గ్యాంగ్ స్టర్ సతీందర్ జీత్ సింగ్ ఎవరు..? ఇతడిని పట్టించినవాళ్లకు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు 50 వేల డాలర్లు ప్రకటించింది..? ఓసారి ఈ గోల్డీ బ్రార్ కథేంటో తెలుసుకుందాం రండి.
తన మోస్ట్ వాంటెడ్స్ జాబితాలో సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పేరును చేరుస్తూ ఇండియన్ కరెన్సీలో సుమారు 43 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటిస్తూ ఎఫ్బీఐ ప్రకటన విడుదల చేసింది.
2023లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా స్టేట్, సర్రే నగరంలో జరిగిన ఖలిస్థానీ వేర్పాటువాద నేతైన హర్జీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో గోల్డీ బ్రార్ తో పాటు.. మరో గ్యాంగ్ స్టర్ అయిన లారెన్స్ బిష్ణోయ్ పైనా అమెరికా న్యాయశాఖ అభియోగాలు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే.. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి గోల్డీ బ్రార్ పేరు చేరింది.

ఇప్పటికే గోల్డీ బ్రార్ పేరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు.. పంజాబ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాల్లోనూ ఉంది. అతడి సమాచాన్నందించినవారికి ఈ రెండు సంస్థలు కూడా విడివిడిగా నగదు బహుమతులు ప్రకటించాయి.
ఎవరీ గోల్డీ బ్రార్..?
ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, పోలీసులతో పాటే… ఎఫ్బీఐ ప్రకటనల ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూపులో గోల్డీ బ్రార్ కీలక పాత్రధారుడు. ఈ ముఠా అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా, కెనడా, ఇతర ప్రాంతాల్లో రాజకీయ, మత నాయకుల హత్యలు, కాల్పులు, కిడ్నాపులు, వసూళ్లు, దాడులు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా వంటి పలు నేరాలకు పాల్పడుతుందనేది ప్రధాన అభియోగం.
అంతేకాదు.. అమెరికాలోనే స్థావరం ఏర్పర్చుుకన్న గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికాలోని నేర ముఠాలకు నాయకత్వం వహిస్తున్నాడని కూడా ఎఫ్బీఐ తన అభియోగపత్రంలో పేర్కొంది. జూలైన 1వ తేదీన కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజెల్స్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా గోల్డీ బ్రార్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రాకెటీరింగ్ కుట్రలతో పాటు.. ఎక్స్టార్షన్ ద్వారా వాణిజ్యానికి ఆటంకం కల్గించే కుట్రలు, మాదక ద్రవ్యాల పంపిణీ వంటి పలు తీవ్రమైన అభియోగాలతో ఈ కేసు నమోదైంది.
కాలిఫోర్నియా సాక్రమెంట్, ఫ్రెస్నో నగరాలతో పాటు.. కెనడా, భారత్, మెక్సికో దేశాలతో కూడా గోల్డీ బ్రార్ కు సంబంధాలున్నట్టు ఎఫ్బీఐ పేర్కొంది. అందుకే, అతడి అరెస్టుకు సహకరించేవారికి 50 వేల యూఎస్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో 43 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది.
సోషల్ మీడియాలో ముఖ్యంగా Xలో చేసిన పోస్టులోనూ ఎఫ్బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో గోల్డీ బ్రార్ ప్రమేయమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సతీందర్ జీత్ సింగ్ ను మోస్ట్ వాంటెడ్ లిస్టుకెక్కిందించి ఎఫ్బీఐ.
ప్రముఖ పంజాబీ గాయకుడైన సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.



