ఓ అమెరికా అమ్మను మార్చేసిన భారత జీవనశైలి!

పొరుగింటి పుల్లకూర రుచి.. మనది కానిదేదైనా నచ్చినప్పుడు ఈ సామెతను ఎక్కడైనా ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి అన్వయించుకోవచ్చు. అలా అన్వయించుకోవడమా… లేక మన దేశానికి వచ్చి ఏకంగా ఓ పరివర్తనకే గురవ్వడమా అన్నది ఈ స్టోరీని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు.

అవును.. ఓ అమెరికన్ మహిళ భారత్ ను తెగ పొగిడేస్తున్న పోస్టొక్కటి ఇప్పుడు ఇన్ స్టాలో తెగ వైరలవుతోంది. హిందీ నేర్చుకోవడం నుంచి శాఖాహారిగా ఆమె ఎలా మారిందో చెప్పే ఆ పోస్టుపై ఇప్పుడు భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా ఇండియన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నవే.

నాల్గేళ్ల క్రితం క్రిస్టెన్ ఫిషర్ అనే మహిళ ఇండియాకొచ్చింది. అప్పట్నుంచీ తన జీవితం ఎలా మారిపోయిందో తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం భారత్ లో స్థిరపడ్డ ఆమె భారత్ గురించి చెబుతున్న మాటలు మన దేశం ప్రత్యేకత, వైవిధ్యాన్ని చూపిస్తుంటే.. ఇంకోవైపు, పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఎగతాళి చేసేవారూ ఉండకపోరు.

భారత్ లో స్థిరపడ్డప్పట్నుంచీ ఆమె పది ముఖ్యమైన మార్పులను గమనించినట్టు చెబుతోంది. అందుకు, మన దేశానికి హృదయపూర్వక ధన్యవాదాలంటోంది.

https://www.instagram.com/reel/DMRmx61s0sZ/?utm_source=ig_web_copy_link

క్రిస్టెన్ ఫిషర్ సహజంగానే నాన్ వెజిటేరియన్. కానీ, భారత్ కు వచ్చాక ఆమె పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయింది. అలాగే, ఆ శాకాహారాన్ని రుచిగా వండుతుండటంతో కూడా ఆ టేస్టుకు మంత్రముగ్ధురాలై.. తానూ, ఇప్పుడు వంటలు నేర్చుకుంది.

అలాగే, ఇండియాలో జనం రోజూవారీ ట్రావెలింగ్ స్టైల్ ఫిషర్ కు బాగా నచ్చేసిందట. యూఎస్ లో బయటకు వెళ్లాలంటే డీఫాల్ట్ గా కారు బయటకు తీయాల్సిందే. కానీ, ఇండియాలోనైతే.. క్యాబ్స్, రిక్షాలు, ఆటోలు, బస్సులు, మెట్రో రైళ్లు ఇలా ఎన్ని సదుపాయాలున్నాయని ఆశ్చర్యపోతోంది. అలాగే, భారత్ లో ఎక్కడ చూసినా విరివిగా కనిపించే బైక్స్, స్కూటర్స్ చూస్తుంటే చూడముచ్చటగా ఉందట. అమెరికాలో చాలాచోట్ల అవి రోడ్లపైకి రావడమే నిషిద్ధం. అందుకే, భారత్ లో స్కూటర్ పై తిరుగుతుంటే ఎంత హాయిగా ఉందో అంటోంది.

క్రిస్టెన్ ఫిషర్ ఇప్పుడు విదేశీ దుస్తులకుగాను.. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, పంజాబీ చుడీదార్స్ ను ధరించడం తనకు కొత్త అనుభూతినిస్తోందంటోంది.

అమెరికా వంటి దేశాల్లో ట్రక్కులో రవాణా చేస్తూ ఫ్రీజర్స్ లో రోజుల తరబడి ఉండే ఆహారానికి భిన్నంగా.. భారత్ లో తాజాగా ఎప్పటికప్పుడు లభించే పాలు, కూరగాయలు, వాటి ఉత్పత్తులు కూడా తాను ఇండియా జీవనవిధానాన్ని ఇష్టపడటానికి ప్రధాన కారణమంటోంది ఫిషర్. ముఖ్యంగా ఆకుపచ్చ రంగుల్లో తాజాగా కళ్లకింపుగా కనిపించే ఆకుకూరలు, కూరగాయల తాజాదనం ఆమెను కట్టిపడేసి.. వాటిని వండే తీరు, రుచి ఆమెకు నచ్చి ఆమె ఏకంగా ఇండియాలోనే సెటిలైపోయిందిప్పుడు.

వీటన్నింటినీ మించి ఫిషర్ హిందీ కూడా నేర్చేసుకుందట. అంటే మోడీ దృష్టిలో, భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ దృష్టిలోనూ, హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణిస్తున్న పవన్ కళ్యాణ్ వంటివారి గుడ్ లుక్స్ లోనూ పడే మరో ముచ్చట కూడా చెబుతోంది ఫిషర్.

భారతదేశ విద్యావ్యవస్థపై ప్రశంసలు కురిపించిన క్రిస్టెనా.. అమెరికాతో పోలిస్తే భారత్ లో ప్రైవేట్ విద్య నాణ్యతతో పాటు, తక్కువ ఖర్చుకో కూడుకున్నంటోంది. అందుకే, తన పిల్లలను ఓ ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తోందట. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు తగ్గట్టుగా భారత్ లో కనిపించే వైవిధ్యం ఆ అమెరికా అమ్మడుని మనదేశాన్ని ఆకాశానికెత్తేలా చేస్తోందట.

ఇంకొన్ని ముచ్చట్లు కూడా ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. అమెరికా కార్పోరేట్ మార్కెట్ లకు వెళ్లితే.. ఎంత బిల్లు వేస్తే అంత చెల్లించడం మినహా బేరసారాలకు తావుండదు. కానీ, ఇండియాలో బహిరంగ మార్కెట్ లో ఏ వస్తువు కొనుగోలైనా జరిగే బేరసారాలు కాస్త ఇంట్రెస్టింగ్ అంటోంది ఈ అమెరికన్ అమ్మడు. చివరకు వాష్ రూమ్ కల్చర్ నుంచి వంటల వరకూ ఈ అమెరికా అమ్మకు మన భరతమాత అమ్మ నచ్చిదంటూ చేసిన ఈ పోస్ట్ పై భిన్నమైన స్పందనలు వస్తూనే ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles