ఫెయిర్ అండ్ లవ్లీ క్రికెట్!

సిద్ధార్థి సుభాస్ చంద్రబోస్.. ✍🏻

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు దక్కేది మనవాళ్లు గొప్ప అందగత్తెలనీ, గొప్ప తెలివిగలవాళ్లని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరోటిలేదు.

అమెరికన్లు, యూరోపియన్లు, బ్రిటిషర్లు, రష్యన్లు, కాకసానియన్లు.. అందగత్తెలు కాదని కాదు అర్థం. అయాదేశాల కంపెనీలు తయారు చేస్తోన్న బిలియన్ డాలర్ల కాస్మొటిక్ ఉత్పత్తులు ఆయా దేశాల్లో వాడడం ఒక స్థాయికి వచ్చేసింది, కొత్తమార్కెట్ కావాలి. ఆమార్కెట్ చాలా పెద్దగా వుండి, సినిమాలనీ, దేవుళ్ల రూపాలని ప్రేమించేదీ, అందం, ఆడంబరం పట్ల క్రేజ్ కలిగిన వర్గం, చదువు, వివేకం, ఆలోచించే తెలివిడి తక్కువ కలిగి పర్సనాలిటీ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవాలనే అమాయక జనం కావాలి. కనీస ఖర్చుచేయగలిగిన తరగతి లాటిన్ అమెరికాలో, మధ్య ఏసియాలో ఈ మార్కెట్ వుంది. గమనించి చూడండి ఈ రెండు ప్రాంతాలో జనం గొప్ప సంపద కలిగివుండరు, పెద్దగా తెలివిడి వుండదు, అటూ ఇటూ కాని శరీర రంగు. ఇదిగో వీళ్లే వాళ్ల టార్గెట్. ఈ వస్తువులు తెలివైన, ప్రత్యేక రంగు కలిగిన చైనా, జపాన్ వంటి తూర్పు ఆసియాకి అమ్మలేరు, ఎంతపూసుకున్నా మార్పులేని, ఒకవేళ మారదామనివున్నా డబ్బులేని ఆఫ్రికాకీ అమ్మలేరు.

అలాగే క్రికెట్. గమనించి చూడండి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఇటువైపు చైనా, జపాన్ క్రికెట్ ఆడవు. దానికి పుట్టినిల్లయిన బ్రిటన్ వెర్రిగా ఏమీ క్రికెట్ వెంటపడదు కాబట్టే ప్రపంచకప్పులు గెలవదు. ఇక ఆడేది ఎవరు? ఫెయిర్ అండ్ లవ్లీ దేశాలే! ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికాకు దగ్గర దీవులైన వెస్టిండీస్!

నిజానికి ఈ దేశాలు క్రికెట్‌ని ఆరాధ్యం చేసేలా వుంటాయి. నిన్న జరిగిన ప్రపంచ కప్ చూడండి, అది ఐసీసీ వరల్డ్ కప్పా, బీసీసీఐ వర్ల్డ్ కప్పా అన్నట్లు వుంది. ఇండియాకు అనుకూలమైన పిచ్‌లు, ఇండియన్లు చూసే సమయాలు, ఇండియన్లకు అనుకూలంగా నిర్ణయాలు.. అవన్నీ ఒక పద్దతిప్రకారం జరిగిపోతూ వుంటాయి. మనం మరింత క్రేజీగా వుంచి కార్పొరేట్ తాననుకున్నది సాధిస్తుంది. అదేం సాధించిందో మనకు కనీసం అర్థంకూడా కాదు.

ఈ ప్రపంచంలో మంచి సంస్కృతి, తిండి, ఆలోచన, ఆటలు వాటి నిజమైన అర్థంలో ఎవరూ ప్రమోట్ చేయరు. ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? చేయరు. తమకెంత లాభమో అదే చేస్తారు. మనమేమో వెర్రి గొర్రెల్లా వాటిని కేంద్రంగా చేసుకుని, మాట్లాడుతూ, వెదుకుతూ, ఆరాధిస్తూ, రాసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ జీవితాల్ని బలిపెట్టుకుంటూ, బలిపెడుతూ చచ్చిపోతాం.

అందాల తారలు, క్రికెట్ ఆటగాళ్లు మాత్రమే ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఏ వస్తువులు, వాహనాలు వాడాలి, ఎలా బ్రతకాలో వాళ్లే నిర్ణయిస్తారు కాబట్టి వారిరువురి మీదనే పెట్టుబడులు, వ్యాపారాలుంటాయని తెలుసుకోకుండానే చచ్చిపోతాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles