Sriram. M… ✍🏻
రచయిత Alex Garland కి గతంలో గొప్ప కథలు రాసిన చరిత్ర లేదు. Danny Boyle కి Slumdog Millionaire చిత్రానికిగానూ గతంలో ఆస్కార్ వచ్చినప్పటికీ, అతడు మంచి దర్శకుడు అయినప్పటికీ, అతని నుండి గొప్ప సినిమాలు నేను ఆశించలేను. కారణం ఏమిటంటే అతడు గొప్ప సినిమాలు ఏవీ గతంలో తియ్యలేదు. అందుచేత నేను 28 Years Later (2025) చిత్రాన్ని చూద్దామా వద్దా అని సంశయిస్తూ చివరికి చూసాను. చాలా వరకూ సినిమా చిత్రణ ముతకగా, అతి మామూలుగా సాగినా మంచి కథ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అనూహ్యంగా చివరికి వచ్చే సరికి spritual గా ఎంతో ఉన్నత తలానికి తీసుకు వెళుతుంది. Apocalypse Now(1979) చిత్రంలో Francis Ford Coppola మనల్ని spritual గా తీసుకువెళ్ళిన heights కి Danny Boyle ఈ చిత్రంలో మనల్ని తీసుకు వెలతాడు, Aguirre, the Wrath of God (1972) లాంటి ముతకదనం కొంత ఉన్నప్పటికీ. Aguirre, the Wrath of God (1972) గొప్ప classic గా పేరు పొందినా నేను underrated అయిన Van Diemen’s Land(2009), Valhalla Rising(2009) లాంటి ఆ కోవకు చెందిన చిత్రాలను masterpieces గా గౌరవిస్తాను.

సాదాసీదా zombie apocalypse సినిమాలా ముందుకు సాగినా కథలోకి ralph fiennes వచ్చిన తరువాత classic అయిపోతుంది. Ralph Fiennes గతంలో The Reader(2008) చిత్రంలో Michael Berg అనే
heart-wrenching పాత్ర చేసినప్పటికీ(Michael Berg పాత్ర నన్ను కొన్ని నెలల పాటూ కృంగదీసింది), 28 Years Later
చిత్రంలో అతడు చేసిన Dr.Kelson పాత్ర Ralph Fiennes కెరీర్ లోనే గొప్ప పాత్రగా చరిత్రలో నిలిచి పోతుంది. అయితే సినిమా మొత్తంగా masterpiece లేదా classic అవుతుందా అంటే అవ్వదనే చెప్పాలి. Danny Boyle అతని సామర్థ్యానికి మించి పతాక సన్నివేశాల్ని చిత్రించాడు. సృజనాత్మకంగా master filmmakers మాత్రమే ప్రవేశించగలిగే తలంలోకి చిత్రాన్ని తీసుకెళ్ళాడు. అయితే ఎడిటింగ్ లో అతని అవగాహన లోపాలు బాగా కనిపిస్తాయి. అవి అతన్ని తిరిగి కేవలం మంచి దర్శకుడు అనే జాబితాలోకి పడవేస్తాయి.
Unsettling film. Extreem Violence ఉంటుంది. కొంతమందికి చివరి సన్నివేశాలు చూడడం కష్టమవుతుంది, కళాత్మక తాత్విక దృష్టి లేకపోతే.
Cerebral movies అని పేరు పెట్టుకుని విమర్శకులు కొన్ని అయోగ్యమైన చిత్రాల్ని అతిగా ఆకాశానికి ఎత్తేసినా, spiritual quality లేకుండా ఏ చిత్రమూ classic అవ్వదు. కళ ఏదైనప్పటికీ అది మేధస్సుకు సంబంధించినది కాదని చాలా మంది గ్రహించాలి. కళ హృదయగతమైనది లేదా ఆత్మగతమైనది అయినప్పుడే దానిలో నిజమైన, ప్రబలమైన కళాత్మక శక్తి ఉంటుంది.

2
(spoiler alert)
Dr.Kelson అసంఖ్యాకంగా సంభవించిన మరణాలకు స్మారక చిహ్నంగా మానవ కంకాలాలు, ఎముకలతో కట్టడాలను నిర్మించడానికి కారణాలు ఉన్నాయి.
Rage వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి మరణించిన ప్రతి ఒక్కరినీ – వైరస్ సోకినవారైనా, సోకనివారైనా – స్మరించుకోవడానికి Dr.Kelson ఈ ఎముకల నిర్మాణాలను నిర్మించాడు. వీటిని ఆయన Bone Temple (ఎముకల దేవాలయం) లేదా ossuary (ఎముకల గది) అని పిలుస్తాడు. వాటిని నశించిన గతంలోకి ప్రవేశించడానికి ఒక మార్గంగా చూస్తాడు. ప్రతి పుర్రె కొన్ని ఆలోచనల సమూహాన్ని, తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక జీవితాన్ని సూచిస్తుందని ఆయన నమ్ముతాడు.
ఈ కట్టడాలకు దిగ్భ్రాంతిని, భయోత్పాతాన్ని కలుగజేసే స్వభావం ఉన్నప్పటికీ, Dr.Kelson మరణం యొక్క అనివార్యతను అంగీకరించిన మానవతావాదిగా మనకు కనిపిస్తాడు. విలయానంతర దుర్భర పరిస్థితులలో అప్పటికే చనిపోయిన వారి ఉనికి విస్మృతిలో కలిసిపోకుండా, వారి మృత దేహాలు కనీస ఆనవాలు లేకుండా కాలంలో కలిసిపోకుండా ఆపడానికి, వారికి గౌరవం ఇవ్వడానికి, వారు ఒకప్పుడు జీవించి ఉన్నారని స్మరించుకోవడానికి ఆయన ఈ స్మారకాలను ఒక మార్గంగా చూస్తాడు.
Dr.Kelson బాలుడికి memento mori(మీరు మరణిస్తారని గుర్తుంచుకోండి) అనే భావనను వివరిస్తాడు, జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని నొక్కి చెబుతాడు. ఆయన memento amoris(మీరు ప్రేమించాలని గుర్తుంచుకోండి) అనే భావనను కూడా ప్రోత్సహిస్తాడు.
Bone Temple అతని తాత్విక దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది మరణం యొక్క ఆనివార్యతను ఒక పిడుగుపాటులా బలంగా గుర్తుచేస్తుంది. ఎంతో శ్రద్ధగా, గౌరవంతో నిర్మించిన ఈ నిర్మాణం, జీవించి ఉన్నవారు తమ జీవితాన్ని, ప్రేమను విలువైనదిగా చూడాలని సందేశం ఇస్తుంది.
ముఖ్యంగా, ఎవరైనా మృతులను, వారి అవశేషాలను చూసి భయపడే వారికి Dr.Kelson ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా కనిపిస్తాడు. దిగ్భ్రాంతికి, ఏహ్యతకు గురి చేస్తాడు. అయితే శ్రద్ధగా ఆయన చర్యలను గమనిస్తే ఉద్దేశపూర్వకంగానే ఆ అవశేషాలను సేకరించి, ఎముకలను ఉడికించి, శుభ్రపరిచి, వాటితో Bone Temple నిర్మించాడని అర్థమవుతుంది.
విస్మృతిలో కలిసిపోయిన మృతుల జ్ఞాపకాలను చెదిరిపోనీయకుండా, కాలంతో చెక్కుచెదరకుండా శాశ్వతంగా ఉండేలా కాపాడడం కోసం, దుఃఖమనేది ఒకటి ఉందని మరిచిపోయిన, మొరటుదై మిగిలిన, విలయానంతర ప్రపంచానికి, దుఃఖం యొక్క పవిత్రతను, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అతడు ఈ భయానకమైన నిర్మాణాలను చేశాడని అర్థమవుతుంది.
28 years later(2025)
Availablity:
Netflix: Streaming available.
Prime Video: Available for rent or purchase.
Apple TV: Available for rent or purchase.



