ఢిల్లీ అంటే.. మన దేశ రాజధాని.. సెంట్రల్ విస్టా పార్లమెంట్ భవనం.. ఎర్రకోట.. కుతుబ్ మినార్.. రాష్ట్రపతి భవన్.. టెన్ జనపథ్ రోడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే… మర్చిపోకుండా వచ్చే పేర్లల్లో మరొకటి కన్నాట్ ప్లేస్. మరి కన్నాట్ ప్లేస్ ఎవరిది.. అందులో ఉండే హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటివాటి అద్దె ఎంత ఉంటుంది.. అసలా ఐకానిక్ ప్లేస్ వెనుకున్న విశేషాలేంటి.. జస్ట్ ఓసారి తెలుసుకుందాం రండి.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్.. జస్ట్ సీపీ అని కూడా పిలుస్తుంటారు ఢిల్లీ ప్రజలు. కేవలం భౌగోళికంగా మాత్రమే ఇది ఢిల్లీకి ఐకానిక్ ప్లేస్ కాదు.. సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా కూడా ఇదో సెంటర్. బ్రిటీష్ పాలనలో 1929లోనే దీని నిర్మాణం ప్రారంభం కాగా.. స్థానికులతో పాటు.. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే పర్యాటకులనూ ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.
అయితే, కన్నాట్ ప్లేస్ నిర్మాణశైలి వెనుకున్నదెవరు..?
బ్రిటీష్ ఆర్కెటెక్ట్ అయిన రాబర్ట్ టోర్ రస్సెల్.. నికోలస్ అనే మరో ఆర్కిటెక్ట్ సహకారంతో ఈ సాంస్కృతిక, వాణిజ్య కేంద్రాన్ని అపురూపమైన పద్ధతిలో డిజైన్ చేశారు. ఇంగ్లాండ్ లోని రాయల్ క్రీసెంట్ హోటల్… రోమ్ లోని రోమన్ కొలోసియం యాంఫీథియేటర్ మాడల్స్ ను దృష్టిలో పెట్టుకుని.. ఆ విధంగా వృత్తాకారంగా ఈ కన్నాట్ ప్లేస్ ను నిర్మించారు.
అసలేంటి కన్నాట్ ప్లేస్ చరిత్ర..?
టాప్ టూ బాటమ్… అంటే చిన్న వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ కన్నాట్ ప్లేస్ ఓ వేదిక. అందుకే ఢిల్లీని సందర్శించేవారు ఇక్కడి హోటల్స్ లో భోజనానికి, టిఫిన్స్ కు వెళ్లడం నుంచి షాపింగ్ వరకూ కచ్చితంగా కన్నాట్ ప్లేస్ ను సందర్శిస్తూనే ఉంటారు. ఈ ప్లేస్ ను విజిట్ చేయకుండా వస్తే కచ్చితంగా ఢిల్లీ టూర్ కూడా పూర్తి కానట్టే లెక్క అన్నంతగా ఈ కల్చరల్ ట్రేడింగ్ సెంటర్ పేరు సంపాదించుకుంది. ఇక అంతర్జాతీయ సందర్శకులైతే.. దీన్ని చూసి మురిసిపోతుంటారు.
అసలు కన్నాట్ ప్లేస్ ఎవరిది..?
కన్నాట్ ప్లేస్ ఎవరిదీ అనేది ఇంకా మిస్టరీనే. ప్రస్తుతానికిది భారత ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తోంది. ఇది ఎవరి నుంచి ఎవరికి సంక్రమించింది.. ఎలా ప్రభుత్వ పరమైందనేది కూడా ఓ చిక్కుముడిలానే మిస్టరీగా మిగిలిపోయింది.
కన్నాట్ ప్లేస్ దుకాణాల అద్దె ఎంత..?
స్వాతంత్ర్యానికి ముందు.. ఈ ప్రాంతంలోని ఆస్తులు కేవలం నామమాత్రపు ధరలకే లీజుకిచ్చారు. అయితే, నాటి అద్దె పద్ధతులే నేటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి. ఓల్డ్ ఢిల్లీ రెంటల్ కంట్రోల్ యాక్ట్ ప్రకారమే.. ఇప్పటికీ ఇక్కడ అద్దెలు చెల్లిస్తూనే… ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వ్యాపార, వాణిజ్యదారులు మాత్రం మంచి ఆదాయాలను సంపాదిస్తుండటంతో.. ఆర్థికంగా అద్దె విషయంలో వెసులుబాటు కల్పిస్తూ.. తమను లక్ష్మీపుత్రులుగా మారుస్తున్న ఢిల్లీ కన్నాట్ ప్లేస్ తో వీరందరికీ ఓ అవినాభావ సంబంధమేర్పడింది. ఇక్కడ స్టార్ బక్స్, పిజ్జాహట్ నుంచి మొదలుకుంటే.. వాణిజ్య బ్యాంకుల వరకూ అన్నీ దర్శనమిస్తాయి.
ప్రపంచంలోనే గొప్ప వాణిజ్య కేంద్రాల్లో ఒక్కటిగా.. ఢిల్లీ నగరానికే ప్రధానాకర్షణగా… ఇప్పుడు ఈ కన్నాట్ ప్లేస్ అనే ఓ చూడచక్కని సాంస్కృతి కేంద్రం.. దాని నిర్మాణశైలిని మించి వాణిజ్యపరంగా టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిపోవడం విశేషం.



