ఒక భార్య, ఇద్దరు భర్తలు.. వేదికైన హిమాచల్ ప్రదేశ్: ఇదో అభినవ ద్రౌపది కథ!

పంచభర్తృకల పాంచాలీ కథ మనందరికీ తెలిసిందే. బ్రహ్మ హత్యాపాతకాలతో తన సర్వశక్తులూ కోల్పోయిన ఇంద్రుడే.. ఐదురూపాల్లో పాండవులుగా జన్మించాడని.. ద్రుపదుడి కుమార్తె అయిన ద్రౌపది యోగీశ్వరుడైన ఐదు రూపాల్లో ఉన్న ఇంద్రుడికి భార్యగా ఉందని… ఐదుగురు పాండవులూ ఒక్క ఇంద్రుడి రూపంగా మార్కండేయ పురాణం చెప్పే మాట.

అది కాస్తా పక్కనబెడదాం. పురాతన చరిత్ర నుంచి మొదలుకుంటే ఇద్దరు, ముగ్గురు భార్యలున్న భర్తలెందరో కూడా మనకిప్పటికీ కనిపిస్తుంటారు. కొన్ని మతాల్లోనైతే అదో పెద్ద సామాజిక సమస్యే కాదు. అలాగే, భర్తలతో నచ్చనివారు విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకునే స్త్రీలనూ చూస్తున్నాం.

కానీ, ఏకకాలంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్న మహిళ కథ ఇది. అరుదైన బహిరంగ బహు భర్తృత్వ వేడుక కూడానూ!

మనదేశంలో వివిధ మతాలను బట్టి వివిధ రకాల వివాహాచారాలున్నాయి. అవి ప్రాంతాలను బట్టీ మారిపోతుంటాయి. అయితే, అలాంటి ఎన్నో వైవిధ్యమైన వేడుకలకు వేదికైన భారత్ లో… ఓ మహిళ ఇద్దరు అన్నదమ్ములను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న తంతుకు హిమాచల్ ప్రదేశ్ కేంద్రమైంది.

సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ కు చెందిన ప్రదీప్ నేగీ, కపిల్ నేగీ ఇద్దరూ అన్నదమ్ములు. సమీపంలోని కున్హాట్ కు చెందిన సునీతా చౌహాన్ అనే మహిళతో ఈ ఇద్దరు అన్నదమ్ముల వివాహం హట్టి అనే సామాజిక సాంస్కృతిక వారసత్వ పద్ధతిలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పురాతన హట్టి సంప్రదాయం ప్రకారం ఒక మహిళ ఇద్దరినీ వివాహమాడే బహుభర్తృత్వ ఆచారానికి అవకాశముంది. అయితే, చాలాకాలంగా సమాజంలో వస్తున్న మార్పులతో అలాంటి వివాహ వేడుకలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ నేగీ, కపిల్ నేగీ అనే ఇద్దరు సోదరులను సునీత వివాహం చేసుకోవడంతో ఈ వేడుక ఇప్పుడు ఓ ట్రెండిగ్ టాపిక్ గా మారింది.

ఈ వేడుకకు సంబంధించి బలవంతపు పెళ్లిగాగానీ.. పెద్దల ఒత్తిడికానీ.. సామాజిక అడ్డంకులుగానీ.. ఇలా ఏవీ లేకుండా పరస్పర అంగీకారంతో జరగడమే ఈ వివాహ విశేషం.

హట్టి సమాజానికి రోల్ మాడల్ ద్రౌపది!

బహుభర్తృత్వానికి సుముఖత వ్యక్తం చేస్తూ జోడిదరన్.. లేదా, ద్రౌపది పాత్రలా హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి సమాజం ఇద్దరు సోదరులు ఒకే భార్యను కల్గి ఉండటంలో తప్పు లేదు. పైగా చాలాకాలంగా కొనసాగుతున్న ఆచారమిది. ఈ ఆచారం అటు హిమాచల్ ప్రదేశ్ లోని ట్రాన్స్ గిరి ప్రాంతంతో పాటు.. మరోవైపు ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. ఐక్యతను కాపాడుకోవాలనే కోరిక నుంచి మొదలైన ఆచారంగా ఇది ప్రచారం ఉంది. ఏ స్త్రీ కూడా వితంతువుగా మిగిలిపోవద్దనే మరో మోటో కూడా ఈ ఆచారం వెనుక ఉందట. అలాగే, వారసత్వంగా వస్తున్న ఆస్తులు, భూముల విభజన విషయంలోనూ అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా కూడా ఇలాంటి వివాహ వేడుకలు ఐక్యంగా ఉంచుతాయన్నది హట్టి సమాజం నమ్మకం. అయితే, మారుతున్న కాలంలో ఇలాంటి ఆచారాలు పెద్దగా ఈమధ్య కనిపించకపోయినప్పటికీ… తాజాగా జరిగిన సోదురులైన నేగీ బ్రదర్స్, సునీత వివాహ వేడుకతో ఈ ఆచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మరి వధూవరులెమంటున్నారు..?

సునీతను వివాహమాడిన ప్రదీప్ నేగీ పెద్దవాడు కాగా.. అతను జల్ శక్తి విభాగంలో పనిచేస్తుంటారు. కపిల్ విదేశాల్లే ఆతిథ్యరంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. వాస్తవానికి ఊరికి దూరంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఈ ఇద్దరు సోదరులూ కూడా హట్టీ సామాజికవర్గ సంప్రదాయాల ప్రకారం జరిగే వివాహ వేడుకలోని అన్ని కార్యాల్లోనూ పాల్గొని ఆకట్టుకున్నారు.

ఇది పరస్పర నిర్ణయమంటాడు ప్రదీప్. మా సామాజిక చరిత్ర గురించి మేమెప్పుడూ గర్వంగానే ఫీలవుతాం. అందుకే దాన్ని బహిరంగంగానే ఆచరిస్తామంటున్నాడు. ఇక కపిల్ ఏమంటాడంటే… మేం పారదర్శకంగా ఉంటాం.. నేను విదేశాల్లో ఉండొచ్చు.. కానీ, ఈ వివాహంతో మా భార్యకు కుటుంబపరంగా మద్దతు, భద్రత, ఆప్యాయత అన్నీ లభిస్తాయంటున్నాడు. ఈ సంప్రదాయం గురించి తనకు తెలిసే తాను ఒప్పుకున్నానంటోంజి సునీత. నాపైన ఎలాంటి ఒత్తిడీ లేదని.. నా ఇష్టపూర్వకంగానే ప్రదీప్, కపిల్ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నానంటోందామె. మా బంధంపై తనకు అపార నమ్మకముందంటోంది.

మూడు రోజుల వివాహ వేడుక!

ఇప్పుడున్న సామాజిక పద్ధతులు.. పూర్తిగా మారిపోతున్న ధోరణుల్లో… కచ్చితంగా దృష్టిని ఆకర్షించేది, ఒకింత చర్చకు పెట్టేదే హట్టి సామాజికవర్గ ఈ వివాహ వేడుక. అయితే, ఈ వేడుకను మూడురోజుల పాట ఘనంగా నిర్వహించారు. సమీప ప్రాంతాల నుంచి అనేక మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ పరిణయం జరిగింది. పాటలు, నృత్యాలతో పాటు.. వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వాదాలతో ఒక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని పురాతన వేడుకను కలర్ లో చూస్తున్నట్టుగా సాగింది సునీత బహుభర్తృత్వ పెళ్లి వేడుక.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles