ఖాలెద్ పాట…” దీద్ దీ “
రోచిష్మాన్.. ✍🏼
9444012279
ఖాలెద్ (KHALED) అల్‌జీరీఆ దేశ గాయకుడు. 1990 దశాబ్దిలో యూరప్ దేశాలతో పాటు మనదేశాన్నీ తన గానంతో ఊపేసిన గాయకుడు.

ఖాలెద్ విశ్వవిఖ్యాతమైన అరబీ గాయకుడు. అరబీ జానపద సంగీతం ‘రై’ (Rai music). ఆ రై సంగీతాన్ని విశ్వవిఖ్యాతం చేశారు ఖాలెద్.
అరబీ సంగీతం విశేషమైంది. ప్రపంచంలో అరబీ సంగీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. మనదేశ సినిమా పాటపై అరబీ సంగీతం ప్రముఖంగా ఉంది. ముఖ్యంగా శంకర్-జైకిషన్, సీ. రామ్ చంద్ర వంటి సంగీత దర్శకులు అరబీ సంగీతాన్ని ప్రభావవంతంగా ప్రయోగించారు. శంకర్-జైకిషన్ అరబీ సంగీతం ప్రభావంతో గొప్ప పాటలు చేశారు.
తబలా వాద్యం అరబీ వాద్యమే అన్న పరిశీలనలో ఉన్నాయి.
మెహ్‌దీహసన్, గులామ్ అలీ వంటి గజల్ గాయకులు అరబీ ధోరణిలో గజళ్లు పాడారు. ‘పంజాబీ హీర్’ అన్న గాన ధోరణిపై అరబీ సంగీతం పోకడ ప్రస్ఫుటంగా ఉంటుంది. హీర్ విధానాన్ని తెలుగులోకి పీ.బీ. శ్రీనివాస్ పరిచయం చేశారు. పీ.బీ. శ్రీనివాస్ తన ఉర్దూ గజళ్ల గానంలో అరబీ ఛాయల్ని పొదివారు.
‘నాత్’ గానంలో, ‘కవ్వాలీ’ గానంలో అరబీ సంగీతం తొణికిసలాడుతుంది.
అరబీ సంగీత గాయకుడిగానూ, రై సంగీత గాయకుడిగానూ ఖాలెద్ గొప్పవారు. మంచి గాత్రం ఆయనది. Baritone, rounded even voice, warm voice వీటితో ఖాలెద్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.
ఖాలెద్ పాటల్లో “దీద్ దీ…” పాట యూరప్ దేశాల్నీ, మన దేశాన్నీ ఒక ఊపు ఊపేసింది వినండి.



