ఒక అనామకుడు ఒక్క రోజులో ఫోర్బ్స్ జాబితాలో ఉన్న బిలియనీర్స్ ను మించిన ధనవంతుడయ్యాడు. ఇంకేం పెద్ద వార్తయ్యాడు. అసలేం జరిగిందో బ్యాంక్ అధికారులే తల పట్టుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాకు చెందిన దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడికి వచ్చిన ఓ టెక్స్ట్ మెస్సేజ్ అతణ్ని అవాక్కయ్యేలా చేసింది. చనిపోయిన తన తల్లి ఖాతాలో తను లెక్కించలేనన్ని సున్నాలతో జమైన ఆ డబ్బు చూసి నివ్వెరపోయిన ఆ కుర్రాడు ఓసారి తనకు తాను గిల్లుకుని.. ఆ మెస్సేజ్ ను తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. ఆ తర్వాత వారికీ అంతుచిక్కకపోవడంతో ఏకంగా తన తల్లి బ్యాంక్ అకౌంట్ ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ కు వెళ్లి.. అక్కడి బ్యాంకర్స్ కు చూపించాడు. దీపక్, తన స్నేహితులెలా ఐతే నివ్వెరపోయారో.. బ్యాంక్ అధికారులూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ మెస్సేజ్ చూసి వారి నోట మాట కూడా రాలేని పరిస్థితెదురైంది.

ఎందుకంటే, దీపక్ తల్లి బ్యాంక్ అకౌంట్ కు వచ్చి జమైన మొత్తం విలువ… 1 కోటి, 13 లక్షల కోట్ల రూపాయలు.. అంటే బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఆస్తి కంటే కూడా 15 వేల రెట్లెక్కువ. షారుక్ ఖాన్ ఆస్తి నికరవిలువ 7 వేల 438 కోట్లు.
ఇంతకీ ఆ మొత్తం ఎంత అంటారా..?
వంద డ్యూడెసిలినయన్లు.. అంకెల్లో, 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 రూపాయలు.. అంటే 1 కోటి 13 లక్షల కోట్ల రూపాయలు.
ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంకులో దీపక్ తల్లి పేరిట ఉన్న అకౌంట్ లో డిపాజిట్ అయిన మొత్తం రహస్యమేంటన్నది తేలాల్సి ఉంది.
దీపక్ గ్రేటర్ నోయిడాలోని డాంకోర్ గ్రామానికి చెందిన వ్యక్తి. తన తల్లి గాయత్రీదేవిని ఈ మధ్యే కోల్పోయాడు. ఆగస్ట్ 3వ తేదీన ఆమె బ్యాంక్ అకౌంట్ లో ఏకంగా 1 కోటి 13 లక్షల కోట్ల రూపాయలు జమైనట్టుగా మెస్సేజ్ చూసిన దీపక్ అవాక్కయ్యాడు. బ్యాంక్ అధికారులకూ ఏమీ అర్థం కాక.. ఆ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసి పెట్టి.. వెంటనే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
దీపక్ బ్యాంక్ అధికారులను కలిసేముందే అసలా డబ్బు ట్రాన్స్ ఫర్ అయితుందా పరిశీలించాడు. కానీ, కాలేదు. తన తల్అలి కౌంట్ ఏమైనా హ్యాక్ అయిందానని అనుమానపడ్డాడు.
అయితే అది ఏదైనా తెలియని అనామకుల నుంచి జరిగిన లావాదేవీ అయినా అయ్యుండాలి.. లేదా, ఏదైనా సాంకేతిక లోపంతో ఏర్పడిన ఎర్రర్ కారణమై ఉండొచ్చని బ్యాంకర్స్ భావిస్తున్నారు. కానీ సరైన కారణమేంటన్నది గుర్తించలేకపోయారు.
దీపక్ కు జరిగన ఈ ఘటనతో అతడి ఫోన్ ఇప్పుడు నిరంతరం మోగుతూనే ఉందట. ఏం జరిగిందనే క్యూరియాసిటీ ఏర్పడటంతో పాటు.. వాట్సప్ గ్రూపుల్లోనూ దీపక్ ఇష్యూ చక్కర్లు కొడుతోంది. ఇక మీడియా నుంచి పెద్దఎత్తున ఫోన్స్ మోగుతూనే ఉన్నాయి. దాంతో ఆ ఫోన్ మోత భరించలేని దీపక్ ఏకంగా ఫోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాడిప్పుడు.
ఇక సోషల్ మీడియా మీమ్స్ కు దీపక్ ఘటన ఓ ఊతమైపోయింది. షారుక్ ఖాన్ నికర ఆస్తుల విలువ ఇప్పుడు దీపక్ కు పాకెట్ మనీ అని ఒకరంటే… ఇంకేం బ్రదర్, అంబానీని దాటిన గ్రేటర్ నోయిడా దీపక్ అని మీరు వార్తల్లోకెక్కాలని మరొకరు.. ఇలా దీపక్ ఇష్యూ ఓ హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే, దీపక్ తల్లి అకౌంట్ లో జరిగిన ఆ లావాదేవీలో పైన మెస్సేజ్ లో ఉన్నట్టు అంత డబ్బు అసలు ఉందా.. ఉంటే, ఆ ట్రాన్జాంక్షన్ ఎలా జరిగింది… బ్యాంకర్స్ భావిస్తున్నట్టు ఏదైనా ఎర్రర్ వల్ల జరిగిన సాంకేతిక లోపమా… అసలు విషయమేంటన్నది ఇంకా తేలాల్సి ఉంది.


