ఆ ఫీట్ ను కూడా భారత జట్టు అధిగమించింది.

ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ ను ఎదుర్కోబోతోంది. మరి ఇవాళ్టి ఆదివారం మార్చ్ 8న, అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం మరిన్ని రికార్డులకు వేదికవుతుందేమో చూడాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles