పరేష్ తుర్లపాటి ✍️
జపాన్ ప్రజలందరూ కలిసి కన్నీటితో హచికోకు విగ్రహం కట్టించారు..ఎందుకో తెలుసా?

ఇంతకీ ఈ హాచికో ఎవరు?
అసలు జపాన్ ప్రజలు హచికోకు విగ్రహం ఎందుకు కట్టించారో తెలుసుకోవాలంటే ఈ రియల్ స్టోరీ చదవాల్సిందే
హచికో జపాన్లోని ఓ ప్రొఫెసర్ గారి పెంపుడు శునకం
1923 లో ప్రొఫెసర్ గారు ఈ కుక్కను ఇంటికి తెచ్చుకున్నారు
ఈ కుక్కకు ప్రొఫెసర్ గారంటే ప్రాణం
ప్రొఫెసర్ గారికి ఈ కుక్కంటే వల్లమాలిన ప్రేమ
అయితే ఆయన వృత్తిరీత్యా రోజూ ట్రైన్లో పొరుగూరు వెళ్ళి సాయంత్రానికి రావాల్సి ఉంటుంది
హచికో రోజూ ఉదయం ప్రొఫెసర్ గారి తో పాటు రైల్వే స్టేషన్ కు వెళ్ళి సెండాఫ్ ఇచ్చి తిరిగి సాయంత్రం ఆయన రిటర్న్ ట్రెయిన్ కు వచ్చే టైమ్ కి స్టేషన్లో వెయిట్ చేసి వెల్ కమ్ చెప్పేది
1923 నుంచి 1925 వరకు రోజూ ఇద్దరికీ ఇదొక దినచర్య అయిపోయింది
అనుకోకుండా 1925 లో ప్రొఫెసర్ గారికి స్ట్రోక్ వచ్చి చనిపోవడంతో ఈవినింగ్ ట్రెయిన్ కి రిటర్న్ వచ్చే అవకాశం శాశ్వతంగా లేకుండా పోయింది
ఈ విషయం హచికోకు తెలీదు
మామూలుగానే తన యజమాని కోసం సాయంత్రము స్టేషన్ కు వచ్చి వేచి చూసింది
యజమాని జాడ లేదు
అలా 1925 నుంచి 1935 వరకు పది సంవత్సరాల పాటు రోజూ స్టేషన్లో సరిగ్గా యజమానిని రిసీవ్ చేసుకునే ప్రాంతానికే రావడం.. యాజమాని కనిపిస్తాడేమో అని ఆశగా రైళ్లన్నీ చూడటం..ఇదే హచికో పని
యజమాని చనిపోయాడని దానికి తెలీదు
కానీ యజమాని మీద తన మనసులో ఉన్న ప్రేమను జీవితాంతం చంపుకోలేదు
యజమాని కోసం పది సంవత్సరాల పాటు అదే స్టేషన్లో వెతికి చూసి వెతికి చూసి ఆఖరికి అక్కడే కన్ను మూసింది
ఈ ఉదంతం జపాన్ ప్రజలను కలచివేసింది
కన్నీటితో అదే స్టేషన్ ఆవరణలో హచికోకు విగ్రహం కట్టించారు
ఆ విగ్రహం ఇప్పటికీ ఉంది
ఇది కదా చరిత్ర అంటే
ప్రేమకు మరణం లేదని చనిపోయి కూడా జపాన్ ప్రజల గుండెల్లో నేటికీ జీవించి ఉన్న హచికో నిజంగా గ్రేట్
చాలామంది మనుషులు తెలుసుకోవాల్సిన యధార్థ గాథ
తటవర్తి రాధాక్రిష్ణ మూర్తి గారి వాల్ లో ఈ వీడియో చూడగానే హచికో కన్నీటి గాథ రాయకుండా ఉండలేకపోయాను
చక్కటి వీడియో షేర్ చేసినందుకు థాంక్యూ సర్



