కాస్పరోవ్ దే పైచేయి అయినా.. ఆనంద్ కూ ఆనందాన్నిచ్చిన గేమ్ అది!

కచ్చితంగా ప్రపంచ చెస్ విజేతల్లో గ్యారీ కాస్పరోవ్ ది ఒక శకం. కాస్పరోవ్ తో ఓ మ్యాచులో తానెదుర్కొన్న అనుభవాన్ని మన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పంచుకున్నాడు. అది తన జీవితంలో నాస్టాల్జిక్ అంటాడు ఆనంద్. సెయింట్ లూయిస్ లో ఈమధ్య జరిగిన క్లచ్ చెస్ ఎగ్జిబిషన్ ఈవెంట్ లోని ఆ అనుభవమేంటో తెలుసుకుందాం రండి.

సెయింట్ లూయిస్ లో విశ్వనాథన్ ఆనందర్, గ్యారీ కాస్పరోవ్ మధ్య జరిగిన చెస్ పోటీల్లో ఆనంద్ 11-13 తేడాతో గ్యారీ కాస్పరోవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కానీ, ఆ ఓటమి ఆనంద్ కు తన కెరీర్ లోనే చాలా రోజుల తర్వాత ఓ నాస్టాల్జిక్ ఈవెంట్ గా మిగిలిపోయిందట. రష్యన్ గ్రాండ్ మాస్టర్ గ్యారీ కాస్పరోవే గెల్చాడు. ఆనంద్ ను సులభంగా చిత్తు చేశాడు. అయితే, చివరి రెండు బ్లిట్జ్ గేమ్స్ లో మాత్రం ఆనంద్ కు విజయాలు దక్కాయి. అప్పటికే మొదటి విడతలో గ్యారీ కాస్పరోవ్ రెండు బ్లిట్జ్ గేమ్స్ తో పాటు.. రెండు ర్యాపిడ్ గేమ్స్ లోనూ గెల్చాడు.

మొదటి గేమ్ లో గెలిస్తే వన్ పాయింట్, డ్రా చేసుకుంటే ఆఫ్ పాయింట్.. రెండో రోజు గెలిస్తే రెండు పాయింట్లు, డ్రా చేసుకుంటే ఒక పాయింట్.. మూడోరోజు గెలిస్తే మూడు పాయింట్లుగా ఉన్న నిబంధనల్లో మొదటి రౌండ్లలోనే ఆనంద్ పై కాస్పరోవ్ ఆధిక్యం ఖరారైపోయింది.

ఆ గేమ్ మొత్తం ఆడుతున్నంత సేపు చెస్ ఆడుతున్నట్టు అనిపించలేదని.. ఏదో పజిల్ సాల్వేషన్ చేస్తున్నట్టుగా తోచిందంటాడు ఆనంద్. కాస్పరోవ్ తో ఆటలో పూర్తిగా ప్రాక్టికల్ టచ్ మిస్సయ్యాయనని అంగీకరించాడు. మొదటి రోజు నాల్గో గేమ్ లో గెలవకపోవడంతో షాక్ కు గురైన ఆనంద్.. తర్వాత రోజు మొదటి గేమ్ టైం కూడా అయిపోవడంతో అయోమయానికి గురయ్యాడట.

ఆనంద్, కాస్పరోవ్ ఈ ఇద్దరు చెస్ దిగ్గజాలు.. ఈ పోటీకంటే ముందు చివరిసారిగా 1995లో న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో తలపడ్డారు.

కాస్పరోవ్ తో ఆటకు నేను అర్హుడిననే.. దిగాను. ఓడినా, చివరి బ్లిట్జ్ గేమ్ లో విజయంతో ముగించడం కాస్త ఆనందాన్నించిందంటాడతను. కనీసం ఇంటికి తిరిగి వెళ్లే ముఖం లేకుండా అయింతుందేమోనని భయపడ్డాను. అలాంటి అవసరం లేకుండా, ముఖం దాచుకోకుండా చివరి రెండు బ్లిట్జుల్లో గెలుపు తనకు కాస్త ఊరట అంటాడు.

ఆ మ్యాచులో కాస్పరోవ్ కు 70 వేల డాలర్లు ప్రైజ్ మనీ.. అంటే 62 లక్షలు దక్కగా.. ఆనంద్ కు 50 వేల డాలర్లు, అంటే 44 లక్షలు లభించాయి.

అదే విషయంపై కాస్పరోవ్ మాటల్లో మరింత ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆనంద్ ఊహించినదానికంటే తాను దృఢంగా ఉన్నాను. ఆనంద్ నాతో ఆడిన గత గేమ్స్ లో ఓడిపోవడం, సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం వంటివి కూడా సెయింట్ లూయిస్ లో అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉండొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles