నాటి లిబర్టీ.. నాస్టాల్జిక్!

Prabhakar Jaini.. ✍🏼

#liberty

ఇప్పటి తరానికి ‘లిబర్టీ’ అంటే ఒక బస్ స్టాప్ పేరుగానే తెలుసు.
కానీ, ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం, లిబర్టీ అనే థియేటర్ ఉన్న ఆ ప్రాంతం, దాదాపు ఒక కల్చరల్ సెంటరుగా ఉండేది. ఇంగ్లీష్ సినిమాలతో కళకళలాడుతూ ఉండేది. ట్యాంక్ బండ్ నుండి, బషీర్ బాగ్ నుండి వచ్చేవాళ్ళంతా హిమాయత్ నగరు వెళుతూ, లిబర్టీ ముందు ఆగేవాళ్ళు, ఛాయ్ లు తాగుతుండేవాళ్ళు, బాతాఖానీ వేసుకునే వాళ్ళు. లైఫ్ వస్ సో సింపుల్ అండ్ స్లో పేస్డ్!
{Life Was so simple and slow paced}
ఇప్పటిలాగా ఉరుకుల పరుగుల జీవితాలు కాదు.

లిబర్టీ థియేటర్ ఎదురుగానే, హిమాయత్ నగర్ వెళ్ళే వైపు ఉన్న కొత్తగా కట్టిన ఒక బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోరులో నేను స్టెనోగ్రాఫర్ గా పనిచేసే, UCO BANK ఉండేది. పక్కనే లక్ష్మీ సూపర్ బజార్ ఉండేది. మా బిల్డింగ్ కింద ALEX Kitchen, ఒక ఐస్ క్రీం షాప్ ఉండేవి. వరంగల్ వంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన మాకు అలెక్స్ కిచెన్ లో దొరికే ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అద్భుతమైనవిగా అనిపించేది. ప్లేట్ పదిహేను రూపాయలేమో ఉండేది. మా పిల్లలు రైస్ కన్న ఎక్కువగా టమోటా సాస్ తినేవారు. మా బావమరిది ఓంకార్ వస్తే కంపల్సరీగా ఫ్యామిలీ డిన్నర్ అలెక్స్ కిచెనులోనే. అందరం కలిసిలతిన్నా, బిల్లు వంద రూపాయలు దాటకపోయేది.

ఐస్ క్రీం పార్లరులో కూడా నాలుగైదు రూపాయలకే పెద్ద కప్పు వచ్చేది. 1985 ప్రాంతంలో ధరలూ తక్కువే, జీతాలూ తక్కువే. అక్కడ తినడమే మాకు లగ్జరీగా అనిపించేది. బ్యాంకులో ఓవర్ టైమ్ డబ్బులు రాగానే, ఓ ఇరవయ్యో, ముప్ఫయో రాగానే, అదే రోజు అలెక్స్ కిచెన్ను దర్శించాల్సిందే!
లిబర్టీ, స్కైలైన్ థియేటర్లలో అప్పుడప్పుడు సినిమాలు చూసేవాణ్ణి.

ఇప్పుడు ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ఆనవాళ్ళే లేకుండా పోయాయి. మన మనోఫలకం మీద ముద్రించుకున్న దృశ్యం శిథిలమై పోయింది.

నాస్టాల్జిక్!

ఎందుకంటే, మొత్తం నగరం రూపురేఖలే మారిపోయాయి. వాతావరణం కలుషితమయింది. పొల్యూషన్, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి.

జలతారు మేలిముసుగు ధరించి అతిథులను ఆహ్వానించినటువంటి భాగ్యనగర సుందరి, ఇప్పుడు పబ్బుల్లో నాట్యగత్తెగా ఆధునీకరించబడింది.

Pic Courtesy: TIMES BIZ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles