కాలం విధిని విషాదభరితం చేసింది: దత్ దంపతుల్ని ఇండియన్ సినిమాకు దూరం చేసింది!

#GeetaDutt

……………………………………………………………

Shanthi Ishaan… ✍🏻

……………………………………………………………………………………………………

Jane kya tune kahi

Jane kya maine suni

Baath kuch ban hi gayi

గీతా దత్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదీ అంటే నేను టక్కున చెప్పే పాట ఇదే! Pyaasaలో వహీదా రెహ్మాన్ కోసం ఆవిడ పాడిన ఈ పాట మనసులో తేనె చిలకరించిపోతుంది. నిజానికి గీతా దత్ గమ్మత్తైన nasal voiceతో కవ్వించే పాటలే ఎక్కువగా పాడారు. అందుకేనేమో సాఫ్ట్ మెలోడీలంటే ఇష్టపడే నాకు ఆవిడ పాడే అన్ని పాటలూ నచ్చవు. అయినా నాకు తెలియకుండానే చాలా పాటలు ఎప్పుడు మస్తిష్కంలోకి చేరిపోయాయో మరి! అంతా మన్ చాహే గీత్, ఛాయాగీత్, రంగోలీ పుణ్యమే!

Aye dil mujhe bata de – 1956లో వచ్చిన Bhai Bhai సినిమాలో పాట ఇది. గీతా దత్ పాడిన హుషారైన పాటల్లోకెల్లా ఇది గొప్ప చుల్ బులీ సాంగ్. మదన్ మోహన్ స్వర కల్పనలో ఆవిడ పాడిన అతి తక్కువ పాటల్లో ఇదొకటి.

Babuji Dheere Chalna, Mera naam chin chin chu పాటల్లో వగలు, సెగలు Thandi hawa kali ghataలో పలవరింతలు గీతా దత్ గొంతులో మత్తుగా ఒదిగిపోతాయి. ఆవిడ గాత్ర ధర్మానికి, ఒ.పి. నయ్యర్ స్వర కల్పన కుదిరిపోతుందనడానికి ఈ పాటలే ఉదాహరణలు. వీటితో పాటు ఒ.పి. నయ్యర్ గీతా దత్ కి మరెన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. CIDలో Jaata kaha hai diwane, రఫీతో కలిసి పాడిన Aye dil hai mushqil jeena yahan, బాజ్ లో Ae dil ae diwane ఇలా ఒ.పి. నయ్యర్ సంగీతంలో వచ్చిన పాటలు గీతా దత్ కెరీర్ ని మలుపు తిప్పాయి.

బాజ్ సినిమా అప్పుడే గీతా రాయ్ కి గురు దత్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది.

1953లో గురుదత్ తో పెళ్ళైన తర్వాత ఆయన తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ గీతా దత్ పాడారు. Aar Paar, Mr. & Mrs. 55, CID, Pyaasa, Kagaz Ke Phool, Sahib Bibi Aur Ghulam- మచ్చుకు కొన్ని! వీటిలో ఒ.పి. నయ్యర్ పాటలు సగమైతే మిగతా సగం S.D. బర్మన్ వి! నయ్యర్ తో పాటు గీతా దత్ కెరీర్ ని మలుపు తిప్పిన క్రెడిట్ బర్మన్ కి కూడా దక్కుతుంది. అసలావిడకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందే S.D. బర్మన్! 1947లో వచ్చిన Do Bhai సినిమాలో గీతా- బర్మన్ దా కంపోజిషన్ లో Mera sundar sapna beet gaya అనే పాట పాడారు. ఇక దేవానంద్ Baaziలో Tadbeer se bigdi huyi అంటూ ఆవిడ పాడిన పాట ఎవర్ గ్రీన్ హిట్.

Pyaasa, Kagaz Ke Phool సినిమాలతో S.D. బర్మన్ గీతా దత్ గొంతును అజరామరం చేశారు. Waqt ne kiya kya hasee sitam ఎవరు మాత్రం మర్చిపోగలరు? గీతా దత్ పాటల్లో నాకు బాగా ఇష్టమైన మూడు పాటల్లో ఇది రెండోది. ఈ పాట వింటున్నప్పుడల్లా నేను తెర మీద కనిపించే వహీదా రెహ్మన్ కంటే తెర వెనక వినిపించే గీతా దత్ కే ఎక్కువగా కనెక్ట్ అవుతాను.

Beqaraar dil is tarah mile

Jis tarah kabhi ham judaa na the

Tum bhi kho gae, ham bhi kho gae

Ek raah par chalke do qadam

Kaifi Azmi రాసిన ఈ పదాలు వహీదా కంటే గీతా దత్ కే బాగా సరిపోతాయనిపిస్తుంది. ఈ సినిమా రిలీజయ్యే నాటికి వహీదా రెహ్మాన్ గురు దత్ జీవితంలోకొచ్చి చాలా కాలమే అయింది. వహీదా కోసం ఈ లైన్లు పాడుతున్నప్పుడు గీతా దత్ మనసులో ఎలాంటి భావాలు చెలరేగి ఉంటాయో కదా!

Na jao sayya chudake bayya – ఇది Sahib Bibi Aur Ghulamలో పాట. గీతా దత్ పాడిన పాటల్లో నా మూడో ఫేవరెట్ సాంగ్ ఇది. తెర మీద మీనా కుమారి ఉన్నా ఆవిడలో గీతా దత్ కనిపిస్తుంది నాకు. మరెవరి కోసమో భర్త తనని విడిచి వెళ్తుంటే వెళ్ళొద్దంటూ ప్రాథేయపడే భార్యగా మీనా కుమారి నటిస్తే ఆవిడ బాధను తన స్వరంలో అంతే ఆర్ద్రంగా పలికించారూ గీతా దత్. తాగిన మైకాన్ని, విషాదాన్ని, విరహాన్ని కలగలిపిన ఆవిడ గొంతు హేమంత్ కుమార్ బాణీని మరపురాని పాటగా మార్చింది.

విషాదమేమంటే గీతా దత్ కూడా భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇలా తాగుడుకు బానిసయ్యే లోకాన్ని విడిచిపెట్టారు. గురు దత్ 39 ఏళ్ళకు చనిపోతే ఆవిడ 41 ఏళ్ళకు వెళ్ళిపోయారు. Waqt ne kiya kya haseen sitam అన్నట్లు కాలం అటు ఆవిడతోను ఇటు గురు దత్ తోను అలా ఆటలాడుకుంది. ఇద్దరినీ చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయి Indian Cinemaకి తీరని లోటు మిగిల్చింది!

(జులై 20 గీతా దత్ వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles