జీవితాన్ని ఓ రంగుల రాట్నంగా చూపించి.. అదే జీవితం ఓ కలర్ ఫుల్ నథింగ్ నెస్ అనీ చెప్పే Barry Lyndon!

-S (swaroop thotada).. ✍🏼

జీవితపు కఠిన వాస్తవాల నుండి విముక్తి ఉండదు. కొంత ఎడతెరిపి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సౌకర్యం, విలాసం, హోదా, హై సొసైటీ దర్పం వంటివి నిజ జీవితపు వాసన మన ముక్కు పుటల వరకూ రాకుండా చాలా వరకూ ఆపగలుగుతుతాయి. చెమట వాసన లేకుండా ఖరీదైన, సొగసైన వస్తువులు మన చుట్టూ పరుచుకుని ఉంటే, జస్ట్ కొన్నాళ్ళు నిజ జీవితపు నిస్తేజం మన కళ్ళ ముందు నుండి దూరం జరిగితే, ఈ చుట్టూ ఉన్న కృత్రిమత్వమే ప్రపంచం అనే భ్రమలో పడిపోతాం. ఐతే ఈ pseudo-world లో ఈ భ్రమను “maintain” చెయ్యడం చాలా ముఖ్యం. రాజు గారికి ప్రణామములు అని మంత్రి గారు అంటే మంత్రి గారికి నమస్కారం అని రాజు అనాలి. ఆ ఖరీదైన బట్టల వెనక మామూలు మనిషి చర్మం ఉందన్న సంగతి ఇద్దరూ సాధ్యమైనంత మర్చిపోడానికి ఈ ప్రోటోకాల్ ని ఇద్దరూ పాటించాలి. ఆ నియమాల్ని పాటించని వాళ్ళని ఈ మొత్తం సిస్టం చాలా త్వరగా బయటకు నెట్టేయగలగాలి. అందుకే ఈ pseudo-reality ని కాపాడటానికి ఆ ప్రపంచంలో బ్రతికే అందరూ నిరంతరం తపిస్తూనే ఉంటారు.

Barry Lyndon లో ఈ కృత్రిమ ప్రపంచం 18వ శతాబ్దపు యూరోపియన్ అరిస్టాక్రాట్ ల చుట్టూ కనబడుతుంది. వీరి జీవితం మొత్తం ఒక షో: ఫార్మాలిటీస్ లో మునిగిపోయి, తెచ్చిపెట్టుకున్న హోదాలు, కల్పించుకున్న కోడ్స్ అఫ్ కండక్ట్, ప్లాస్టిక్ నవ్వులు, విందులు, విలాసాలు. ఈ సిస్టం బయట పుట్టి ఈ లోపలికి చొచ్చుకురావాలని ఆశ పడే Redmond Barry (Ryan O’Neal) కి ఏదీ అంత సులువుగా దొరకదు. కానీ అవసరమైన ప్రతీ చోటా మనస్సాక్షిని అమ్మేసుకునే గుణం ఉండటం అతనికి బాగా కలిసొస్తుంది. ఎలాంటి పర్సనల్ ఇంటెగ్రిటీ లేకపోతే ప్రతీదీ అవకాశమే. అలా పేదరికాన్ని వదిలించుకుని పైకి ఎగబాకుతాడు Barry. చట్టం నుండి పారిపోతూ గత్యంతరం లేక ఇంగ్లీష్ ఆర్మీలో చేరతాడు. ఇంగ్లీష్ ఆర్మీ నుంచి పారిపోతూ అబద్దాలాడి దొరికిపోయి ప్రషియన్ ఆర్మీలో చేరతాడు. అక్కడ కొన్ని స్నేహాల్ని వాడుకొని, వాళ్లను మోసం చేసి ఫ్రాన్స్ చేరతాడు. జూదం ఆడి, నాటకాలు ఆడి కాలం గడుపుతూ ఉండగా ఒక డబ్బున్న అమ్మాయి మీద అతని కళ్ళు పడతాయి.

Countess Lyndon ని పెళ్లాడాలి అంటే ముందుగా ఆమె భర్తను తప్పించాలి. వీళ్లిద్దరి వ్యవహారం చూడలేక పాపం అతనే గుండె ఆగి చనిపోతాడు. Barry ఇప్పుడు aristocratic సొసైటీ లో ఒక సభ్యుడు. ఐతే అతని స్వభావరీత్యా దేన్నైనా సాధించగలుగుతాడు కానీ దేన్నీ నిలబెట్టుకోలేడు. తను చాలా కష్టపడి దూరిన సిస్టం, అతని గతంలో పేద నేపధ్యం రీత్యా అతన్ని రహస్యంగా ఎప్పుడూ బయటివాడి గానే లెక్క వేసిన ఆ ప్రపంచం, అతని బలహీనత బయట పడగానే ఎంత చాకచక్యంగా అతన్ని విసర్జించిందో, తిరిగి అతను మొదలైన చోటికే ఎలా నెట్టివేయబడ్డాడో మనం చూడచ్చు. ఇది rags to riches స్టోరీ కాదు. పైపైన చూసే వాళ్లకు మోరాలిటీ టేల్ లా కనిపిస్తుంది కానీ ఇది Kubrick సినిమా అని గుర్తుంచుకుంటే దీని ఆయువు పట్టు కోసం ఇంకాస్త లోతుగా వెళతాం.

ఈ uneventful కథని ఎంచుకొని Kubrick ఏం చెప్పదలచుకున్నాడు? Kubrick ఏం కథ చెప్పాడు అన్నదానికన్నా ముఖ్యమైన ప్రశ్న అతను కథని ఎలా చెప్పాడని. కధలో జరగబోయేవి అన్నీ voiceover లో ముందే రివీల్ చేసేసి, కధలో జరిగే పెద్ద పెద్ద డ్రామాటిక్ ఈవెంట్స్ అన్నిటినీ ఆఫ్ స్క్రీన్ లో దాటేసి ఈ దర్శకుడు ఏం చేస్తున్నాడు? చాలా మంది దర్శకులు కథని తమ worldview ని పరిచయం చేసే వెహికల్ గా ఎంచుకుంటుంటారు. దర్శకుడి worldview తెలుసుకోవడం ప్రేక్షకుడికి ఎప్పుడూ ఆసక్తే. Kubrick లాంటి వాళ్లు మాత్రం కధ ద్వారా కాకుండా తమ worldview ని ఆ కథ texture లో ఇమిడ్చి మనకిస్తారు. పాత్రల కు జరిగే పర్యవసానాలకి దర్శకుడి స్పందన అతని అంతరంగాన్ని మనకి పట్టిస్తుంది. Barry జీవితానికి Kubrick స్పందన శూన్యం. ఆ పాత్ర జీవితం తల్లకిందులు అయిపోయే సన్నివేశాల్ని కూడా ఎలాంటి emotional acknowledgement లేకుండా document చేస్తూ కనబడతాడు Kubrick. అతనికి ఈ aristocratic సంపదలో అంతు లేని emptiness కనబడుతుంది. ఈ సినిమా ని ఎక్కడ పాజ్ చేసినా wallpaper పెట్టుకోడానికి పనికొచ్చే ఇమేజ్ వస్తుంది. అంతగ ప్రతీ ఫ్రేమ్ నీ ఓ పెయింటింగ్ లా తీర్చిదిద్దాడు. ఐతే ఈ అందం, ఈ symmetry అంతా జీవం లేని ఉత్త సోకు. ఇదే Kubrick సెటైర్ అనిపిస్తుంది.

దాదాపు షాట్స్ అన్నీ స్టాటిక్ గానే ఉండి స్లో గా జూమ్ అవుతుంటాయి. ఈ స్టైల్ అఫ్ ఫ్రేమింగ్ లో ఇక్కడ జరిగే ఘట్టాలు, ఆ పాత్రల హావభావాలు, అన్నీ సిట్యుయేషన్స్ లా కాకుండా పెర్ఫార్మన్సెస్ లానే ఉంటాయి. ఎందుకంటే Barry is just going through the motions of life, doing what he supposes he is supposed to do. Barry లాంటి వాళ్ళను ఆ సమాజం ఎంత వరకూ ఎలా అనుమతిస్తుందో అంత వరకూ అతను వెళ్ళాడు. అంతకంటే ఇంకేం జరగలేదు. చాలా వరకూ ప్రపంచంలో ఇంతకంటే ఏం జరగదు. Right place, right time లో ఉన్న కారణంగా కాలం తన ప్రవాహంలో ఎంతో మందిని తనతో పాటు తీసుకెళ్లిపోవచ్చు. జీవితంలో ఎత్తు పల్లాలు అన్నీ Barry ఇలాగే passive గా చూస్తాడు. “He is a man to whom things happen” అంటాడు Ebert తన రివ్యూ లో. Barry చేసే అనైతికమైన పనులను కూడా సమర్ధిస్తున్నట్టు ఓ satirical టోన్ లో narration ఇవ్వబడుతుంది. Detachment తో చూస్తే ఈవిల్ కూడా ఒక జోకే. ఐతే Kubrick సెన్స్ అఫ్ హ్యూమర్ లో ఇది ప్రత్యేకమైన డార్క్ హ్యూమర్ కాదు. అతని bleak worldview లక్షణం మాత్రమే. అందుకే ఈ unremarkable character కి జరిగే absurd consequences ని అచ్చం అప్పటి కాలానికి సరిపడే authenticity తో అందంగా తెరకెక్కించాడు. పూర్తి natural light ని ఉపయోగించుకున్న cinematography ఒక dreamy ఫీల్ ని కలిగి ఉంటుంది.

ఈ దర్శకుడు ఎప్పుడూ దేవుడి సింహాసనం మీద కూర్చొని మానవాళిని ఆసక్తిగా గమనించే detatched genius గానే ప్రవర్తిస్తాడు. అతనికి ఈ కధలో ఎత్తు పల్లాల పట్ల భావొద్వేగ స్పందన ఉండదు. ఇవన్నీ మనుషుల ప్రవర్తనల్ని పట్టి ఇచ్చే నమూనాలు మాత్రమే. విశ్వానికి మన జీవితాల మీద ఉండే indifference ని ఈయన ఎప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటాడు. కధకు ఏ భావోద్వేగ స్పందనా ఇవ్వని దర్శకుడు ప్రేక్షకుల్ని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి అనుమతించడు. “ఈ అందమైన absurdity ని చూడండి భలే తమాషా గా ఉంది” అని tounge-in-cheek వ్యాఖ్యానం చెయ్యడమే అతని పని. ఎందుకని? Barry కి ఉన్న ambition అతన్ని ప్రపంచం మొత్తం తిప్పుతుంది. అతను సాధిస్తాడు, కోల్పోతాడు, ఏం సాధించాడో ఏం కోల్పోయాడో సరైన లెక్క తెలీకుండానే కధలో కనుమరుగు అవుతాడు. ఇదే మానవ జీవితం. మన వేల్యూ సిస్టమ్స్ ప్రకారం మనకేం కావాలో ఎంచుకుని పరుగులు పెడతాం. అందులో ఉండే జయాపజయాలు ఎలాగూ ఉంటాయి. దానికి తోడు ఆ సిస్టమ్స్ నిర్మితమైన పునాదులే డొల్ల అయినప్పుడు అది మొత్తం ఏదో ఒక సమయంలో కుప్ప కూలిపోవచ్చు. అన్ని సిస్టమ్స్ కీ వెలుపల ఉంటే వీటికి అతీతంగా ఉండచ్చు అనుకోవచ్చు, చాలా తత్వాలు కూడా అదే చెబుతాయి. కానీ అది కుదిరే పనా? తన survival తప్ప వేరే ఏ value system నీ పట్టించుకోని Barry లాంటి వాళ్లు కూడా చివరికి చివరి వరకూ నెగ్గుకురాలేకపోయారు. ఆడినా ఆడకపోయినా ఎలాగోలా గెలిచి ఓడిపోయే ఆటే జీవితం.

అలాంటప్పుడు ఇదంతా ఒక painful inevitability. Human ambition ఒక చక్రంలా అక్కడక్కడే తిప్పి మనల్ని ఎక్కడికీ తీసుకెళ్ళని రంగుల రాట్నం. ఆ సందడిలో ఇన్ని రంగులున్నప్పుడు, మన free will ని వెక్కిరించేలా ఇన్ని ఇరుకు వ్యవస్థలు మన జీవితాన్ని మన పుట్టుకలకు, పరిస్థితులకు కుదించేస్తున్నప్పుడు, ఇలాంటి కథని ఆ అందమైన రంగుల్లోనే చూపించి జీవితమంటే ఓ colorful nothingness అని చెప్పడం మినహా ఏం మిగిలింది దేవుడి కుర్చీలో కూర్చున్న genius artist లకి?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles