ఆడ అభినయంతో అదరగొట్టిన మళయాళం స్టార్: ట్రెండింగ్ టాపిక్ గా ఆ జ్యువెల్లరీ యాడ్ ఫిలిం!

ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ మరోసారి తానెందుకు ప్రత్యేకమో చర్చకు పెట్టాడు. ఓ జ్యువెల్లరీ ప్రకటనలో ఆయనిచ్చిన హావభావాలకు సంబంధించిన ఆ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది. సింగిల్ డైలాగ్ కూడా లేకుండా.. కేవలం అభినయంతో ఆయన ఓ మహిళలా ఆ జ్యువెల్లరీ ఐటమ్స్ ధరించి చేసిన ప్రదర్శన అది.

మొత్తంగా కళ్లతోనే పలికించిన హావభావాలు, అది కంట పడ్డ వీక్షకుడు యాడ్ మొత్తం చూసేంత అయస్కాంతత్వ ప్రదర్శనతో ఆయనపైన ఇంటర్నెట్ మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాశ్ వర్మ దర్శకత్వం వహించిన 110 సెకన్లు.. అంటే ఒక నిమిషం యాభై సెకన్ల వాణిజ్య ప్రకటనలో మోహన్ లాల్ కాస్త ఆ బంగారు నగలతో పాటే తన నటనతో మెరిశాడు. ఇంతకీ ఆ ప్రకాశ్ వర్మ గుర్తున్నాడా..? తుడరుమ్ సినిమాలో ఇదే మోహన్ లాల్ ను మరిపించేలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసిన నటుడు. తుడరుమ్ తర్వాత ఈ వాణిజ్య ప్రకటనతో ఇద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ ను పంచుకుని.. మరోసారి చర్చనీయాంశమయ్యారు.

మోహన్ లాల్ కారు దిగి వస్తుంటే.. యాడ్ ఫిలిం మేకర్ ప్రకాశ్ వర్మ స్వాగతం చెబుతూ ప్రారంభమవుతుంది ఆ వాణిజ్య ప్రకటన. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ తరహాలో చిత్రీకరించినట్టు మోహన్ లాల్ కు ఓ ల్యాప్ టాప్ లో ఆ చిత్రీకరణను చూపిస్తూ.. మాడల్ శివానీని పరిచయం చేస్తూ కనిపిస్తుంది ఈ యాడ్.

మాడల్ శివానీని అలంకరించిన వజ్రాల నెక్లెస్ తనను ఆకట్టుకోవడంతో… ఆ నెక్లెస్ పై పడుతుంది మోహన్ లాల్ దృష్టి. ఆ తర్వాత ఆ యాడ్ షూట్ కు అవసరమైన ప్రధానమైన ఆ నెక్లెస్సే మాయమవ్వడంతో అందరిలోనూ ఒకింత ఆందోళన కనిపిస్తుంది. అదే విషయాన్ని ఓ అసిస్టెంట్ వచ్చి యాడ్ లో కనిపించే ఆ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాశ్ కు చెబుతుంది. అదే సమయంలో మెయిన్ జ్యువెల్లరీ మిస్ అవ్వడంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామనే ఓ అనౌన్స్ మెంట్ వినిపిస్తుంది. మొత్తంగా ఒక యాడ్ ఫిలిం షూట్ చేస్తున్నప్పుడు గందరగోళం నెలకొంటే.. ఎలాంటి పరిస్థితుందో సదరు వాణిజ్య ప్రకటనలోనే యాడ్ చేసి కొత్త ఫ్లేవర్ యాడ్ చేశాడు ఫిలిం మేకర్ ప్రకాశ్ వర్ం. ఆ ఒకింత గందరగోళ పరిస్థితుల్లో మోహన్ లాల్ కోసం వెతుకుతూ కారవాన్ లోకి వెళ్లేసరికి… ఒక కర్నాటక సంగీతంలో సాగే కీర్తన బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే.. ఆ జ్యువెల్లరీ ధరించి హొయలు పోతున్న మోహన్ లాల్ మనకు కనిపిస్తాడు.

నగలను అమితంగా ఇష్టపడే ఓ స్త్రీ ఏ విధంగానైతే అవి ధరించాక ఫీలవుతుందో ఆ ఫీల్ ను కళ్లకు గట్టేలా తన హావభావాలతో నాట్యకారిణులు వేళ్లు తిప్పుతున్నట్టుగా మోహన్ లాల్ ప్రదర్శన కనిపిస్తింది. అంటే, ఆ నగలు ధరించే మాడల్ శివానీ పాత్రలో తనను ఊహించుకుంటూ.. తానైతే ఎలా చేయగలనోనన్నట్టుగా మోహన్ లాల్ అభినయం కనిపిస్తుంది. కారవాన్ లోకి వచ్చిన యాడ్ ఫిలిం మేకర్ ప్రకాశ్ అది చూసి సడెన్ గా స్టన్ అవుతాడు. ప్రకాశ్ కేసి చూసిన మోహన్ లాల్ ఒక్కసారిగా భళ్లుమని నవ్వుతాడు. ఆ తర్వాత అలా ప్రకాశ్ చూస్తూ ఉండిపోతుండగానే… VINSMERA jewels అనే టైటిల్ తో ఆ యాడ్ ప్రమోషన్ కనిపిస్తుంది.

క్రియేటివ్ గా షూట్ చేసిన ఈ యాడ్ కూడా ఇప్పుడు ఓ సినిమా అంత చర్చగా మారింది. కొందరు విమర్శించేవారూ కనిపించినప్పటికీ.. ఈ వాణిజ్య ప్రకటనపై ప్రశంసలే ఎక్కువ కురుస్తున్నాయి. అభినయంలో మోహన్ లాల్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉంటాయి… తను నిత్యం నటించే పురుషాధిక్య పాత్రల కు భిన్నంగా… ఎలా మెప్పించాడనే అంశంపై చాలామంది నుంచి అభినందలు అందుకుంటున్నారు ఈ మళయాళ సూపర్ స్టార్.

ఈ వాణిజ్య ప్రకటనపై ఓవైపు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా.. మరోవైపు, గోట్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ అడ్వర్టైజ్మెంట్ ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఆ గోట్ సారాంశం. ఈ వాణిజ్య ప్రకటనను దర్శకుడు ప్రకాశ్ వర్మ తన ఇన్ స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేయడంతో పాటు… ఆరుదైన, ప్రత్యేకమైన ఒక సందర్భానికి నేను సాక్షినయ్యే అవకాశాన్ని పొందానంటూనే.. మోహన్ లాల్ ను ఆకాశానికెత్తేశాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles