పురస్కారాల తీరుపై.. ప్రముఖుల విచారం!

PRABHAKAR JAINI… ✍🏼

#Ullozhukku (#ఉల్లోజుహుక్కు) (అర్థం: Under Current: అంతరంగ సంక్షోభం(?) ) మలయాళ

సినిమా మొత్తం

కురుస్తున్న వర్షం

మన కన్నీళ్ళతో

తడిసి మద్దయిపోవాల్సిందే!

ఈ సినిమా ప్రైమ్ లో ఉంది.

ఈ సినిమాలో నటించినందుకే నటి #ఊర్వశి కి, ఈ మధ్య జాతీయ ఫిల్మ్ అవార్డులలో #జాతీయ_ఉత్తమ_సహాయ_నటి అవార్డు వచ్చింది.

ఈ అవార్డు వచ్చిన తర్వాత ఊర్వశి, జాతీయ సినిమా అవార్డుల జ్యూరీలను అనేక వేదికల మీద చీల్చి చెండాడింది. కేరళ మీడియా, పత్రికలు ఆమె వాదనను, వేదనను బాగా పాపులర్ చేసాయి. #సహాయనటి కి నిర్వచనం చెప్పమని నిలదీసింది. #జవాన్ సినిమాలో నటించినందుకు షారూఖ్ ఖాన్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చినందుకు నిలదీసింది. #ఆడు_జీవితంలో సుకుమార్ కు జాతీయ అవార్డు ఇవ్వనందుకు ఉగ్ర రూపం దాల్చింది. #ఆడుజీవితం లో సుకుమార్ నటన, సబ్జెక్ట్ కృత్రిమంగా ఉందన్న జ్యూరీ ఛైర్మన్. #ఆశిష్_విద్యార్థి పైన నిప్పులు చెరిగింది.

ఆమె పోరాటాన్ని నేను అభినందిస్తున్నాను.

మన తెలుగు మీడియా, పత్రికలకు విమర్శించే, విశ్లేషించే ధైర్యం లేనందుకు సిగ్గుపడుతున్నాను.

బూతు సినిమాలకు జాతీయ అవార్డులా? సీజీతో సినిమాలకు అవార్డులా? మూఢ నమ్మకాల సినిమాలకు అవార్డులా? వందలాది మందిని నరికి రక్త ప్రవాహాలు పారించే సినిమాలకు అవార్డులా? అని ప్రశ్నించే గమ్మున, ధైర్యం లేని చేవచచ్చిన మీడియా ఉన్నంత కాలం, ‘#ప్రజాకవి_కాళోజీ‘కి గానీ, మరే మంచి సినిమాకి గానీ, చిన్న సినిమాకి గానీ అవార్డులు రావా? అని ప్రశ్నించ వలసిన పత్రికా మీడియా రంగం, స్వకుచ నలిగిపోయే పడిపోయి వికృతానందం పొందుతుంది.

జాతీయ అవార్డులు ప్రకటించే నెల రోజుల ముందు నుండి జరిగిన చీకటి వ్యవహారాలపై, జ్యూరీలందరి ఫోను సంభాషణలపై, వీళ్ళు రాత్రిళ్ళువగడిపిన హోటళ్ళ వ్యవహారం పై, ఏయే ఫామ్ హౌజు పార్టీలకు అటెండయ్యారో లేదో తెలుసుకోవడానికి, సీబీఐ తో, ఒక ఎంక్వైరీ జరిపించాలి.

పోయిన సారి ఉత్తమ నటుడిగా ఎంపికయిన సినిమా దర్శకుడి కూతురికే ఈ సారి ఉత్తమ బాలనటి అవార్డు రావడంలోని మర్మమేమిటి?

గద్దర్ అవార్డుల్లో మొత్తం అవార్డులు కొట్టేసిన మూడు సినిమాలకే మళ్ళీ జాతీయ అవార్డులు రావడం లోని మర్మమేమిటి? గద్దర్ అవార్డులు ప్రకటించేంత వరకు ఆగి నేషనల్ అవార్డులు ఎందుకు ప్రకటించారు?

జాతీయ అవార్డులకు జ్యూరీ గా ప్రతీ సారి ఒక్కడే వెళ్ళడమేమిటి? ఆ జ్యూరీ మెంబరే గద్దర్ అవార్డుల కమిటీలో కూడా ఉండడం కాకతాళీయమా? కాలుక్యులేటెడా? ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి అతన్నే అన్ని కమిటీల్లో జ్యూరీ మెంబరుగా వేస్తున్నారు. అతనికి ఉన్న అర్హతేమిటి?

ఈ ప్రశ్నలన్నీ పత్రికలు, మీడియా ఎందుకు అడగడం లేదు? మతలబు ఏమిటి?

ఈ పోస్టు రాసినందుకు జీవితంలో నాకు మళ్ళీ ఏ అవార్డు రాకపోవచ్చు. ఇట్లాంటి పైరవీలకు, కుల కంపులో తడిచిన అవార్డులు రాకున్నా ఫర్వాలేదు.

గద్దర్ అవార్డులంటే లోకల్ నిర్మాతల ప్రభావం ఉంటుందనుకోవచ్చు. కానీ, జాతీయ అవార్డుల్లో కూడానా?

ఘనత వహించిన, నిజాయితీకి మారు పేరు అయిన బీజేపీ ప్రభుత్వంలో ఇంత అన్యాయమా? లేక కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటిస్తున్నారా? రాష్ట్రంలో, దేశంలో సినిమా, సాంస్కృతిక శాఖల ప్రక్షాళన అవసరమనిపించడం లేదూ?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles