కర్నాటక మహదేవపుర అసెంబ్లీ స్థానంలో జరిగిన ఓట్ల అవకతవకల గురించి కాంగ్రెస్ ముఖ్యనేత రాహూల్ గాంధీ ఓ పెద్ద చర్చ లేవనెత్తాక… దాని చుట్టూ కొన్ని చారిత్రిక అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తావనకొస్తున్నాయి. అలాంటి చర్చలో ఓ భాగమైంది మధ్యయుగానికి చెందిన తమిళనాడులోని ఓ టెంపుల్ టౌన్. ఏంటది..?
ఇంతకీ ఆ తమిళ పట్టణం ఏం చెబుతోంది..?
తమిళనాడులో ఉత్తరమేరూర్ ఓ అందమైన ఆలయాలు పట్టణం. చెన్నై నుంచి రెండు గంటల దూరం ప్రయాణిస్తే… ఓ సరస్సు ఒడ్డున కొలువైంది. తమిళనాడులోని ఎన్నో టెంపుల్ టౌన్స్ మాదిరిగానే… పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమిది. మధ్యయుగం నాటి మందిరాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇక్కడే శాసనాలతో చెక్కబడిన ఓ వైకుంఠ పెరమాళ్ ఆలయముంది. ఈ మధ్యయుగం నాటి ఆలయమే ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకొస్తోంది. నేటి కలియుగ ఎన్నికల తంతుపై చర్చ జరుగుతున్న క్రమంలో ఆ సారూప్యాలేంటో ఓసారి చూద్దాం.

ఎవరు ఓటు వేయాలి… ఓట్లను ఎలా లెక్కించాలి… ఎన్నికల్లో జరిగే మోసాలనుగావచ్చు, ఆర్థిక మోసాలనుగావచ్చు… ఒక సమాజమెలా ఎదుర్కోవాలి… అందుకోసం ఆయా సమాజాలు ఏం చేయాల్సి ఉంటుంది…? ఇలాంటి నిగూడార్థాలతో శాసనాలు మేరూర్ ఆలయాన్ని మిగిలిన ఆలయాలతో భిన్నంగా, ప్రత్యేకంగా నిలిపాయి.
సరిగ్గా 1906 సంవత్సరంలో ఎపిగ్రాఫిస్ట్ వి. వెంకయ్య ఈ శాసనాలను కనుగొన్నారు. అప్పుడే ఇవి సంచలనం సృష్టించాయి. 12 వందల సంవత్సరాల క్రితం.. లేదా, బహుశా అంతకుముదే.. ఉత్తరమేరూర్ రాజకుటుంబం బ్రాహ్మణులే పాలించే విధంగా చతుర్వేది మంగళం అనే స్వయంప్రతిపత్తి స్థావరంగా సృష్టించారనేది ఆ శాసనం వెల్లడించింది. అలా అక్కడి బ్రాహ్మణులు తమను తాము ఒక సభలా.. పట్టణ మండలిలా ఏర్పాటు చేసుకుని జీవించేవారట. జలాశయాలు, తోటల వంటివాటి నిర్వహణతోపాటు.. బంగారం నాణ్యతను ధృవీకరించడానికి ప్రత్యేక కమిటీలతో సభ నడిచేది. వైకుంఠ పెరుమాళ్ ఆలయం అందుకు వేదికయ్యేది. కనిపించడానికి సాధారణ సభ నడిపించే ఓ మందిరంలా… చోళుల పర్యవేక్షణలో ఇది కొనసాగేది. అయితే, ఆ కాలంలో ఉత్తరమేరూరు సభల నిర్వహించే కమిటీలను ఎలక్ట్రోరల్ పద్ధతిలో ఎన్నుకునేవారు. అందుకోసం కొన్ని నిబంధనలూ రూపొందించారు. నేరస్థులు ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అలా ఎపిగ్రాఫిస్ట్ వెంకయ్య కనుగొన్న శాసనాల్లో 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకూ అక్కడ జరిగిన పనులు, అందుకోసం అవలంబించిన విధానాలు, నిబంధనలు ఇలా ఎన్నో రికార్డులు అక్కడి శాసనాల్లో బయటపడ్డాయి.
ఆ శాసనాలను పరిశీలించిన వెంకయ్యతో పాటు, ఆయన వెంటనున్న మిగిలిన బృందం ఒకింత ఆశ్చర్యంతో పాటు, సంతోషాన్నీ వ్యక్తం చేసిందట. ఎందుకంటే, 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రజాస్వామ్యవాదన బలపడటానికి పూర్వమే… ఇంత జ్ఞానోదయం నాడే ఉండేదా అనే ఆశ్చర్యం వారిలో కనిపించిందట. అయితే, ఆ తర్వాత బయటపడ్డ శాసనాలు ఉత్తరమేరూరు రాజ్యం పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నడవకున్నా… అక్కడ, మిగిలిన రాజ్యాలతో పోలిస్తే ప్రజాస్వామ్య పద్ధతులు ఎక్కువ కనిపించడంతో… ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఏంటీ అసలు ఉత్తరమేరూర్ సభ…?
ఉత్తరమేరూర్ మోనుమెంట్స్, హిస్టరీ, అక్కడి లెజెండ్స్ కు సంబంధించిన చరిత్ర వంటివి పరిశీలించినప్పుడు కొన్ని డైనమిక్స్ కనిపించాయి. అదే సమయంలో అంత ప్రత్యేకమైందేమీ కాదనే విషయమూ రూఢీ అయిందని హిస్టారియన్స్ ఫ్రాంకోయిస్ గ్రోస్, ఆర్. నాగస్వామి వంటివారు వెల్లడించారు. ఉత్తర తమిళనాడులోని తొండైనాడులో ఓ ప్రముఖ పట్టణంగా ఉత్తరమేరూరు నాడు వెలుగొందింది. అక్కడ ఎన్నో వ్యవహారాలు సామాజికమైనవైనా.. వృత్తిపరమైనవైనా… సమిష్ఠిగా నిర్వహించేవారు. అయితే, స్వయంప్రతిపత్తి కల్గిన సభ, దాని నిర్వహణ.. ఉత్తరమేరూరును ప్రత్యేకంగా నిలిపింది.
అయితే, ఉత్తరమేరూరును ఆదర్శ పట్టణంగా కూడా ఎక్కడా అభివర్ణించలేదు. ఎందుకంటే అక్కడ ఇంచు జాగా నుంచి మొదలు ఆరోగ్య సంరక్షణైనా, విద్యైనా, తాగు నీటి నుంచి మౌలిక సదుపాయల కల్పనైనా అంతా బ్రాహ్మణాధిపత్యంలోనే కొనసాగేదట. వారే అక్కడ సామంతరాజుల్లా పాలించేవారు. పెద్ద పెద్ద సాగుదారులు, మోతుబరి రైతులుగా కూడా బ్రాహ్మణ సామాజికవర్గం నుంచే కనిపించేవారట. 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకూ కూడా ప్రముఖ భూస్వాములు, సాగుదారులుగా సభ వారి తరపునే మాట్లాడ్డం.. వారికే వత్తాసు పలకడం వంటివి కనిపించేదట.
అయితే, స్వయంప్రతిపత్తి కల్గిన ఉత్తరమేరూరు సభ… అన్నివేళలా శక్తివంతమైందేకాదు. ఇతర సంస్థలతో దాని సంబంధాలు, దాని బాధ్యతలను నిర్ణయించేవి. వేద పాఠశాలలు, ఆలయ పరిపాలన, భక్తజనుల సమూహాలు, ప్రైవేట్ దాతలు, పెట్టుబడిదారులు, అప్పుడప్పుడూ రాజు.. లేదా ప్రభువు వంటివారు ఆ సభను నిర్దేశించేవారు. 13వ శతాబ్దం నాటికి ఉత్తరమేరూరు ఆకర్షణ కాస్తా సన్నగిల్లి… తిరుప్పులివనం ఆ వైభవానికి కేరాఫ్ గా వెల్ల…



