ముంబై వీధుల్లో నీకన్నమెవ్వడు పెడతాడన్న తండ్రి హెచ్చరికను ధిక్కరించాడు! వెర్సటైల్ డైరెక్టర్ గా ఎదిగాడు!!

ఒక పరిందా వంటి క్రైమ్ డ్రామా, ఒక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సెటైరికల్ కామెడీ, మరో 1942 ఏ లవ్ స్టోరీ వంటి ప్రేమకథ, ఇంకో 12th ఫెయిల్ వంటి సక్సెస్ స్టోరీ, షికారా వంటి కశ్మీరీ పండిట్లకు సంబంధించిన కథనం, దేశభక్తి ఇతిహాసంగా తీసిన ఓ మిషన్ కశ్మీర్, సంజయ్ దత్ లైఫ్ స్టోరీని తెరకెక్కిస్తూ రూపొందించిన సంజు… ఇలా చెప్పుతూ పోతే ఓ కరీబ్, ఓ వజీర్, ఓ పరిణీత ఈ సినిమాలతో పాటు గుర్తొచ్చే పేరు.. విధు వినోద్ చోప్రా!

అయితే సంజు, త్రీ ఈడియట్స్, 12th ఫెయిల్ వంటి రియల్ స్టోరీస్ ను తెరకెక్కించిన విధు వినోద్ చోప్రా నిజజీవితం కూడా ఓ సినిమా బయోపిక్ కు కావల్సినంత స్ట్రగుల్స్ తోనే సాగింది. దర్శకుడు కావాలని తండ్రితో చెబితే… చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. తిండి దొరక్క ముంబై వీధుల్లో చచ్చిపోతావ్.. నీకన్నమెవ్వడు పెడతాడనుకుంటున్నావ్ అన్నారట వినోద్ చోప్రా తండ్రి.

14వ ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ IFB డిస్కషన్స్ లో తన లైఫ్ జర్నీని పంచుకున్నాడు విధు వినోద్ చోప్రా!

కశ్మీర్ లో ఉన్నప్పుడు మానాన్నతో.. పా నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడట చోప్రా. దాంతో తన తండ్రికి ఒక్కసారి తలతిరిగినట్టై ఒక్క చెంపదెబ్బ చర్చడంతో పాటు.. భూకా మర్జాయేగా బాంబేమే.. కైసే రహేగా..? అంటూ హెచ్చరిస్తూ ప్రశ్నించాడట.

తన ఆకాంక్షకు తండ్రి నుంచి వచ్చిన ప్రతిస్పందన అప్పటికప్పుడూ తనను బాధించినా… ఏ తండ్రైనా తన కొడుకు యోగ, క్షేమాలే కోరుతాడని.. భవిష్యత్తు బాగుండేందుకే తమకు సాధ్యం కాదనుకున్నవాటిపట్ల పిల్లల్ని అప్రమత్తం చేస్తారనీ.. అదే తన తండ్రి చేశాడంటారు వినోద్ చోప్రా.

అయితే తండ్రి హెచ్చరిక సరే.. మరి తనలో బలంగా నాటుకున్న కోరిక మాటేంటి..?

విధు వినోద్ చోప్రా అకడమిక్ గా మంచి స్టూడెంట్. కశ్మీర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ఆనర్స్ లో ఫస్ట్ క్లాస్ డిస్ట్రింక్షన్ తో టాప్ మార్క్స్ తెచ్చుకున్నాడు. దాంతో తనకు భారత ప్రభుత్వం నుంచి 250 రూపాయల జాతీయ స్కాలర్ షిప్ లభించింది. అయితే, తన తండ్రి వద్దని వారించినా… తనకు ఆర్థిక మద్దతివ్వకపోయినా… అదిగో తనకు లభించిన 250 రూపాయల స్కాలర్ షిప్ తో ముంబైలోకి ఎంటరయ్యాడు విధు వినోద్ చోప్రా.

మొదట పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరిన చోప్రా.. 18 ఏళ్ల రోడ్డు సైడ్ బాలబాలికలు పౌష్ఠికాహాలోపంతో ఎలా బాధపడుతున్నారు.. పేదరికంలో పుట్టడమే వారి పాపమా అనే కాన్సెప్ట్ తో తీసిన మొట్టమొదటి డాక్యుమెంటరీనే విమర్శలకుల ప్రశంసలందుకుంది. ఏకంగా 1978లో ఆస్కార్ కు కూడా ఈ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో నామినేట్ అయ్యింది.

ఆస్కార్ కు నామినేట్ అయిన విషయాన్ని తన తండ్రితో పంచుకున్నప్పుడు కూడా ఆస్కార్ ప్రశంస సరే.. పైకమెంతొస్తుందనడిగారంటూ ఫన్నీగా తన తండ్రితో తన సినిమా లైఫ్ జర్నీకి సంబంధించిన సంవాదాన్ని పంచుకున్నారు చోప్రా.

CHASE EXCELLENCE AND SUCCESS WILL FOLLOW. థీమ్ ఆఫ్ త్రీ ఈడియట్స్ సినిమా ఫిలాసఫీనే ఆది నుంచీ విధు వినోద్ చోప్రా పాలసీ. ఆయన సినిమాల్లో చాలామట్టుకు ఆ స్ఫూర్తే కనిపిస్తుంటుంది.

ఈమధ్య ఆయన తెరకెక్కించిన 12TH ఫెయిల్ సినిమా కూడా ఓ నిజ జీవిత కథే. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మకు.. చోప్రా ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్.. ఒక లెవల్లో ఆకట్టుకుంది. ఓటీటీలో విడుదలైన 12TH ఫెయిల్ విమర్శలకులనూ ఆకట్టుకున్న సినిమాగా చర్చనీయాంశమైంది. మొత్తంగా విధు వినోద్ చోప్రా కెరీర్.. కొన్ని కమర్షియల్ సక్సెస్ లతో పాటు.. మరికొన్ని ఆలోచింపజేసే సినిమాలతో.. ఆయన జీవితానికి దగ్గర ఉండేలా సాగడం గమనించాల్సిన విషయం. మరోవైపు ఎక్కడా హ్యూమర్ మిస్ కాకుండా… ఒకింత వ్యంగ్యాత్మకంగా చిత్రాలను సంధిస్తూ తనకంటూ ఒక పేరును సృష్టించుకున్నారు చోప్రా. రామాయణ్ తీసిన రామానందసాగర్ కు బంధువు కూడా అయిన విధు వినోద్ చోప్రా.. తండ్రి మాట కాదని కశ్మీర్ వదిలి ముంబై వచ్చాడు. అయినా సరే సక్సెస్ సాధించిన ఈ పంజాబీ హిందూ.. ముంబైలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles