వాస్తవికతగా చలామణి అయిన ఓ కాల్పినికత! ఎడతెగని చర్చకు తెరలేపిన రోనాల్డ్ ఓపస్ డెత్ మిస్టరీ!!

సుబ్రహ్మణ్యం వల్లూరి..✍️

కల్పనలను వాస్తవికతలుగా మార్చేసి చలామణి చేస్తే.. ఎంత కన్ఫ్యూజన్ నెలకొంటుందో చెప్పేందుకు రోనాల్డ్ ఓపస్ కథ ఓ ఉదాహరణ! నాన్ ఫిక్షన్ స్టోరీగా చలామణి అయిన రోనాల్డ్ ఓపస్ స్టోరీ.. ఆ తర్వాత ఫిక్షన్ అనేది నిరూపితమైంది. అయితే, అది ఫిక్షనా, నాన్ ఫిక్షనా అన్నది కాస్సేపు పక్కనబెడితే… ఆ మర్డర్ మిస్టరీ మాత్రం అసలెవరూ ఊహించడానికి కూడా ఆలోచన రాని… క్రైమ్ మూవీస్ ని తలదన్నే ఓ ఆసక్తికర నేరకథ!

1994 మార్చ్ 23వ తారీఖు నాడు రోనాల్డ్ ఓపస్ శవాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ డాక్టర్ రోనాల్డ్ ఓపస్ ఒక షాట్ గన్ నుంచి కాల్చబడ్డ బులెట్ గాయం వల్ల చనిపోయాడు అని అభిప్రాయపడ్డారు.

రోనాల్డ్ ఓపస్ పదో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకుందామని కిందకు దూకాడు. అతను ఆత్మహత్య చేసుకునే ముందర రాసిన ఉత్తరాన్ని బట్టి పోలీసులు.. అతను జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడనుకున్నారు.

అతను కిందకు దూకిన తరువాత, తొమ్మిదో అంతస్తులోంచి వచ్చిన షాట్ గన్ బులెట్ అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఆ బులెట్ వల్ల అతను వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.

ఆ బులెట్ కాల్చినతడికి కానీ… చనిపోయిన రోనాల్డ్ ఓపస్ కు కానీ తెలియని విషయం ఏమిటంటే , ఎనిమిదో అంతస్తు కింద భాగంలో ఒక సేఫ్టీ నెట్ కట్టబడి ఉంది. కారణం.. ఎనిమిదో అంతస్తులో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల భద్రత కోసం! బులెట్ కనుక తగలక పోయివుంటే రోనాల్డ్ ఓపస్ ఆ నెట్ మీద పడి బతికి బట్ట కట్టేవాడు. అతని ఆత్మహత్య ప్రయత్నం విఫలమైవుండేది. ఆ నెట్ వల్ల అతని వ్యూహం బెడిసికొట్టేది. కానీ, రోనాల్డ్ ఓపస్ చనిపోయాడు.

శవపరీక్ష చేసిన డాక్టర్ మిల్స్ ఏమంటాడంటే.. “సాధారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుందామని ప్రయత్నించి.. అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా చనిపోయినా అట్టి చావుని ఆత్మహత్య కింద పరిగణించాలని! (ఈ కేసులో కిందకు దూకి చావాలిసిన రోనాల్డ్ ఓపస్.. బులెట్ తగిలి చనిపోయాడు)

రోనల్డ్ ఓపస్ కిందకు దూకి నేల మీద పైడినట్టైతే చచ్చిపోయేవాడు కచ్చితంగా! కానీ సేఫ్టీ నెట్ అక్కడ అప్పటికే కట్టి ఉండటం వల్ల.. నేల మీద పడే అవకాశాల్లేనందువల్ల బ్రతికి బట్ట కట్టేవాడు. బులెట్ వల్ల చనిపోబట్టి ఇప్పుడు హత్య కింద పరిగణనలోకి తీసుకోవాలన్నారు డాక్టర్ మిల్స్. దాంతో రోనాల్డ్ ఓపస్ ఆత్మహత్య కేసు కాస్తా.. రిపోర్టులోకి హత్య కేసు కింద నమోదైంది.

తొమ్మిదో అంతస్తు ఏ గదిలో నుంచి బులెట్ వచ్చిందో ఆ గదిలో ఒక పెద్ద వయసులో ఉన్న భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు ఆ సమయంలో! భర్త భార్యని షాట్ గన్ తో బెదిరిస్తున్నాడు.. కాలుస్తానని!

భర్త ఎంతో చిరాకుకు గురై షాట్ గన్ పేల్చినప్పుడు బులెట్ భార్యను పూర్తిగా తప్పించుకుని కిటికీలోంచి బయటకు వెళ్లి కింద పడుతున్న రోనాల్డ్ ఓపస్ కు తగలడం అతను చనిపోవడం జరిగింది.

A అనే వ్యక్తి B అనే వ్యక్తిని చంపుదామనే ఉద్దేశంతో కాలిస్తే… అందులో బుల్లెట్ Bకి తగిలి B చనిపోతే.. A నేరస్థుడవుతాడు.

తొమ్మిదో అంతస్తులో ఉన్న భర్తను పోలీసులు ప్రశ్నిస్తే అతను తన షాట్ గన్ ఎప్పుడూ కూడా బుల్లెట్లతో నింపనని.. గన్ ఖాళీగా ఉంటుందని వాదించాడు. అతని భార్య కూడా తన భర్త చెప్పేది నిజమని.. భర్త మాటలను సమర్ధించింది.

ఆ ముసలాయన పోలీసులతో అన్నాడు మేమిద్దరం తరుచూ గొడవ పడుతూ ఉంటాము ప్రతిసారీ నా భార్యను లోడ్ చెయ్యని తుపాకీతో బెదిరించడం మాముల., బెదిరించడం వరకే చేస్తాను. నాకు నా భార్యను చంపే ఉద్దేశం ఎప్పుడూ లేదు. అందువల్ల రోనాల్డ్ ఓపస్ చావుని యాదృచ్ఛికంగా పరిగణించాలంటాడు. అంతేకాకుండా గన్లో బులెట్ పెట్టడం కూడా యాక్సిడెంటల్ గా జరిగి ఉండాలని వాదించాడు.

పోలీసుల పరిశోధనలో వారికి ఒక సాక్షి దొరికింది. ఆవిడ అంది నేను ముసలాయన కొడుకు ఈ ఇన్సిడెంట్ (హత్య) జరిగేందుకు అరువారాల ముందు ఆ షాట్ గన్ లో బులెట్ పెట్టడం తాను చుశానంది.

ఇంకా విచారణలో తేలిందేమిటంటే గన్ పేల్చినాయన భార్య, కొడుకుకు ప్రతి నెలా ఇచ్చే మొత్తాన్ని నిలిపివేసింది. కొడుకుకు తల్లితండ్రుల వాదించుకోవడాలు.. గొడవ పడడం.. తండ్రి,తల్లిని ప్రతిసారి గన్ తో కలుస్తానని బెదిరించడం.. గన్ మీట నొక్కడం ఇవన్నీ తెలుసు! ఎప్పుడైతే తల్లి తనకు ప్రతినెలా ఇచ్చే పెద్ద మొత్తాన్ని నిలిపి వేసిందో అతను తండ్రి గన్ తో తల్లిని ఈసారి బెదిరించినప్పుడు బుల్లెట్స్ లేని గన్ కాలుస్తాడని తెలిసి.. ఆ గన్ లో బులెట్ నింపి ఉంచాడు, ఆ రకంగా తల్లి చనిపోతే, తండ్రి జైలుకెళితే తనకు బోల్డు డబ్బులొస్తాయని కొడుకు ఉద్దేశం.

ప్రస్తుతానికి వస్తే కొడుకు ఆ గన్ లో బులెట్ నింపాడు కనుక.. అతనే ఈ రోనాల్డ్ ఓపస్ హత్యకు అసలు కారకుడు. కొడుకు గన్ పేల్చకపోయినా.

ఇక్కడ మొదలవుతుంది అసలైన ట్విస్టు!

పోలీసుల పరిశోధనలో భార్యభర్తల కొడుకు రోనాల్డ్ ఓపస్ అని తేలింది.

అతను తన తల్లిని చంపుదామని చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యేసరికి.. అప్పులు తీర్చే మార్గాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో అంతస్తు నుంచి దూకితే.. తొమ్మిదో అంతస్తు నుంచి పేలిన బులెట్ అతని ప్రాణాల్ని తీసింది.

అంటే ఆ కొడుకైన రోనాల్డ్ ఓపస్ తనని తాను హత్య చేసుకున్నాడు.

చేసేది ఏమిలేక పోలీసులు ఆత్మహత్య అని రాసుకుని కేసుని మూసివేశారు.

ఈ కథను అమెరికా అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రెసిడెంటైన డాన్ హార్పర్ మిల్స్ మొదటిసారి 1987లో ఓ ఈవెంట్ లో తన స్పీచులో ప్రస్తావించాడు. ఇది పూర్తిగా కల్పిత కథ. కానీ ఓ వాస్తవమైన కథగా ఇది ప్రచారంలోకొచ్చింది. కానీ, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీగా మాత్రం ఈ రోనాల్డ్ ఓపస్ క్రైమ్ స్టోరీ ఇప్పటికీ అదే క్యూరియాసిటీని కల్గించేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles