ఎంత బాద్షాగా ఎదిగినా.. మొట్టమొదటి స్క్రీన్ ప్రెజెంటేషన్ ఓ నాస్టాల్జియా!

దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, దిల్ తో పాగల్ హై, పరదేశ్ నుంచి కుచ్ కుచ్ హోతాహై, దేవదాస్ వరకూ లవర్ బాయ్ ఇమేజ్ తో కుర్రకారు మనసు దోచుకుంటే.. బాజీఘర్, డర్ వంటి మరెన్నో సినిమాలతో యాంటీ హీరోగా కూడా తనలోని విలనిజాన్నీ చూపించి వెర్సటైల్ గా నిల్చాడు షారుఖ్. తన సినిమాల జాబితాలో ఏవో అడపాదడపా కొన్ని మినహాయిస్తే అన్నీ బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన హిట్సే. అలాంటి మరపురాని చిత్రాలెన్నో ఉన్నా.. కొన్న మాత్రమే నాస్టాల్జిక్ గా మిగులుతాయి. అదే తనను స్క్రీన్ కు పరిచయం చేసిన ఫౌజీ.

ఫౌజీ 1988లో ఇదో టీవీ షో. అక్కడి నుంచి ప్రారంభమైంది బాలీవుడ్ బాద్షా ప్రయాణం. 1992లో దీవానా సినిమాతో పెద్దతెరపైకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ తర్వాత ఆ రేంజ్ లో ఎదిగిన వ్యక్తి… ఆ స్థాయిలో ఆర్థికంగానూ సంపాదించిన స్టార్ హీరో షారుక్.

ఫౌజీలో షారుక్ పాత్రేంటి..?

ఫౌజీకి సంబంధించిన సెట్స్ లో దిగిన ఓ నాస్టాల్జిక్ ఫోటో ఈ మధ్య తెగ వైరలవుతోంది. దాన్నే షారుక్ ఖానే పంచుకున్నాడు. అదో మధురమైన జ్ఞాపకంగా.. అనుభూతిగా షేర్ చేశాడు. ఫౌజీ సీరియల్ లో షారుక్ ది ఒక యువ ఆర్మీ క్యాడెట్ పాత్ర.

అలాంటి థ్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసి మురిసిపోయిన కింగ్ ఖాన్… తన సహ నటులతో నటనలో తాను రాణించాలన్న తపనతో కనిపిస్తున్నాడు. అప్పుడు తన పక్కన ఫోటో దిగేందుకు కూర్చున్న ఆ నటీనటులెవ్వరూ కూడా కనీసం షారుక్ ఈ స్థాయిలో బాలీవుడ్ బాద్షాగా ఎదుగుతాడని ఊహించి ఉండకపోవచ్చు.

ఫౌజీలో అభిమన్యురాయ్ అనే చలాకీ ఆర్మీ క్యాడెట్ పాత్రలో కనిపించాడు షారుక్. ఫౌజీ సీరియల్ మొత్తం ఆర్మీ కమాండో రెజిమెంట్ల శిక్షణను చూపించే సీరిస్. ఆర్మీ జీవితాల్ని వాస్తవికంగా చూపించినందున ఆ షో మంచి ప్రశంసలందుకుంది. దానికి లెఫ్టినెంట్ కల్నర్ గా పనిచేసిన రాజ్ కుమార్ దర్శకత్వం వహించడంతో.. ఆ గ్రౌండ్ రియాల్టీని ఆ సీరిస్ లో చూపించగల్గారు. మొత్తం 13 ఎపిసోడ్స్ తో రూపొందించిన ఆ సీరియల్.. ప్రతీ ఎపిసోడ్ 24 నిమిషాల నిడివితో ప్రసారమైంది. షారుక్ తో పాటు.. విజయ్ మాథుర్, రాకేష్ శర్మ, మజర్ ఖాన్, విక్రాంత్ కపూర్ వంటి నటీనటులెందరో ఫౌజీలో నటించారు.

అయితే ఇవాళ వెండి తెరపై రారాజుగా కొనసాగుతున్న షారుక్ ఫౌజీతో పాటే.. సర్కస్, దిల్ దారియా, వాగ్లేకి దునియా వంటి పలు టీవీ సీరియల్స్ లో నటించి… బుల్లితెరతో పరిచయమై ఇవాళ వెండితెరను ఏలుతున్నాడు.

ఫౌజీ వంటి ఆర్మీ బేస్డ్ టీవీ సీరియల్ లో ఆర్మీ క్యాడెట్ పాత్రలో నటించిన షారుక్ విషయంలో యాదృచ్ఛికమేంటంటే… అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాకే ఆయన మళ్లీ తొలి నేషనల్ అవార్డ్ ను అందుకోవడం. ఆ సినిమాలో దీపికా పదుకొణే, నయనతార వంటి ప్రధాన తారాగణం నటించింది.

2023లో డంకీ తర్వాత షారుక్ ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కింగ్ తో 2026లో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఆయన తన కూతురు సుహానాను కూడా థియేట్రికల్ డెబ్యూ చేయిస్తున్నాడు. మొత్తంగా బుల్లితెరపై చిన్న నటుడిగా ప్రారంభించి బాలీవుడ్ బాద్షా స్థాయికెదగడమంటే కచ్చితంగా ఓ అద్భుతమైన విజయమే. దాన్ని సాధించి నిల్చిన హీరో షారుక్. HAPPY BIRTH DAY SHAH RUKH… 💐🌹

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles