ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ పరస్పర వ్యతిరేక ఆలోచనల వేదిక.. Grizzly Man!

Swaroop Thotada… ✍️

అందరికీ common knowledge లో ఉండే విషయాలకి అవతల ప్రస్తుతానికి unknown లో ఉన్న జ్ఞానాన్ని వెలుగు లోకి తెచ్చే వాళ్ళుంటారు. ప్రపంచానికంటే ముందే వాళ్ళ బుర్రలో వెలిగిన బల్బ్ ఏదో వాళ్లకు దారి చూపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచానికి అది నిరూపించక ముందు వీళ్ళు మిగిలిన ప్రపంచం దృష్టిలో పిచ్చి వాళ్ళలా కనబడినా, ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఆ మొండి కాన్ఫిడెన్స్ అవసరం కూడా. అలాంటి ఒక వెలుగు, perspective, ఒక way of life తనకు ఇవ్వబడిందని నమ్మాడు Timothy Treadwell. ఎవరూ వెళ్ళనంత దగ్గరగా ఎలుగుబంట్ల పక్కనే నడుస్తూ, వాటిని వీడియోలు తీస్తూ, వాటి నివాసం దగ్గర వాటి మధ్యనే జీవిస్తూ, అవి తనని తినేయకుండా ఎలా కాపాడుకోవాలో తనకి మాత్రమే తెలిసిన behaviour ని అతను 13 సంవత్సరాలు అవలంబించాడు. 13 వ సంవత్సరం ఒక ఎలుగు బంటి అతన్ని చంపి తినేసింది. Genius కీ madness కీ ఒక్కోసారి గుర్తుపట్టలేనంత దగ్గరి పోలిక ఉండటం వల్ల ఇలాంటివి అనివార్యం.

మరణానంతరం Treadwell జీవితాన్ని సినిమా చెయ్యాలని Werner Herzog కి అనిపించడం ఏ మాత్రం ఆశ్చర్య పరచని విషయం. డాక్యుమెంటరీలు తీయడంలో Herzog కంటే సిద్ధ హస్తులెవరు? Treadwell తను అడవుల్లో, నేషనల్ పార్కుల్లో క్యాంపింగ్ చేసినప్పుడు దాదాపు 100 గంటల ఫుటేజ్ ని రికార్డు చేసాడు. ఎలుగుబంట్లు చాలా దగ్గర నుంచి చూపిస్తూ తనను తాను కూడా రికార్డు చేసుకున్నాడు. Treadwell పూర్తిగా అమాయకుడేం కాదు. “One hint of weakness, they kill me and eat me” అంటాడు కూడా. అతను రికార్డు చేసిన ఫుటేజ్ మొత్తంలో ఏ జంతువు దగ్గరికి వెళ్లినా వాటితో “I love you” అని చాలా సిన్సియర్ గా అంటూనే ఉంటాడు. వాటిని ప్రేమించడం ద్వారా, మనిషిగా తన పరిధి దాటి వాటి “wildness” లోకి తను transcend అవ్వడం ద్వారా వాటితో సరైన స్నేహం చేసే అర్హత, చాకచక్యం తనకు ఉన్నాయని నమ్ముతాడు Treadwell. ఈ నమ్మకమే అతని కొంప ముంచుతుంది.

డాక్యుమెంటరీ లో అతని గురించి మాట్లాడిన అతని స్నేహితులు కూడా అతను అప్పుడప్పుడూ ఎలుగుబంటిలా ప్రవర్తించే వాడని అంటారు. Humanness పరిధులు దాటి transcend అవ్వాలనే మనుషుల religuous/spiritual thirst కి Treadwell ఎంచుకున్న దారి ఇదని ఇంకో స్నేహితురాలు అంటుంది. Treadwell సొంత మాటల్లో ఐతే అతనికి ఉన్న ఆల్కహాల్ ప్రాబ్లెమ్ కి విరుగుడు ఇలా జంతువుల్ని ప్రేమించడమే. ఐతే అతనికి ఇది ఒక religion అయిపోయిందన్న అతని స్నేహితురాలి మాటలే నిజమనిపిస్తూ ఉంటాయి సినిమా చూస్తున్నంత సేపూ. అతను ఆ జంతువుల పట్ల ప్రేమను దాటి “ఆరాధన” వరకూ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. దీనికి పరాకాష్ట ఒక చోట ఎలుగుబంటి అప్పుడే వదిలిన పేడ మీద చేతులు పెట్టి “ఇది తనలోనుంచి వచ్చింది. తనలో ఉన్న జీవానికి ఇది ఒక చిహ్నం” అని మురిసిపోతాడు. ఆలోచన లేని ప్రకృతి శక్తుల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలానుకోవడం ఒక tricky ambition. దీనికి తత్వం సహాయం ఎంతగానో కావాలి. తీక్షణమైన తత్వం, శాస్త్రీయమైన ఆలోచన సహాయం లేకుండా కేవలం ఫీలింగ్స్ తో ముందుకెళితే జ్ఞానం రాదు. మతం వస్తుంది. మతం దాన్ని sacred గా మారుస్తుంది. Sacredness is a useless abstraction.

Treadwell ఆరాధనకు పాత్రలైన ఆ జంతువులు అతని దృష్టిలో వాటి ఆకలి, animal instincts పరిధుల అవతల ఇతను access చేయగలిగే వేరే dimension ఏదో కలిగి ఉన్నట్టు. This is the problem with religion. The abstractions will invade your understanding of reality and give you a glorified colorful worldview. ప్రపంచాన్ని అర్ధం చేసుకునే తీరులో లోపాలు ఉంటే ఊరకే ఇబ్బందులు మాత్రమే రావు, ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం మనల్ని నమిలి తినేస్తుంది. ఆ ఎలుగుబంట్లకు వాటి base nature మాత్రమే ఉంది. మిగతాదంతా ఒక పిచ్చి వాడు project చేసిన romanticism మాత్రమే.

Treadwell లోని ఫిల్మ్ మేకర్ ని ప్రత్యేకంగా గుర్తిస్తాడు Werner Herzog. ఇదే అత్యంత ఆసక్తికరం. Treadwell ఫుటేజ్ లో cute and friendly గా కనబడతాయి ఎలుగుబంట్లు. Treadwell కి ప్రకృతి మీద ఉన్న అసంబద్ద అవగాహన మీద Herzog కి స్పష్టమైన విమర్శ ఉంది. The best way to criticize a film is to make another film అన్నట్టు Treadwell షూట్ చేసిన అదే ఫుటేజ్ తో Herzog ఒక warning tale ని edit చేసాడు అనిపించింది. ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ కి సంబంధించిన పరస్పర వ్యతిరేక worldviews కి ఒకే సినిమా వేదిక కావడం ఈ చిత్రం ప్రత్యేకత అనవచ్చు.

చిత్రం ముగిసే సమయానికి తన అభిప్రాయం నేరుగా చెప్పేస్తాడు Herzog. ఆ ఎలుగుబంటి కళ్ళలో ఎలాంటి స్నేహం తనకు కనబడలేదు అంటాడు. “I discover no kinship, no understanding, no mercy. Only an overwhelming indifference of nature” అంటాడు ఆ జంతువుల మొద్దు మొహాలు చూపిస్తూ. Wildness అనేది ఒక పదం మాత్రమే. దానితో జాగ్రత్తగా ఉండాలని గ్రహించే వరకూ ఆ పదం ఉపయోగపడుతుంది. దాని మీద understanding కావాలంటే మాత్రం మనకున్న idealistic, romantic notions ని కత్తిరించి వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించగలిగే క్రమశిక్షణ, ధైర్యం అవసరం. అలాగే ఎన్నో పదాలకు మన మెదడులో ఫ్రూటీ ఫ్రూటీ అర్ధాలు ఏర్పరచుకుని ముందుకెళ్ళిపోతామంటే ప్రమాదమే. ప్రపంచం పనితీరు మీద మన worldviews ని నిర్మించుకోవడంలో తీవ్రమైన తప్పిదాలు ఉంటే మన ప్రపంచాలు తరచూ కూలిపోతూనే ఉంటాయి.

సినిమా పేరు Grizzly Man. Amazon Prime లో రెంట్ కట్టి చూడవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles