అతడంటే ఎంత క్రేజ్..? మట్టిగోడపై ఆ చిన్న ఫోటో చెప్పింది!

Vidyasagar polla…✍🏻

హిడ్మా!
ఈ పేరు పదిహేను సంవత్సరాల క్రితం మొదటి సారి విన్నాను. “పూరీ జగన్నాథ్ సినిమాలో నక్సలైట్ పేరులా భలే ఉందే ఈ పేరు!” . అంటే, నేను ఒక దినపత్రికలో రిపోర్టరుగా అక్షరాల్ని సెంటీమీటర్ల లెక్కన అమ్ముకున్నప్పటి సంగతి ఇది! చతీస్ఘడ్లో ప్రభుత్వం, జనతన సర్కార్, సల్వాజుడుం పొట్టు పొట్టుగా దుమ్ము లేపుతున్న రోజులవి. ఆ టైంలో వేల మంది గొత్తి కోయలు ప్రాణ భయంతో మా భద్రాద్రి జిల్లాకు వలస వచ్చారు. ఇప్పటికీ వాళ్ళు ఆధార్ కార్డులు కూడా లేని కాందిశీకులు!


ఒక రోజు రిపోర్టింగ్ కోసం గొత్తి కోయలు గుంపుకి వెళ్ళాను. ఒక ఇంట్లో మట్టి గోడకు పేపర్లో ప్రింట్ చేసిన చిన్న ఫోటో అతికించి ఉంది. ముఖం సరిగా కనిపించటం లేదు. “ఈ ఫోటో ఎవరిది? అని అడిగాను.”హిడ్మా!” ఇది రెండో సారి అతని పేరు వినటం. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం చెప్పాలి. ఎన్కౌటర్ తర్వాత హిడ్మా మృతదేహాన్ని మారేడిమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి ఛత్తీస్గఢ్ ఫేమస్ న్యూస్ చానల్ బస్తర్ టాకీస్ కూడా వెళ్ళింది. ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే, జరిగిన తీరును కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఆ ఛానల్. అలాంటి ఛానల్ కి కూడా చుక్కలు చూపించింది గ్రహాండ్ . “ఈ తెలుగు పోలీసులున్నారే మహా ముదుర్లు !”అనేశాడు బస్తర్ టాకీస్ హెడ్ వికాస్ తివారి. వెళుతూ వెళుతూ చిన్న వార్త లైవ్ చేశాడు. రోడ్డు మీద నుంచే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన చోటును లాంగ్ షాట్లో చూపించాడు. చిత్రంగా పుష్ప షూటింగ్ జరిగింది కూడా అక్కడికి దగ్గరలోనే! ఇదే విషయాన్ని కవర్ చేస్తూ బస్టర్ టాకీస్ ఓ సెటైర్ పేల్చింది!
“హిడ్మా అంటే ఫ్లవర్ అనుకుంటిరా?! ఫైర్.. రెవిల్యూషనరీ బ్రాండ్!

సల్వాజుడుం రద్దు తర్వాత ఒక సారి బస్టర్ చూడ్డానికి వెళ్ళాను.నారాయణపూర్ లాడ్జిలో మకాం. అది అక్కడి కాంగ్రెస్ పెద్ద తలకాయది. రిజిస్టర్లో వివరాలు రాసుకున్న
క్రమంలో నేను తెలంగాణా అని ఆ కాంగ్రెస్ తలకాయకి అర్థమైంది. ఉలిక్కి పడ్డాడు. ఎందుకైనా మంచిదని రిపోర్టరుగా పరిచయం చేసుకున్నాను. అతను నవ్వి “మీ తెలంగాణా వాళ్ళు మహా డేంజర్ గాళ్ళు! ప్రశాంతంగా ఉన్న బస్తర్నీ విప్లవం పేరుతో అగ్నిగుండం చేశారు “అన్నాడు. కౌంటర్ గోడకి ఓ ఫోటో వేలాడుతోంది. ఆమనిషి ఫోటో పేపర్లో చూసినట్టే ఉంది, పేరు గుర్తు రావటం లేదు. ఫోటో ఎవరిదని అడిగాను.!”మహేంద్ర ఖర్మ!”ఆ పేరు చెపుతున్నపుడు ఆ పెద్దమనిషి ముఖం భయం, విషాదంతో నిండి పోయింది. దీనంతటికి కారణం ఆ “హిడ్మా! ” మూడో సారి అతని పేరు విన్నాను.అందరికీ సెంట్రల్ పాయింట్గా మారిపోయాడు.

ఇవాళ హిడ్మా లేడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అతని ఫోటోలే! ఆయన బతికున్నప్పుడు ఎక్కడా ఒక్క ఫోటో కూడా కనిపించేది కాదు… పోలీసు ప్రకటనల్లో తప్ప! ఎందుకింత క్రేజ్ అతనంటే?! పీపుల్స్ వార్ పార్టీ

పరిధిని దాటి ఒకే ఒక్కడుగా ఎలా ఎదిగాడు? “ఎదగలేదు,
ఎదిగినట్టుగా అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక” హైప్” సృష్టించాయి అంటాడు మనీష్ కుంజం. ఈ హైప్ వల్ల ఏంటి ప్రయోజనం? హిడ్మాను విశ్వరూపీకరించటం ద్వారా మొత్తం బస్టర్ ఆదివాసుల్ని నక్సలైట్లుగా చిత్రించి
ఇతను రెండు సార్లు సిపిఐ నుండి శాసన సభ్యుడిగా గెలిచాడు . ఆ తర్వాత సొంతంగా బస్తర్ పేరుతో స్వంత పార్టీ పెట్టుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles