దిశ–సుశాంత్ కథలోకి రియా ఎలా వచ్చింది..?

ఒక దిశ, ఒక సుశాంత్… మధ్యలో రియా!

దిశా సాలియన్ కేసు హైకోర్ట్ ఆదేశాలతో, సీబీఐ ఎంక్వైరీతో, మళ్లీ తెరపైకి రావడంతో… ఇప్పుడు రకరకాల కోణాల్లో 2020లో జరిగిన ఈ సంచనల కేసు గురించి చర్చలు జరుగుతున్నాయి.

దిశ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మధ్య సంబంధమేంటి..? దిశ కేసుకూ.. సుశాంత్ సింగి రాజ్ పుత్ కేసుకు ఎందుకు లింక్ పడింది..? వీరిద్దరి కథనాల నడుమ రియా చక్రవర్తి పేరు ఎలా వచ్చి చేరిందన్నదే ఇప్పుడు మళ్లీ ఆసక్తికరం.

2020, జూన్ లో రెండు మరణాలు బాలీవుడ్ ను కుదిపేశాయి. జూన్ 8న దిశా సాలియన్, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఈ ఇద్దరు స్నేహితులు చనిపోయిన మధ్య కాలం కేవలం ఆరు రోజులు.. ఈ వ్యవధి ఒక్కటే ఈ వేర్వేరు ఘటనలను ముడిపెట్టి పలు అనుమానాలకు, ప్రశ్నలకు తెరలేపింది. అయితే, దిశకు, సుశాంత్ కు మధ్యనున్న పరిచయమెంత… బంధమెలాంటింది… వీరిమధ్య రియా చక్రవర్తి ఎలా వచ్చి చేరింది..?

దిశ – సుశాంత్ ఎవరు?

దిశా సాలియన్ ఓ ట్యాలెంటెడ్ మేనేజర్. ఈమె కొంతకాలం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కూడా మేనేజర్ గా పనిచేశారు. ఆమె మరణించే సమయానికి కూడా సుశాంత్ కు మేనేజర్ గా పనిచేస్తోందా అంటే.. భిన్నరకాల వాదనలు వినిపించాయి. ఆమె అప్పటికే మానేసినట్టు కొన్ని కథనాలు చెబితే.. పనిచేసినట్టుగా కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఇద్దరి మధ్యా ఉన్నది మాత్రం ఓ ప్రొఫెషనల్ బంధం. దిశా సాలియన్.. సుశాంత్ వ్యక్తిగత కుటుంబ సభ్యురాలో, లేక సన్నిహిత బంధువో మాత్రం కాదు.

అయితే, దిశ మరణించిన ఆరు రోజులకే సుశాంత్ మరణంతో ఈ ప్రొఫెషనల్ పరిచయం కాస్తా ఒక్కసారిగా కేసు చర్చల్లో కేంద్రంగా మారింది. 2020లో దిశ కుటుంబ సభ్యులే ఈ రెండు మరణాల మధ్య ఏదో కుట్ర ఉందన్న ప్రచారాన్నీ ఖండించారు. దిశ ఫోన్ ను పోలీసులు దర్యాప్తు నిమిత్తం పరిశీలించారనీ.. అందులో కుట్రే లేదనీ వారు అప్పట్లో తెలిపారు.

మధ్యలో రియా ఎక్కడి నుంచి వచ్చింది..?

అసలు కథలో అనుమానాలకు కారణమే ఇక్కడ మొదలైంది. రియా, సుశాంత్ కు సన్నిహితురాలు. సుశాంత్ మరణం తర్వాత రియా పేరు.. సుశాంత్ వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాలు, డ్రగ్స్ కు సంబంధించిన అనేక కోణాల్లో దర్యాప్తు కారణంగా జాతీయ వార్తల్లో నిల్చింది. ఈమెపై 2020లో మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ కూడా కేసు నమోదు చేసింది. ఆ కేసులో రియా అరెస్టై తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు.

దీంతో సోషల్ మీడియాలో ఓ కొత్త కథనం రూపుదిద్దుకుంది. అదే దిశ- సుశాంత్- రియా!

వీరి ముగ్గురు పేర్లు ఒకే కేసులో ఉండటంతో వీరి మధ్య నేరపూరిత బంధముందని నిర్ధారించలేకపోయినా… అనుమానాలు, ఊహాగానాలతో రకరకాల క్రైమ్ అనాలిసిస్ సోషల్ మీడియాలో సర్క్యలేట్ అయింది.

ఈ ముగ్గురి లింక్ పై సీబీ’ఐ’!

ముంబై హైకోర్ట్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రియా చక్రవర్తి పేరు కూడా దర్యాప్తు పరిధిలో ప్రస్తావించింది. దిశ తండ్రి సతీష్ సాలియన్ చేసిన ఆరోపణల్లో భాగంగా దిశకు తెలిసిన కొంత కీలక సమాచారం.. సుశాంత్ కు చేరిందన్న వాదన ఉంది. మరి ఆ వాదన నిజమా..? దానికి ఆధారాలున్నాయా..? అన్నదే ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిన ప్రశ్న!

అయితే, ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును కూడా సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసింది. 2025లో ఆ దర్యాప్తు ముగిసింది. అతడి మరణంలో నేరపూరిత కుట్రకు ఆధారం లేదని సీబీఐ కూడా పేర్కొంది. అందుకే కేసును క్లోజ్ చేస్తున్నట్టూ వెల్లడించింది. అందువల్ల సుశాంత్ కేసు తేల్చిన విషయాలను.. ఇప్పుడు దిశ కేసులో కూడా మళ్లీ పరిశీలించాల్సి రావచ్చు. అయితే, ఈ రెండు మరణాల మధ్య సంబంధముందని మరి ఈసారి దిశ కేసులో సీబీఐ ఎంక్వైరీలో తేలుతుందా అన్నది చూడాలి.

అసలు మిస్టరీ ఇదే!

దిశ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మధ్య ఉన్నది ప్రధానంగా ప్రొఫెషనల్ లింక్. రియా, సుశాంత్ మధ్యనున్న వ్యక్తిగత సంబంధం. ఈ రెండూ వాస్తవ సంబంధాలు కూడా.. 2020లో జరిగిన రెండు మరణాల సమీప కాలవ్యవధి కారణంలో ఒకే కథగా మారి దర్యాప్తునూ కొంచెం సంక్లిష్టంగా మార్చాయి.

ఈ మూడు పేర్ల మధ్య ఉన్న సంబంధాలతో ఈ కేసులో వీరి పాత్రపై అనుమానాలు నెలకొనడం కేవలం యాదృచ్ఛికమా..? లేక, దిశ, సుశాంత్ మరణాల మధ్య ఆధారసహితంగా నిజంగా నిరూపించగల్గే లింక్ ఏదైనా ఉందా..? ఇదే ఇప్పుడు సీబీఐకి మరో సవాల్.

సీబీఐ తిరిగి ఫోన్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పాత దర్యాప్తు రికార్డులు, కొత్తగా లభించే సాక్ష్యాలు ఇవన్నీ పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే పాత రికార్డులు, ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సాక్షుల విచారణను ఇప్పటికే సీబీఐ మొదలుపెట్టింది. మరి ఆరు రోజుల వ్యవధిలో సంచలనం రేపిన రెండు మరణాల గుట్టు సీబీఐ విప్పుతుందా..? ఇంత మిస్టరీగా మారిన ఈ కేసుపై జరిగిన చర్చంతా యాదృచ్ఛిక జరిగినట్టే మళ్లీ తేలుతుందా..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles