భిన్న కథ.. మంచి స్క్రీన్ ప్లే.. వెరసి ADIOS AMIGO!

ADIOS AMIGO ( Farewel Freind ) : మలయాళ సినిమా

…………………………………………………………………

చిత్ర పరిచయం: రాంకుమార్ భారతం

మలయాళంలో దర్శకులు కథలను ఎన్నుకొనే పధ్ధతి చూస్తే చాల ఆశ్చర్యమేస్తుంది ! అసలు ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా, వావ్ అనిపిస్తుంది ! అలాంటి కథనే దర్శకుడు నహస్ నాజర్ ఎన్నుకున్నాడు. కథను రాసింది తంకం.

కథగా చెప్పాలంటే ఓ నాలుగైదు వాక్యాల్లో చెప్పొచ్చు ! తల్లి ఆపరేషన్ కోసం డబ్బు అప్పు ఇస్తానన్న ఒక స్నేహితుడి కోసం ప్రియన్ బస్సు స్టాండ్లో వెయిట్ చేస్తుంటాడు. అప్పు ఇస్తానన్న ఆ స్నేహితుడు ఎంత సేపు వెయిట్ చేసినా రాకపోగా , అతనికి వేల కొద్ద్ది డబ్బును ఎంజాయ్ మెంట్ అంటూ దుబారాగా ఖర్చు చేసే ఒక అపరిచితుడు తగుల్తాడు.. గమ్యం లేకుండా ఎంజాయ్ మెంట్ పేరుతొ తిరిగే అతను ప్రియన్ ను బలవంతంగా తనవెంట తీసుకెళ్తాడు. ఇష్టం లేకున్నా ప్రియన్ అతనితో పాటు బయలుదేవుతాడు, మధ్య మధ్యలో తన స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వమని ఫోన్లు చేస్తూ. అతని పరిస్థితి చూసి ఆ అపరిచిత వ్యక్తి తను డబ్బు ఇస్తానంటాడు. కానీ అప్పటికే అతని దగ్గర వున్న డబ్బంతా అయిపోతుంది. ఆ తరువాత ఏమౌవుతుంది ?

ఇలాంటి కథను రెండున్నర గంటల పాటు తెర మీద చెప్పాలంటే చాల పకడ్బందీగా రాసుకున్న స్క్రీన్ ప్లే కావాలి ! అలాంటి స్క్రీన్ ప్లేని అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు నహస్ నాజర్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. మధ్యలో ఒక చిన్న ప్రేమ కథ ! అందులో చిన్న ట్విస్ట్.! ఆ ట్విస్ట్ మన మనసును తాకుతుంది. మన మనస్సు భారంగా క్లైమాక్స్ ముగుస్తుండగా, ఒక చిన్న ట్విస్ట్ డైలాగ్ తో మన మనస్సులు తేలిక పడతాయి. చివరి వరకు వాళ్ళిద్దరికీ ఒకరి పేరు ఒకరికి తెలియకుండానే కథ నడవడం ఒక విశేషం. !

ప్రియన్ గా సూరజ్ వెంజరముడు, అపరిచిత వ్యక్తి ప్రిన్స్ గా అసిఫ్ అలీ అద్భుతంగా నటించారు !

వెరైటీ కథతో, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా కావాలనుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ! ఇతరులు కూడా హాయిగా చూసేయ్యొచ్చు . నెట్ ఫ్లిక్ లో తెలుగు ఆడియో తో స్ట్రీమ్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles