Maruthi Powrohitham… ✍🏼
“Sees Kaddi” అనే ఈ కన్నడ సినిమాకు రతన్ గంగాధర్ దర్శకత్వం వహించారు. ఇది ఆయన దర్శకత్వంలో మొదటి చిత్రం. ఈ సినిమా ఒక రచయిత యొక్క అంతర్గత సంఘర్షణలను అన్వేషించే, భావోద్వేగాన్ని కలిగించే కథ.
సినిమా కథ మొత్తం ఒక రచయిత (సితిన్ అప్పయ్య) , అతని అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ (బి.ఎస్. రామమూర్తి) మధ్య సంభాషణల చుట్టూ తిరుగుతుంది.

రచయిత తనను తాను విక్రమాదిత్యుడిగా, సెక్యూరిటీ గార్డ్‌ను బేతాళుడిగా ఊహించుకుంటాడు. విక్రమ-బేతాళ కథల నుండి ప్రేరణ పొంది ఈ సినిమాలో నాలుగు విభిన్న కథలను చక్కని నైపుణ్యంతో ఒక కథగా అల్లి విజయం సాధించారు.
ఈ కథలు రచయిత యొక్క అంతర్గత సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. ఈ నాలుగు కథలు వాస్తవం, ఊహాజనిత కథల మధ్య గీతను చెరిపేస్తాయి.
మొదటి కథలో రవీషా అనే బాలుడు నగరానికి వలస వెళ్ళడానికి వ్యతిరేకిస్తాడు. తన గ్రామ జీవనం అంటే వాడికెంతో ఇష్టం. రెండవ కథలో పేరు లేని బాలిక సంగీతం ద్వారా గుర్తింపును పొందుతుంది . ఒక బధిర-మూగ తబలా కళాకారిణి నుండి ఆ అమ్మాయి ప్రేరణ పొందుతుంది. మూడవదైన ఫరీద్ కథలో ఒక రచయిత, టీ స్టాల్ వద్ద ఒక యువతి నుండి ప్రేరణ పొందుతాడు. ఆమె తన అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకుంటూ జీవితాన్ని గడుపుతా ఉంటుంది. నాల్గవదైన తౌఫీక్ కథలో తౌఫీక్ ఒక సినిమా ప్రేమికుడు. అతను సినిమాలను అంచనా వేయడంలో గొప్ప పరిశీలనా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. తౌఫిక్ సినిమాలను చూస్తున్న దృష్టి కోణం ఒక దర్శకుడి దృక్పథాన్ని మారుస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనసుకు హాయిగా ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ లో కన్నడలో ఇంగ్లీష్ sub titles తో ఉంది. వీలైతే చుడండి. ఒక మంచి సినిమాను చుసిన భావన కలుగుతుంది.



