కుడి చేతి వాటం బ్యాట్స్మన్స్ రాహూల్ ద్రవిడ్ ప్లస్ సచిన్ టెండుల్కర్ ను కలిపి కుడితే.. క్రికెట్ ప్రేమికులను దేశాలకతీతంగా మైదానంలో ఆకట్టుకునే ఓ రొడ్డచేతి బ్యాట్స్మన్ అవతరించాడు. అతను భారతీయుడై న్యూజిలాండ్ తరపున దుమ్ము లేపుతున్న రచిన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవునూ, రచిన్ పేరు పుట్టుకకు.. ఆ క్రికెట్ దిగ్గజాలే కారణం. రచిన్ కన్నా ఎక్కువగా క్రికెట్ ను ప్రేమించింది ఆయన తల్లిదండ్రులు దీప, కృష్ణమూర్తి దంపతులే.. ఇవాళ రచిన్ ను ఓ స్టార్ క్రికెటర్ గా ప్రపంచం కొల్చేందుకు కారణం. ఈరోజు జన్మదినం సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ గర్వపడేలా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న.. మన దేశ మెరుపుతునక రచిన్ కు శుభాకాంక్షలతో పాటు.. ఆయన గురించీ కాస్త చెప్పుకుందాం.
2019లో ఐసీసీ ప్రపంచకప్ ఆసక్తిగా చూస్తున్న రచిన్ కు… 2023 ప్రపంచకప్ లో తొలి అడుగులోనే 82 బాల్స్ లో సెంచరీ సాధిస్తానన్న తన జాతకం ముమ్మాటికీ తెలియదు. ఎందుకంటే, తాను జ్యోతిష్కుడు కాదు.. కానీ, క్రికెట్ పైనున్న అమితమైన క్రేజ్, ఏదో చేయాలన్న పట్టుదల మాత్రం తనను ఆ ఫీట్ సాధించేందుకు పురిగొల్పింది.

గతంలో బెంగళూరు లో కన్నడప్రభ జర్నలిస్ట్ రవిశంకర్ భట్ కు.. రచిన్ తండ్రి రవీంద్ర కృష్ణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పేర్కొన్నారు.
అంతెందుకు ఈమధ్య న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక టెస్ట్ సీరీస్ కోల్పోయి.. స్వదేశంలో భారత్ వైట్ వాష్ అయి విమర్శలెదుర్కోవడానికీ.. అదే వలస వెళ్ళిన మన దేశీయుడు.. న్యూజిలాండ్ అనే పరదేశాన్ని తన బ్యాటింగ్ యుక్తితో 256 పరుగులు చేసి కీలకమయ్యాడు.
రచిత్ తల్లిదండ్రులు దీప, రవీంద్ర కృష్ణమూర్తి ఇద్దరూ బెంగళూరుకు చెందినవారు. 1990ల్లో న్యూజిలాండ్ వెళ్లి.. రాజధాని వెల్లింగ్టన్ లో అక్కడే స్థిరపడ్డారు. రచిన్, అతడి సోదరి ఐసిరి న్యూజిలాండ్‌లోనే పుట్టి పెరిగారు.
రచిన్ అని పేరు పెట్టడం వెనుక కృష్ణమూర్తి చెప్పిన కథేంటంటే… తన భార్య దీపే ప్రధాన కారణమంటారు. ఓరోజు క్రికెట్ ను తనలాగే అమితంగా ప్రేమించే తన భార్య దీప.. కొడుక్కి పేరు పెట్టే విషయంలో రచిన్ అయితే ఎలా ఉంటుందని అని అడిగింది. బాగుంటుంది.. పలకడానికీ బానే ఉందన్నట్టుగా నేను భావించా. అంత లోతుగా కూడా వెళ్లలేదు. కానీ, ఆ తర్వాత తెలిసింది.. రాహూల్ ద్రవిడ్ లోని ర అక్షరాన్ని, సచిన్ టెండుల్కర్ లోని చివరి చిన్ అనే రెండు అక్షరాల్ని కలిపి కుట్టి రచిన్ అనే కొత్త పేరును సృష్టించిందంటారు కృష్ణమూర్తి.
కన్నడ మాట్లాడలేరుగానీ… రచిన్, ఐసిరి బాగా అర్థం చేసుకోగలరు. జస్ట్ 25 ఏళ్ల వయస్సుకే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో రచిన్ టెస్టుల్లో 919 రన్స్ తో, వన్డేల్లో 820 పరుగులతో, బౌలింగ్ లో 50కి పైగా వికెట్లతో… రాహూల్ ద్రవిడ్, సచిన్ పేర్లను కలిపి వాళ్లమ్మ పెట్టుకున్నందుకు ఆ పేరు నిలబెట్టాడు వృత్తిరిత్యా టెకీ అయిన రచిన్. విదేశీ క్రికెట్ పర్యటనలనూ నిర్వహించే వెల్లింగ్టన్ కు చెందిన క్రికెట్ క్లబ్ హట్ హాక్స్ కు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. తండ్రి రవీంద్ర కృష్ణమూర్తికి కూడా కాస్తాకూస్తో క్రికెట్ లో ప్రవేశముండటంతో పాటు, ఇంట్లో టీవీలోనూ క్రికెట్ చూస్తుండటంతో.. ఆ ప్రభావం అమితంగా రచిన్ పై పడింది.

రచిన్ ఎదుగుదలలో నాకేమాత్రం పెద్దగా క్రెడిట్ దక్కాలని నేను భావించడం లేదు. ప్రతీరోజూ ఉదయం ఐదు గంటలకే అతణ్ని లేపి శిక్షణకు సిద్ధం చేయడం నుంచి అతడి బాగోగులు చూసుకునేవరకూ తన తల్లి దీపకే మార్కులంటారు కృష్ణమూర్తి. అలాగే కోచెస్ ఇవాన్ టిస్సెరా, మార్క్ బోర్త్ విక్, పాల్ వైస్ మ్యాన్, బాబ్ కార్టర్, శ్రీరామ్ కృష్ణమూర్తి, గ్లెన్ పాక్ నెల్ వంటివారితో పాటు… వెటరన్ ఇండియన్ టాప్ బౌలర్ జవగల్ శ్రీనాథ్, జే. అరుణ్ కుమర్, శ్రీధరన్ శ్రీరామ్, సయ్యద్ షహబుద్దీన్ వంటివారి సాయమెంతో ఉందని తల్చుకున్నారాయన.
రచిన్ ఎదుగదలలో వీరందరి పాత్రెంతో… దాన్ని అందిపుచ్చుకోవడంలో రచిన్ కూడా ఎప్పటికప్పుడూ అదే కృషి చేసేవాడు. అందుకే తానెప్పుడూ తన వయసుకు మించే ఆడుతూ వచ్చాడు. జస్ట్ 12 ఏళ్లకే 15 ఏళ్లవారితోనూ, 13 సంవత్సరాల వయస్సులో 17 ఏళ్ల వారితో.. అలాగే తనకు 15 వచ్చేసరికి 19 ఏళ్లవారితో కలిసి ఆడటం మొదలెట్టాడంటారు తండ్రి కృష్ణమూర్తి. రచిన్ చాలా ఎత్తుకు ఎదుగుతాడని అనిపించినా… అదెప్పుడు సాకారమవుతుంది.. అందుకు న్యూజిలాండ్ టీమ్ లో అతడికి ఎప్పుడు అవకాశం లభిస్తుందన్న ఒక టెన్షన్ మాత్రం మాలో ఉండేదంటారాయన. కానీ, జీవితంలో ఎదగాలంటే మాత్రం చాలా లక్షణాలను అలవర్చుకోవాలి, చాలా చాలా మనల్ని మనం మార్చుకోవాలి.. అవన్నీ చేశాడుగనుకే ఇవాళ తన కొడుకు అంతెత్తుకెదగాడని.. సంతోషంగా ఉందంటున్నారు.
ఇండియాతో మొదటి టెస్టులో జిడ్డు ఆట గురించి!
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టులో మొదటిసారి ఆరంగ్రేటం చేసిన రచిన్ 91 బాల్స్ ఎదుర్కొని కేవలం 18 బంతులు చేశాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, అంత ఒత్తిడిలో మిగిలినవాళ్లెవ్వరూ నిలదొక్కుకోకపోతున్న క్రమంలో.. టెస్టును డ్రాగా ముగించేందుకు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటమే ఆ సందర్భంలో కావాలి. రచిన్ అదే చేశాడు. అందుకే సక్సెస్ అయ్యాడంటారు కృష్ణమూర్తి. రచిన్ బ్యాటింగ్, బౌలింగ్ అనే కాదు.. క్రికెట్ లో అన్ని కోణాల్లోనూ తాను ఎప్పుడు తక్కువ కాదనిపించుకునే విధంగా ఆడాలన్నదే తండ్రిగా తన కోరిక అంటారాయన.
ముఖ్యంగా బ్యాటింగ్ లో రాహూల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, రాస్ టేలర్, లారా, ఇంజమామ్, హెడెన్ వంటివారు రచిన్ కు ఇన్సిపిరేషన్. అలాగే, బౌలింగ్ లో బౌల్ట్, వెట్టోరీలను అభిమానిస్తాడు. అయితే, భారత్ నుంచి న్యూజిలాండ్ కు వెళ్లిన మేం వెల్లింగ్టన్ లో చాలా ఆనందంగా ఉన్నాం. అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్, లివింగ్ కండిషన్స్ అన్నీ మాకు బాగా నచ్చుతాయి. పైగా ఆ దేశం నుంచి భారతదేశం నుంచి వలసవెళ్లిన తమ కొడుకు క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం… తానారాధించే ఎందరో లెజెండ్స్ మన్ననలు పొందడం… ఒక తండ్రిగా గర్వకారణంగా ఉందన్నది ఆ ఇంటర్వ్యూ సారాంశం.
మొత్తంగా 25 ఏళ్లు దాటి 26వ వడిలోకి అడుగుపెడుతున్న రచిన్.. న్యూజిలాండ్ తరపున మరిన్ని విధ్వంస రచనలు చేసి.. నమ్ముకున్న ఆ జాతికి.. అలాగే, మూలాలున్న తన భారతదేశానికీ మరింత గర్వకారణమవ్వాలని ఆశిద్దాం.



