Ganesh Thota.. ✍️
అంబిక 14 సంవత్సరాల వయసులో తమిళనాడులో ఒక కానిస్టేబుల్ ను వివాహం చేసుకుంది. ఈమె కూడా బాల్య వివాహానికి బలైన వ్యక్తే కానీ.. ఏనాడు వ్యవస్థ మీద అసహ్యం పెంచుకోలే. ఆమెకు 18 సంవత్సరాలు నిండే సరికి ఇద్దరు ఆడపిల్లల తల్లి.
అంబిక భర్త పోలీస్ IG మరియు DIG పరేడ్ కోసమని ఒక రోజు పొద్దున్నే లేచి వెల్లిపోయాడు. ఆమెకి IG మరియు DIG లకు అధికార లాంచనాలు ఎలావుంటాయో తెలుసుకోవాలని ఆశ కలిగింది. భర్త ఇంటికి తిరిగొచ్చాక వాళ్ళ గురించి అడిగితే.. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు.. రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్లోనే బాసుల స్థాయి అని చెప్పేసరికి.. తాను కూడా ఆ పదవిలో ఉంటే బాగుండు అని ఆశపడ్డది.

అంబిక చిన్నప్పుడే పెళ్ళి చేసుకుంది కాబట్టి SSLC కూడా పాస్ కాలేదు. కానీ ఆ పదవిని ఎంత కష్టం అయినా సాదించాలనుకుంది. ఆ విషయం తన భర్తకి చెప్పింది. భర్త కూడ సరే నేను సహకరిస్తాను.. కానీ, ముందు నువు SSLC పాస్ కా అన్నాడు.
కష్టపడి నిద్రహారాలు మాని అటు పిల్లలకు, ఇటు భర్తకు ఓవైపు సేవ చేస్తూనే.. SSLC, PUC, డిగ్రీ పాసైంది. భర్తని బ్రతిమిలాడి ఒప్పిచ్చి చెన్నైలో IPS కోచింగ్ తీసుకోవడానికి ఒప్పించింది. ఒప్పుకున్న భర్త ఏర్పాట్లు చేశాడు. భర్త అన్ని వేళలా తాను ఏది కావాలన్న సమకూర్చేవాడు. అలా భర్త సహకారంతో కష్టపడి కోచింగ్ పూర్తిచేసింది.
3 సార్లు పరీక్ష రాసినాకానీ పాస్ కాలేదు. భర్త కూడా బలవంతంగా ఇంటికి వచ్చేయ్ అన్నాడు. కానీ అంబిక ఇంకా ఒక్క ప్రయత్నం చేస్తాను.. అప్పుడు కూడా రాకపోతే వచేస్తానన్నది. దానికి అతను సరే అన్నాడు. ఒకవేళ పాస్ కాకపొతే కనీసం టీచర్ ఉద్యోగమైనా చేయొచ్చనుకున్నది.
మళ్ళీ కష్టపడి చదివి పరీక్ష రాసి.. నాలుగోసారికి అన్ని టెస్టులు ఒకటేసారి పాస్ అయ్యింది. 2008లో పాస్ అయ్యాక.. ఆమెను గవర్నమెంట్ ఐపీఎస్ ట్రైనింగ్ కు పంపింది. ఇప్పుడామె ముంబై నార్త్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్నారు.
అంబికను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఆమె వవ్యస్థను కానీ, బాల్య వివాహం చేసినందుకు తల్లి తండ్రులనుగానీ.. బాధ్యులను చేయలేదు. ఒకటి సాధించాలన్న కచ్చితమైన గురి, మొక్కవోని సంకల్పంతో.. భర్త సాయంతో ముందుకు పోయి డీసీపీ అయ్యింది.



