శభాష్ గిల్!

మెరకల్లాంటి ఆటగాళ్లు భారత్ సొంతం. గెలుపోటములేవైనా… ఏ ఫార్మాట్ లోనైనా తమ సత్తా చాటుతున్న ఉత్తుంగ తరంగాల్లాంటి యువకిషోరాలతో ఇండియా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ జట్లన్నింటినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో సునీల్ గవాస్కర్ మాత్రమే చేసిన అత్యధిక స్కోరును బ్రేక్ చేసి… భారత కెప్టెన్ గిల్ కొత్త రికార్డును సాధించిన ఇండియన్ క్రికెటర్ గా ఘనతకెక్కాడు.

గవాస్కర్ రికార్డును బద్ధలుకొట్టిన గిల్!

2002లో రాహూల్ ద్రవిడ్ ఇదే ఇంగ్లాండ్ పై 217 పరులుగు చేశాడు. కానీ, గవాస్కర్ రికార్డైన 221 పరుగులను మాత్రం అధిగమించలేకపోయాడు. సునీల్ గవాస్కర్ 1979లో లండన్ లోని ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా… ఇంగ్లాండ్ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ గా నిల్చాడు. ఆ తర్వాత 46 ఏళ్ల నుంచి ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఆ రికార్డును చెరిపేయలేకపోయారు. కానీ, గిల్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. అలాగే, ద్రవిడ్ కొట్టిన 217 పరుగుల రికార్డును ఛేదించేందుకు కూడా మన భారత క్రికెటర్స్ కు 23 ఏళ్ల సమయం పట్టింది. సో, రెండింటినీ సంయుక్తంగా బద్ధలు కొట్టి గిల్ వార్తల్లో పతాకశీర్షికయ్యాడు.

గవాస్కర్ తర్వాత మనమోసారి పరిశీలిస్తే.. సచిన్ టెండూల్కర్, రాహూల్ ద్రవిడ్, వీరేంద్రసెహ్వాగ్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఎందరో కనిపిస్తారు. కానీ, వారెవ్వరూ సాధించని ఫీట్ ఇంగ్లాండ్ లో ఇండియన్ ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టి.. 269 పరుగులతో నూతన అధ్యాయం సృష్టించి ఓ మరుపురాని మ్యాచ్ ను కళ్లముందు ఉంచాడు.

లీడ్స్ లో 147 రన్స్ చేసిన శుభమన్ గిల్.. ఇప్పుడు తర్వాతి టెస్టులోనే డబుల్ సెంచరీ మార్కును దాటి 269 రన్స్ తో కెప్టెన్ గా టీం గెలుపుకు తానెంత బాధ్యుడో.. వ్యక్తిగతంగా బ్యాటింగ్ బాధ్యతనూ అంతే సమర్థవంతంగా నిర్వహిస్తుండటం ఆకర్షించే విషయం. అసలు భారత్ ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ గెలవని వేదిక ఎడ్ బాస్టన్. ఈసారి మరి గిల్ పరుగుల వేటతోనైనా ఆ కల సాకారమైతుందో చూడాల్సి ఉంది.

గిల్ గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టిన వెంటనే కెమెరా కామెంటరీ బాక్సులోని వ్యక్తివైపు తిప్పుకుంది. ఆ వ్యక్తి ఉత్సాహంగానే కనిపించాడు. ఆన్ ఎయిర్ లో వ్యాఖ్యాత తన రికార్డును గిల్ అధిగమించాడని చెప్పుతున్నప్పుడు ఆ వ్యక్తి ముఖంలో ఒక నవ్వు కనిపించింది. ఆయనే సునీల్ గవాస్కర్. అయితే, పైకి నవ్వుతున్నట్టు కనిపించినా.. ఇంత కాలం అంటే 4 దశాబ్దాలకుపైగా చెక్కుచెదరకుండా ఉన్న తన రికార్డును గిల్ బద్ధలు కొట్టడం సునీల్ గవాస్కర్ లోనూ ఒకింత ఈర్ష్య పుట్టించి ఉండొచ్చు బహుశా!

శుభమాన్ గిల్ కాస్తా.. శభాష్ గిల్ గా!

శుభమాన్ గిల్ ప్రదర్శన ప్రశంసలందుకుంది. శుభమాన్ ను కాస్తా శభాష్ అనే వేనోళ్ల పొగడ్తలకు ఎడ్ బాస్టన్ వేదికైంది. బర్మింగ్ హామ్ లో రెండోరోజు ఇంగ్లాండ్ తో జరిగిన ఇన్నింగ్స్ లో గిల్ పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చాడు. 310 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో.. రవీంద్ర జడేజాతో కలిసి గిల్ బ్యాటింగ్ కు అనుకూలించిన ఎడ్ బాస్టన్ లో బంతిని బాది విడిచిపెట్టాడు. జడేజాతో కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీకి చేరువలోకొచ్చి జడేజా 89 పైన ఔట్ కాగా.. వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. మొత్తంగా ఇంగ్లాండ్ లో ఇప్పటివరకూ ఏ ఆసియన్ కెప్టెన్ సాధించని ఘనతను.. డబుల్ సెంచరీ చేసి మొట్టమొదటి ఆసియా కెప్టెన్ గా కూడా గిల్ మరో రికార్డ్ సాధించాడు.

2016లో నార్త్ సౌండ్ లో వెస్ట్ ఇండీస్ పై విరాట్ కోహ్లీ 200 పరుగులు చేసిన తర్వాత.. విదేశీ టెస్టులో ఆ ఘనత సాధించిన రెండో భారత కెప్టెన్ గా కూడా గిల్ పేరు రికార్డుల్లోకెక్కింది. ముఖ్యంగా SENA..సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్ గా కూడా గిల్ ది మరో రికార్డ్. 2011లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో శ్రీలంక ఆటగాడు తిలక్ రత్నే దిల్షాన్ చేసిన 193 పరుగులను అధిగమించి.. పలు రికార్డులను తిరగరాశాడు గిల్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles