ఇకపై మన పనులన్నీ.. ఏజెంటిక్ ఏఐ చేసేస్తుందా..?

ఏఐ తర్వాతి దశ ఏంటి..? ఫోన్ మన కోసం ఆలోచిస్తుందా?

ఒకే ఒక్క కమాండ్… ఎన్నో స్టెప్స్!

ఇప్పుడు మనమంతా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే సమయంలో వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీ కూడా కామన్. అలాంటి క్యూరియాసిటీతో ఆలోచిస్తే… ఏఐ తర్వాతి దశలో మోబైల్ ఫోనే మనకోసం ఆలోచిస్తుందా..? ఇదేదో ఊహజనితంగా చెప్పుకునేది కాదు… గూగుల్, సామ్ సంగ్, క్వాల్ కామ్ వంటి సంస్థలు ఏజెంటిక్ ఏఐ వైపు అడుగులేస్తున్నాయి. అంటే సాంకేతికంగా మన ఉద్ధేశాల్ని అర్థం చేసుకుని దశలవారీగా పనులను విభజించి, మన అనుమతితోనే పూర్తి చేసే ఆర్టీఫిఫిషియల్ ఇంటలిజెన్స్ అన్నమాట.

ఇప్పటివరకూ మన ప్రమేయంతో మనకనకూలంగా ఫోన్ ను మల్టీపర్పస్ గా వాడుకుంటున్నాం. ఇకముందు ఫోనే.. మన కోసం కొన్ని పనులు దానంతటే చేయబోతోందా..? అలాంటి ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ రాబోతోందా..?

రేపు ఉదయమే హైదరాబాద్ లో 9 గంటలకు మీటింగ్. ఆరింటికల్లా బయల్దేరాలి. క్యాబ్ బుక్ చేయ్. మీటింగ్ కు సంబంధించి ఫాలో కావల్సినవేమున్నాయో ఓసారి మెయిల్స్ చెక్ చేసి చెప్పు… ఇలాంటి కమాండ్స్ ఇస్తే చాలు ఫోన్ కేవలం సమాధానం ఇవ్వడం కాదు… సంబంధిత యాప్స్, సైట్స్ ను తెరిచి, సమాచారం సేకరించే దిశగా ఇప్పుడు సాంకేతికత అడుగులేస్తోంది.

ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి..?

చాట్ బోట్ నుంచి ఏఐ ఏజెంట్ వరకూ మన ప్రస్థానం టెక్నాలజీలో కొత్త అడుగులు వేస్తూనే ఉంది. చాట్ జీపీటీ లాంటి జెనరేటివ్ ఏఐ ప్రధానంగా మన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిస్తుంది. అంటే మనం అడిగితేనే అది ప్రతిస్పందిస్తుంది. కానీ, ఏజెంటిక్ ఏఐ మాత్రం మన లక్ష్యాన్ని అర్థం చేసుకుని, దాన్ని సాధించడానికి అవసరమైన పనులను గుర్తించడంతో పాటే, కొన్ని దశలను అది పూర్తి కూడా చేయగలదు. ముఖ్యంగా మన లక్ష్య విస్తరణ పరిధిని అర్థం చేసుకోగల విసృతి ఏజెంటిక్ ఏఐ ప్రత్యేకత.

తాజాగా గూగుల్ 2026లో డెవలప్ చేసిన ఆండ్రాయిడ్ ను కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ గా మాత్రమే కాకుండా… ఇంటలిజెన్స్ సిస్టమ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించింది. జెమిని ఇంటలిజెన్స్ ద్వారా ఫోన్ వాడుతున్న ఆ వినియోగదారుడి కాంటెక్స్ట్ ను అర్థం చేసుకుని పనులను ముందుగా చేసే లక్ష్యంతో అది పని చేస్తుంది.

అసలు ఫోన్ ఏం చేయగలదు..?

ఉదాహరణకు మీరు బ్యాంకాక్ వెళ్లారనుకోండి. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన అఫీషియల్ మెయిల్స్ అన్నీ చెక్ చేసి.. ముఖ్యమైన సమాచారాన్ని మనకు కావల్సిన రీతిలో క్రోడీకరించి పెట్టమనే కమాండ్ ఇచ్చామనుకోండి.. లేదా, మీరు వెళ్లాల్సిన ప్రదేశమెక్కడ..? వెళ్లడానికి మార్గాలేంటి..? ప్రయాణ సౌకర్యాలేంటి… ? ఏ హోటల్ అయితే భోజనానికి బాగుంటుంది..? ఏ రిసార్టులో దిగితే ఎకనామికల్, ఏది కాస్ట్లీ..? ఇలా ఏవైనా… మల్టీపుల్ టాస్క్స్ పనులన్నీ ఏఐ ఒకే ఒక్క సమాధానంలా ఇవ్వకుండా…. వివిధ సమాచారాలను క్రోడీకరించి మన ముందుంచుతుంది.

గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ లో జెమినిని క్రోమ్ తో అనుసంధానం చేసింది. ఏజెంటింక్ బ్రౌసింగ్ ను తీసుకొస్తోంది. అంటే, వెబ్ పేజీలను వేగంహా చదవి, సందర్భాన్ని అర్థం చేసుకుని, ఏఐ మరింత చురుకుగా వ్యవహరించే ఓ వ్యవస్థ అది. సామ్ సంగ్ కూడా గ్యాలక్సీ ఎస్ 26 సీరిస్ లో ఏజెంటిక్ ఏఐని ఉపయోగించి వినియోగదారుడు రొటీన్ గా చేసే టాస్క్స్ ను తానే నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టింది.

మరింత స్పష్టంగా అసలేం మార్పు జరిగినట్టు..?

ఇప్పటివరకూ మనిషి యాప్స్, సైట్స్ తో పని చేస్తూ పోతున్నాడు. ఇక్కడ్నుంచి మనిషి ఏఐ ఏజెంట్ కు కమాండ్ ఇస్తే… అదే యాప్స్, సైట్స్ అన్నీ వెతికి పని కానిచ్చేస్తోంది. ఇక్కడ ఏ యాప్ లోకి వెళ్లాలి, ఏ సైట్ వెతకాలనేది మనిషి ఏఐకి చెప్పాల్సిన పనే లేదు.

క్వాల్ కామ్ కూడా 2026లో కొత్త మోబైల్ ప్రాసెసర్ ను ఏజెంటిక్ ఏఐ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. కొత్త హెక్సాగాన్ ఎన్పీయూ వంటి హార్డ్ వేర్ ద్వారా… ఏఐ, మరింత ఎక్కువ కాంటెక్స్ట్ ను అర్థం చేసుకుని, మల్టీ స్టెప్స్ టాస్క్స్ ను ఫోన్ లోనే నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.

మరి ఏఐకి కమాండ్ ఇవ్వాల్సిందేనా…? అదిప్పటికే ఉన్నదేగా..?

ఫోన్ మన గురించి ఎంత తెలుసుకుంటుందన్నదే పెద్ద ప్రశ్న..? కానీ, మన క్యాలెండర్ లో అపాయింట్మెంట్స్, మన మోబైల్ లో వచ్చిన మెస్సేజెస్, ఈ మెయిల్స్, లొకేషన్, షాపింగ్ హ్యాబిట్స్, మనం తరచుగా ఉపయోగించే యాప్స్.. ఇలాంటి వ్యక్తిగత కాంటెక్స్ట్ ఏఐ గుర్తిస్తుంది. అందుకే అది మన అవసరాలను అర్థం చేసుకోవడం సులభమైపోతుంది. అందుకే, ఈ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ రోజుల్లో ప్రైవసీ కూడా అంతే కీలకంగా చర్చనీయాంశమవుతోంది.

మరి ప్రైవసీ భద్రతెంత..?

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఏజెంటిక్ ఏఐ వ్యవస్థకు ఎక్స్ప్లిక్ట్ యూజర్ కంట్రోల్, డాటా ప్రొటెక్షన్, ట్రాన్స్పరెన్సీ వంటి అంశాలను ప్రధాన భద్రతా సూత్రాలుగా పేర్కొంది. ఇక క్వాల్ కామ్ మాత్రం.. కొన్ని ఏఐ పనులను నేరుగా డివైజ్ పైనే నిర్వహించడంతో లేటన్సీ తగ్గి, ప్రైవసీకీ ప్రయోజనముంటుందంటోంది.

మరి ఫోన్ ఆలోచించడమేంటి..?

ఫోన్ కు మనిషిలా చైతన్యం, ఆలోచన వచ్చిందని అర్థం కాదు. ఏఐ మన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి, ఓ పని పూర్తి చేయడానికి కావల్సిన చర్యలను చేపడుతుంది.

అంటే, జస్ట్ నాకు దీనికి సమాధానం చెప్పు అని కమాండ్ ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఏఐ నుంచి… ఏకంగా పనే పూర్తి చేసిపెట్టే ఏఐ వైపు ప్రయాణం మొదలైందన్నమాట.

ఇంతకాలం స్మార్ట్ ఫోన్ లో కెమెరా ఎన్ని మెగాపిక్సెల్, ర్యామ్ కెపాసిటీ ఎంత, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది వంటివి చూసిన వినియోగదారుడు.. ఇకముందు నుంచి నేను చెప్పకపోయినా నా అవసరాల్ని నేను కొనబోయే మోబైల్ ఎంతవరకు అర్థం చేసుకుంటుందనే ప్రశ్నలతో మార్కెట్ కు వెళ్లవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles