బాలీవుడ్ ప్రముఖులకు నాల్గున్నర దశాబ్దాలుగా ఆయనే ఛార్టెడ్ అకౌంటెంట్!

హోదా దర్పం.. తెరపైన వెలుగు జిలుగులు సరేసరి. కానీ, తారలు, సెలబ్రిటీల జీవితాల్లో వారి పన్నులు, ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసేవారు వారికంటే ఎంత శక్తిమంతులై ఉండాలో తెలుసా..? లేకపోతే, ఏ ఇన్ కమ్ ట్యాక్స్ కట్టలేదనో వార్తల్లోకెక్కుతారు. సినిమాలతోనో, టీవీ షోలతోనో, వ్యాపారాలతోనో రావల్సిన పేరు కాస్తా… డీఫాల్టర్స్ గా మీడియాకెక్కి జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అదిగో అలాంటి బాధల్లేకుండా బాలీవుడ్ తారలకు సుమారు నాల్గు దశాబ్దాలకుపైగా ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న ఒకాయన్ను మనం పరిచయం చేసుకుందాం.

నేరుగా కలుసుకోలేకపోయినా.. ఈ ఆర్టికల్ చదివేస్తే తెలిసిపోయే ఆయన పేరు బిమల్ పరేఖ్. ఈయనో ఛార్టెడ్ అకౌంటెంట్. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ ఇలా ఏ నటీనటులను తీసుకున్నా ప్రస్తుతం బాలీవుడ్ లో వారి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసేదెవరంటే బిమల్ పరేఖ్ పేరే వినిపిస్తుంది.

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న తారల నుంచి అంతకుముందు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన స్టార్స్ వరకూ బిమల్ పరేఖ్ దాదాపు అందరితోనూ పనిచేయడం విశేషం. అంతేకాదు, గల్లీబాయ్, అంధాధూన్, దంగల్, బాజీరావు మస్తానీ వంటి ఎన్నో చిత్రాలకూ ఆర్థిక సలహాదారుగా ఆ చిత్రాలకు సంబంధించిన మనీ మేనేజ్మెంట్ చూసిన వ్యక్తి పరేఖ్.

ఇప్పటికీ ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, జోయా అక్తర్ టైగర్ బేబీ, ఆశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, భన్సాలీ ప్రొడక్షన్స్, రాజ్ అండ్ డీకేకు చెందిన డీ2ఆర్ ఫిల్మ్స్, హన్సల్ మెహతాకు చెందిన కర్మ పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏ సినిమాలు తీసినా.. దానివెనుక కచ్చితంగా బిమల్ ఉండి తీరాల్సిందే.

ఛార్టెడ్ అకౌంటెంట్ బిమల్ బాలీవుడ్ ప్రయాణం!

బిమల్ పరేఖ్ తండ్రి కూడా ఛార్టెడ్ అకౌంటెంట్. తండ్రి బాటలోనే పయనించిన బిమల్.. మీ శక్తి మీరు పనిచేస్తున్న వ్యక్తులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, నాకు నేనే శక్తిమంతుణ్ననుకోవడంలేదంటూ వినమ్రంగా ఓ జర్నలిస్టుతో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పరేఖ్ 80ల కాలంలో తన కెరీర్ ప్రారంభంలో జీనత్ అమన్, బీ.ఆర్. చోప్రా, నాసిర్ హుస్సేన్ కుటుంబీకులకు మాత్రమే పరిమితమై మొదట సీఏగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక నాల్గేళ్ల అనుభవం సంపాదించాక.. ప్రత్యేకంగా తానే ఓ చార్టెడ్ అకౌంటెంట్ కన్సల్టెన్సీ ప్రారంభించాలనుకున్నాడు. తను అలా ప్రారంభించాలనుకుంటున్నప్పుడు జీనత్ అమన్, అప్పుడప్పుడే బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న అమీర్ ఖాన్ తనకు మద్దతుగా నిల్చి క్లయింట్లుగా చేరి ప్రోత్సహించారని చెబుతాడు బిమల్.

ఆ తర్వాత అమీర్ ఖాన్ జూహీచావ్లాకు పరేఖ్ ను పరిచయం చేశాడు. కాలక్రమేణా బిమల్ పేరు మార్మోగి మరింత మంది బాలీవుడ్ స్టార్స్ ఆయన క్లయింట్స్ గా తన సేవలను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దిల్ చాహ్తా హై సినిమాకు కూడా మొత్తం ఆర్థిక వ్యవహారాలు చూసిందీ పరేఖే. అమితాబ్ బచ్చన్, రాణీముఖర్జీ కలిసి నటించిన, 2005లో విడుదలైన బ్లాక్ సినిమా కోసం భన్సాలీ కోసం పనిచేశాడు. రెడ్ చిల్లీస్ పేరిట నిర్మాణ సంస్థ ఏర్పాటు కాకమునుపే డ్రీమ్స్ అన్ లిమిటెడ్ పేరుతో షారుక్ ఖాన్ ఏర్పాటు చేసిన నిర్మాణసంస్థకూ బిమల్ పరేఖ్ సీఏగా సేవలిందించడంతో ఇక ఆయన పేరు బాలీవుడ్ లో ఐకానిక్ ఫిగర్ గా మార్మోగిపోయింది.

రిషీకపూర్ తో బిమల్ కు ఉన్న కామన్ ఫ్రెండ్ షిప్ తో ఆ తర్వాత తనకు రణబీర్ కపూర్ తోనూ, కత్రినా కైఫ్ తోనూ స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగానే కాకుండా.. తన యాజమాన్యంలోని ఫుట్ బాల్ జట్టుకు సహ యజమానిగా కూడా బిమల్ వ్యవహరించాడు. ఫుట్ బాల్ జట్టుకు ఆటగాళ్ల వేలం పాటల నుంచి ఇతర ఆర్థిక కార్యకలాపాలన్నింటా బిమల్ లేందే ముందడుగు పడదు. ఫుట్ బాల్ జట్టు కొనుగోలులో రిషీకపూర్ దే ప్రధానపాత్ర అని.. అలాగే, తను ఆ టీమ్ ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటున్నందుకు సహ యజమానిగా కూడా తనకు బాధ్యతలప్పగించిందీ ఆయనేనని గుర్తు చేసుకుంటారు బిమల్.

చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో పనిచేసిన బిమల్ పరేఖ్.. కత్రినాకైఫ్ అందరికంటే చురుకైనదంటాడు. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ వంటివాళ్లు ఫైనాన్షియల్ ఎఫైర్స్ కాస్తా అటూఇటుగా మారినా పెద్దగా బాధపడరని.. కత్రినా మాత్రం కఠినంగా ఉంటుందంటాడు. అలాగే, రితేష్ సిధ్వానీ, కృష్ణ డీ.కే వంటివారు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో తెలివిగా వ్యవహరిస్తారని చెబుతుంటారు బిమల్ పరేఖ్.

మొత్తంగా ఒక ఛార్టెడ్ అకౌంటెంట్ అంతమంది బాలీవుడ్ తారల ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేస్తున్న తీరుతో.. తానూ ఇప్పుడు ఓ సెలబ్రిటీగా అవతరించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles