బాలశిక్షకు తోబుట్టువు! తొల్తేకాశి నుంచి పెద్దపూషం ఎల్లి వరకు.. ఏదైనా ఆ జంతిరే జవాబుదారీ!!

విద్యనేర్పిన విదుషీమణి!
~~~~~

#nostalgia

Sampathkumar Reddy Matta.. ✍️

ఎన్నిరకాల జంతిర్లు వచ్చినా
వన్నెతగ్గని విద్వాంసురాలు తను.
ఎన్ని క్యాలండర్లు ఎందరు ఇచ్చినాసరే
దీన్నిమాత్రం నేను విధిగా తెచ్చుకుంటాను.
రోజుకు ఒక్కసారయినా చూడందే తోచదని
ఇంటిలో కంటికెదురుగా ప్రతిష్టించుకుంటాను.

నాకు అక్షరాలు నేర్పిన బాలశిక్షకు ఈమె తోబుట్టువు.
పట్నం అంటే హైదరాబాదే అని తెలువని వయసుగదా
సీతారామ బుక్ డిపో, సిద్దంబర్ బజార్ అనే జంటపదాలు
చూపుకు దృశ్యకావ్యాలు. మననానికి నిత్యపారాయణాలు.

తొల్త యాకాశి పండుగు ఎప్పుడు వస్తంది ?
పెద్దపూషం ఎల్లి, అసలేరు ఎన్నడు సొత్తంది ?
సమ్మక్కసారక్క పున్నం ఏవారం అయితంది ?
అందరు అడిగే ప్రశ్నలన్నిటికీ ఈ జంతిరే జవాబుదారీ.
చెన్నూరి సిద్ధాంతి పంచాంగమంటే చిన్నగురిగాదు మరీ.

సంతాన సాఫల్య ప్రకటనలు, రూటు కెనాళ్ల లొల్లి లేదు.
నందిపైపులూ, వక్కపొడులూ, ముగ్గులోకి దించే కతలూ
ఇక్కడ నడువవు. వేమన పద్యం లెక్క అంతా సాదాసీదా
అక్కరకొచ్చే ముచ్చట దప్ప అక్షరమన్నా ఎక్కువ ఉండది.

ఒకప్పుడు యాభైపైసలు, ఇప్పడు పదిహేడు రూపాయలు.
ముద్రించిన వెలకు ఖరీదుజూస్తే సగానికి సగం కంటే తక్కువ.
ఎవరేమన్నా, కానినా కానకున్నా, మా దోస్తానాకు ఏమిలోపం ?
తను పదిరూపాయలకు పన్నెండునెళ్లు తొవ్వజూపే దారిదీపం !

                                                  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles