ఒత్తిడి లేని విద్య, నైపుణ్యమైన శిక్షణ! అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు!!

ఫిన్లాండ్ విద్యా విధానం

……………………………………………………………………………………………………

డా.పుల్లూరి సంపత్ రావు…✍️

పిల్లలు పుట్టినప్పటినుండి మూడు సంవత్సరాల వయసు వరకు కేర్ వర్కర్ ఇంటికి వచ్చి ఆరోగ్యం ఆహారం గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఈ వయసు గల ప్రతి 12 మంది పిల్లలను ఒక టీచర్ మరియు ఇద్దరు నర్సులు చూసుకుంటారు. పిల్లలకు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత డే కేర్ లేదా హోం కేర్ లో ఉంటారు. ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 20 మంది పిల్లలకు ఒక టీచర్, ఇద్దరు నర్సులు ఉంటారు. ఒక సంవత్సరం ప్రి స్కూల్ ఉంటుంది. ఏడు సంవత్సరాల వయసులో పిల్లలు స్కూల్లో చేరుతారు. పదహారు సంవత్సరాల వయసులో తొమ్మిదవ తరగతి పరీక్షలు రాస్తారు. ఆ పైన యూనివర్సిటి విద్యకు గాని వృత్తి విద్యకు గాని వెళుతారు.

పని వేళలు విరామ సమయాలు ఒక్కో స్కూల్ లో ఒక్కో విధంగా ఉంటాయి. ఒక రోజులో మూడు నాలుగు లెసన్స్ మాత్రమే ఉంటాయి. హోం వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. అరగంట కంటే ఎక్కువ ఉండదు. టెస్టులుంటాయి. కానీ ఫలితాలను ప్రచురించడం గాని ఇతరులకు తెలియజేయడం గాని జరుగదు.

ఉపాద్యాయ విద్యార్ధి నిష్పత్తి 1:16 ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 20 కి మించదు. టెక్స్ట్ బుక్స్, సిలబస్, పరీక్షలు, లెసన్ ప్లాన్స్ మొదలైన విషయాలలో టీచర్లు సర్వ స్వతంత్రులు. వీరిని మరొకరు నియంత్రణ చేయడం, అంచనా వేయడం జరుగదు. అన్ని క్లాసులలోనూ ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు. క్లాసులోని అందరి పిల్లల వలె మిగతా పిల్లలకు అర్థం చేయించడం ఇతని పని. అందుకని పిల్లలకు వెనుకబడుతామని గాని, తమను వేరు చేస్తారని గాని ఫెయిల్ అవుతామని గాని భయం ఉండదు.

విద్యార్థులకు స్కూల్ కఫెటేరియాలో మంచి భోజనం పెడుతారు. అందులో కొందరు పిల్లలు పనిచేస్తూ గణితం నేర్చుకుంటారు. పనిచేస్తూ నేర్చుకోవడం ఇక్కడి పద్ధతి. పిల్లలు ప్లేట్లు కడుగుతారు. కఫెటేరియాల నిర్వహణకు ప్రభుత్వం సహాయం చేస్తుంది.

చాలా వరకు ప్రభుత్వ స్కూల్లే. కొన్ని ప్రైవేట్ మరియు ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉంటాయి. వీటిల్లో కూడా ట్యూషన్ ఫీజు ఉండదు. స్టూడెంట్ గ్రాంట్స్ ద్వారా ఫీజు తీసుకుంటారు. ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళకు మున్సిపల్ స్కూళ్ళకు ఇచ్చినట్టుగానే స్టాఫ్ గ్రాంట్ ఇస్తుంది. అయితే ఏ స్కూల్ అయినా సరే సెలెక్టివ్ అడ్మిషన్ అనేది ఉండదు. ఫిన్లాండ్ ప్రజలు టీచర్లను బాగా గౌరవిస్తారు.

ఔట్ డోర్ అక్టివిటీస్ ఎక్కువ. మ్యూజిక్ స్కూళ్ళను సందర్శించడం, సంతోషం కోసం చదవడం వంటివి ప్రోత్సహిస్తారు. ఇతర దేశాల కార్యక్రమాలను సబ్ టైటిల్స్ తో టీవీలో చూపిస్తారు. స్కూల్లోనే ఆహరం, ఆరోగ్య సదుపాయాలు,టెక్స్ట్ బుక్స్, స్కూల్ ట్రిప్స్ అన్ని ఉచితంగానే కల్పిస్తారు. సెకండరీ స్కూల్లో పుస్తకాలు మెటీరియల్స్ వంటివి కొనాల్సిందే. విద్యార్థులకు ప్రభుత్వం లోన్, ఉపకార వేతనాల, డబ్బు బదలాయింపు రూపంలో సహాయం చేస్తుంది. విద్యార్ధి సంఘాలు ఒంటరి విద్యార్థులకు డార్మేటరి సదుపాయం, ప్రాథమిక ఆరోగ్య రక్షణ కల్పిస్తాయి. ఉన్నత విద్యలో ఫీజులు ఫిన్లాండ్ వాసులకు యురోపియన్ యునియన్ వెలుపలి విద్యార్థులకు వేర్వేరుగా ఉన్నాయి.

ఫిన్లాండ్ విద్యావిధానంపై మరిన్ని స్టోరీస్ మీ బాతాఖానీలో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles