ట్రూడో యూ టర్న్! భారత్ ఎదురుదాడి!!

కెనడాలో జరిగిన ఖలీస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసును… ఇండియాపై నెట్టేసి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలనుకున్న కెనడా ఆరోపణల్లో పసలేదని తేలిపోతోంది. సరిగ్గా మూడురోజుల్లోనే కెనడా ప్రధాని ట్రూడో మాట మార్చేయడంతో… సరైన ఆధారాల్లేవనే విషయమూ ఇప్పుడు తేటతెల్లమైంది.

పైగా భారత్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా చూపెడుతూ… ఒత్తిడి పెంచేందుకు కెనడా యత్నించడం.. అందుకు యూఎస్, యూకే వంటి దేశాలు సన్నాయి నొక్కులు నొక్కడంతో భారత్ ఈ సవాల్ ను ఎలా స్వీకరిస్తుందోనన్న ఆసక్తి అంతర్జాతీయంగా నెలకొంది.

కానీ, విషాదమేంటంటే.. తాము చేసిన ఆరోపణలనే తాము ఆధార సహితంగా నిరూపించలేమని ఏకంగా కెనడా ప్రధానే మాటమార్చి నొక్కి వక్కాణించడంతో… సవాల్ కాదు కదా.. కెనడా మొత్తం వ్యవహారం, దానికి మద్దతు తెలిపే ప్రాశ్చాత్య దేశాల గుడుపుఠాణీ ఇప్పుడు అదే అంతర్జాతీయ సమాజం ముందు హాస్యాస్పదమైపోయింది.

కేవలం, కెనడా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్, రాయల్ కెనడియన్ మౌంటెండ్ పోలీస్ ఇచ్చిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ఆరోపణలు గుప్పించినట్టు స్వయానా కెనడా ప్రధానే చెప్పడంతో… కెనడా పరువే అంతర్జాతీయ సమాజం ముందు అట్లాంటిక్ సముద్రంలో కలిసిపోయింది.

ఇండియాను టార్గెట్ చేయాలనుకుని సరిగ్గా నాల్గైదు రోజుల వ్యవధిలోనే బొక్కబోర్లా పడిన కెనడాకు.. నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ నాయకుడు, ఖలీస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ గత మూడేళ్లుగా తాను ట్రూడో కార్యాలయంతో టచ్ లో ఉన్నట్టు వెల్లడించడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు తెలపడంతో.. కెనడా ఆడుతున్న నాటకాలన్నీ బట్టబయలైపోయాయి.

దీంతో భారత దౌత్యవేత్తలపై కెనడా చేసిన ఆరోపణలన్నీ నిరాధారామైనవనీ… ఆధారాలుంటే చూపాలంటూ ఇండియా విసిరిన ప్రతిసవాల్ కు.. కెనడా ప్రధాని మాటమారుస్తూ చేసిన వ్యాఖ్యలే ఆ దేశపు లేకితనాన్ని బయటపెట్టాయన్నది.. ఇంతవరకూ డిఫెన్స్ లో ఉన్న భారత్ కౌంటర్ అటాక్ చేస్తూ చెబుతున్న మాటలు.

ఖలీస్తానీ వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదాన్ని పెంపొందించేందుకు కెనడా ప్రయత్నిస్తోందటూ భారత విదేశీ మంత్రిత్వ శాఖ కౌంటర్ అటాక్ తో ఇంతవరకూ భారత్ పై దాడికి దిగిన కెనడా.. ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ కేసులో భారత ప్రభుత్వ జోక్యాన్ని బట్టబయలు చేసే సాక్ష్యాలను బయటపెట్టడంలో కెనడా విఫలమైందని.. అవి నిరాధారారోపణలని తేటతెల్లమైనాయంటూ ఇప్పుడు కెనడాను ఇండియా కార్నర్ చేయడంతో.. కెనడా నాటకం కాస్తా బూమ్ రంగ్ గా మారిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles