కొందరికి ఇళ్లు బతికేందుకు ఆవాసాలు… మరికొందరికి మరెన్నో హాలిడే స్పాట్స్ నూ మించిన తమ అస్తిత్వాలు… మరికొందరికి చిన్న గూడుంటే చాలు మిగిలిన బతుకెలాగైనా బతుకొచ్చనే అవసరాలు. కానీ, కొందరి ఇళ్లు… కొన్ని మ్యాన్షన్స్.. పర్యాటక కేంద్రాలు కూడాను. అవేంటో కొన్నింటి గురించి కాస్త తెలుసుకుందాం రండి.
కొన్ని రాజప్రసాదాలు కేవలం పర్యాటక ప్రాంతాలే కాదు.. ప్రపంచంలోనే శక్తివంతమైన సౌధాలు.. అలాంటి ఆస్తులు కూడా వార్తల్లో చర్చలే. అలాంటి ప్రాముఖ్యత కల్గిన విలాసవంతమైన విల్లాల జాబితానోసారి చూడండి.

ఇస్తానా నూరుల్ ఇమాన్..
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాజప్రసాదం. సుల్తాన్ హసనల్ బోల్కియా యాజమాన్యంలో ఉన్న ఈ భవనం.. బ్రూనైలోని బందర్ సెరి బెగావాన్ లో ఉంది. 21 లక్షల 52 వేల 782 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ విల్లా. సుల్తాన్ కు సంబంధించిన విలాసవంతమైన ఈ రాజప్రసాదంలో 1 వెయ్యి 788 గదులు, 257 బాత్రూమ్స్ తో పాటు… అతి పెద్ద గార్డెనింగ్ వ్యవస్థ, అటవీ ప్రాంతం ఇక్కిడికెళ్లినవారిని అబ్బురపరుస్తుంది.
ఫర్బిడెన్ సిటీ…
ఇక చైనాకు వెళ్లితే చూడాల్సిన మరో అద్భుతమైన రాజప్రసాదం ఫర్ బిడెన్ సిటీ. చైనా రాజధాని బీజింగ్ లో పురాతన సామ్రాజ్య భవన నిర్మాణానికి పరాకాష్ఠలా కళ్లు జిగేల్ మనిపిస్తుంది ఈ ఫర్ బిడెన్ సిటీ. 16 లక్షల 14 వేల 600 చదరపు అడుగుల విస్తీర్ఁణంలో ప్రపంచంలోనే ఈ భవనం రెండో అతిపెద్ద రాజభవనంగా ఖ్యాతికెక్కింది. ప్రస్తుతం ఈ భవనం చైనా ప్రభుత్వాధీనంలో ఉంది.
బకింగ్‌హామ్ ప్యాలెస్…
చాలా సినిమాల్లోనూ ఇప్పటికే మనం చూసి ఉన్నదే. 1837లో 3వ బ్రిటీష్ చక్రవర్తి కింగ్ ఛార్లెస్ కోసం ఈ విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించారు. లండన్ లో ఉన్న ఈ భవనంలో 775 గదులుండగా.. మొత్తం 8 లక్షల 28 వేల 820 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ బకింగ్ హమ్ ప్యాలెస్.
వెర్సైల్లెస్ ప్యాలెస్…
14వ లూయిస్ చారిత్రక నివాసం వెర్సైల్లెస్ ప్యాలెస్. 7 లక్షల 21 వేల 206 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్యాలెస్ లో అద్దాల మేడ చూడాల్సింది. ప్రకృతి ప్రేమికులను అటే ఉండిపోవాలనిపించేలా పెంచిన తోటలు ఈ ప్యాలెస్ ఆవరణలో కనిపిస్తాయి. ఫ్రెంచ్ రాజరికానికి చిహ్నంలా ఈ ప్యాలెస్ ను కింగ్ లూయిస్ రూపుదిద్దాదు. ప్యారిస్ లోని ఈ భవనం ప్రస్తుతం ఫ్రెంచ్ ప్రభుత్వాధీనంలో ఉంది.
స్టాక్‌హోమ్ రాయల్ ప్యాలెస్..
స్టాక్‌హోమ్‌లోనే ఉంది ఈ ప్యాలెస్. స్వీడిష్ రాజు అధికారిక ప్యాలెస్ అయిన దీని విస్తీర్ణం… దాదాపు 6 లక్షల 58 వేల 859 చదరపు అడుగులు. స్వీడిష్ రాజకుటుంబీకుల విలాసవంతమైన ప్యాలెస్ ఇది.
మాన్‌హీమ్ ప్యాలెస్..
జర్మనీలోని మ్యాన్‌హీమ్ ప్యాలెస్ దీ రాజభవనాల్లో గొప్ప చరిత్రే. ప్రపంచంలోని అతిపెద్ద ప్యాలెస్‌లలో ఒకటైన దీని విస్తీర్ణం దాదాపు 6 లక్షస 45 వేల 835 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్యాలెస్ ను నిజంగా బరోక్ శైలిలో హైలీ డ్రామాటిక్ అర్కిటెక్చర్ తో కూడిన ఓ కళాఖండంగా చెప్పొచ్చు.
యాంటిలియా…
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన మన ముఖేష్ అంబానీ విల్లా ఇది. విలాసవంతమైన ఈ ఇంటికి యాంటిలియా అని పేరు పెట్టారు. దీన్ని ముంబైలోని ఓ కాస్ట్రీ ఏరియా అల్టామౌంట్ రోడ్డులో 27 అంతస్తుల్లో ఆకాశహర్మ్యంగా తీర్చిదిద్దారు. 4 లక్షల0 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన నివాస గృహం ఇది.
బిల్ట్‌మోర్ ఎస్టేట్…
యునైటెడ్ స్టేట్స్‌లోని బిల్ట్‌మోర్ ఎస్టేట్ వాండర్‌బిల్ట్ కుటుంబానికి చెందినది. నార్త్ కరోలినాలోని ఆష్విల్లెలో ఉన్న ఈ భవనం 1 లక్షా 78 వేల 926 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. రెండో జార్జ్ వాషింగ్టన్ వాండర్‌బిల్ట్ దీన్ని నిర్మించారు. ఇది ప్రస్తుతం ఓక ప్రైవేట్ యజమాని చేతుల్లో ఉంది.
సఫ్రా మాన్షన్…
బ్రెజిల్‌లోని సఫ్రా ఫ్యామిలీ మాన్షన్ దాదాపు 1 లక్షా 17 వేల చదరపు అడుగుల వైశాల్యాన్ని ఆక్రమించింది. ఇది సావో పాలోలోని అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటి. ఇది బ్రెజిల్‌లోని అత్యంత ధనిక కుటుంబాలకు చెందినవారిది.
ఫెయిర్ ఫీల్డ్..
ఇరా రెన్నెర్ట్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్‌లోని ఫెయిర్ ఫీల్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ప్యాలెస్ 1 లక్షా 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది న్యూయార్క్ రాష్ట్రంలోని సాగపోనాక్‌లో ఉంది. ఈ ఖరీదైన ఆస్తి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది అమెరికాలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఒకటి, థియేటర్లు. క్రీడా సౌకర్యాలు, స్వమ్మింగ్ పూల్స్ తో విలాసాలకు కేరాఫ్ లా కనిపిస్తుంది.



